Vitamin K Rich Foods : విటమిన్ కె వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా? కె విటమిన్ పుష్కలంగా లభించే ఆహరాలు ఇవే!

By manavaradhi.com

Published on:

Follow Us

మ‌న శ‌రీరానికి అత్యంత అవ‌స‌రం అయ్యే విట‌మిన్ల‌లో విట‌మిన్ కె కూడా ఒక‌టి. చాలా మందికి విట‌మిన్ కె ఉన్న ఆహారం గురించి అంత‌గా తెలియ‌దు. నిజానికి మిగిలిన విట‌మిన్ల‌తోపాటు విట‌మిన్ కె కూడా మ‌న‌కు అవ‌స‌ర‌మే. విట‌మిన్ కె ఉన్న ఆహారాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల ఎముకల ద‌గ్గ‌ర నుంచి గుండె వ‌ర‌కు ప్ర‌తి అవ‌య‌వానికి ఎంతో లాభం ఉంటుంది. విట‌మిన్ కె వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి లాభాలు ఉంటాయో, కె విట‌మిన్ ఏయే ఆహారాల్లో మ‌న‌కు ల‌భిస్తుంది.

మ‌న శ‌రీరానికి అవ‌స‌రం అయ్యే విట‌మిన్ల‌లో విట‌మిన్ కె కూడా ఒక‌టి. సాధార‌ణంగా చాలా మందికి విట‌మిన్ ఎ, బి, సి లు ఉన్న ఆహారాల‌ను తినాల‌ని తెలుసు. కానీ కె విట‌మిన్ ఉన్న ఆహారం గురించి అంత‌గా తెలియ‌దు. నిజానికి మిగిలిన విట‌మిన్ల‌తోపాటు కె విట‌మిన్ కూడా మ‌న‌కు అవ‌స‌ర‌మే. విట‌మిన్ కె ఉన్న ఆహారాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల ఎముకల ద‌గ్గ‌ర నుంచి గుండె వ‌ర‌కు ప్ర‌తి అవ‌య‌వానికి ఎంతో లాభం ఉంటుంది. మ‌న శ‌రీరంలో ఏ భాగానికి అయినా గాయం అయిన‌ప్పుడు ర‌క్తం స్ర‌విస్తుంది. అయితే అలా స్ర‌వించే ర‌క్తం వెంట‌నే గ‌డ్డ క‌డుతుంది కూడా. శ‌రీరం నుంచి ర‌క్తం ఎక్కువ‌గా పోకుండా ఉండేందుకు ర‌క్తంలో ఉండే కె విట‌మిన్ ర‌క్తాన్ని గ‌డ్డ క‌ట్టేలా చేస్తుంది. క‌నుక కె విట‌మిన్ ఉన్న ఆహారాన్ని మ‌నం తీసుకోవాల్సిందే.

ఎముక‌లు దృఢంగా ఉండేందుకు కూడా విట‌మిన్ కె మ‌న‌కు ఉపయోగ‌ప‌డుతుంది. ఆస్టియోపోరోసిస్ అనే కీళ్ల వ్యాధి రాకుండా ఉండాలంటే రోజూ విట‌మిన్ కె ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. ముఖ్యంగా మ‌హిళ‌లు విట‌మిన్ కె ఎక్కువ‌గా అందేలా చూసుకోవాలి. విటమిన్ కె వల్ల గుండెకు మేలు జరుగుతుందన్న విషయం చాలామందికి తెలియదు. గుండె ధమనుల మీద కాల్షియం పేరుకుపోకుండా కాపాడి గుండెకి చేరే రక్తసరఫరాలో ఎలాంటి అడ్డంకులూ లేకుండా విట‌మిన్ కె స‌హాయ ప‌డుతుంది.ప‌లు ర‌కాల క్యాన్స‌ర్లు రాకుండా చూడ‌డంలోనూ విట‌మిన్ కె మ‌న‌కు సహాయ ప‌డుతుంద‌ని ప‌రిశోధ‌న‌లు వెల్ల‌డిస్తున్నాయి.

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం విటమిన్ కెను మన రెగ్యులర్ డైట్ లో తప్పనిసరిగా చేర్చుకోవల్సి ఇక ముఖ్యమైన విటమిన్ ఇది. ఇది కొవ్వులో కరిగే విటమిను. విటమిన్-కె సహజంగా రెండు రకాలుగా లభ్యమవుతుంది. మొక్కల నుంచి లభ్యమయ్యేది విటమిన్-కె1. జంతుకణాలు, బ్యాక్టీరియాల నుంచి లభ్యమయ్యేది విటమిన్-కె2. విటమిన్-కె దాదాపుగా అన్ని ఆహార పదార్థాల్లో కొద్ది మోతాదులోనైనా ఉంటుంది. దీన్ని మనపేగులోని బ్యాక్టీరియా సంశ్లేషిస్తుంది.

ముఖ్యంగా పాలకూర, కాలీఫ్లవర్, సోయాబీన్, గోధుమ, కాలేయం లాంటి వాటిలో ఎక్కువగా ఉంటుంది. డార్క్ లీఫీ వెజిటేబుల్స్ లో విటమిన్ కె అధికంగా ఉంటుంది. ఒక కప్పు ఉడికించిన బ్రొకోలీలో 220మిల్లీగ్రాములు విటమిన్ కె ఉంటుంది. కాలే ఒక హెల్తీ ఫుడ్. ఇందులో విటమిన్ కె పుష్కలంగా ఉంటుంది . ఇది కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది, జీర్ణక్రియను శుభ్రపరుస్తుంది మరియు క్యాన్సర్ ను నివారిస్తుంది. తులసి ఆకుల్లో కూడా విటమిన్ కె అధికంగా ఉంటుంది.1/4కప్పు తులసి ఆకులో మ్యాంగనీస్, పొటాషియం, కాపర్ పుష్కలంగా ఉంటుంది.

  • ఆరోగ్యకరమైన బోన్స్ కలిగి ఉండాలంటే విటమిన్ కె ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. విటమిక్ కె లోపమున్న వారిలో బోన్ ఫ్రాక్చర్ అయ్యే ప్రమాధం ఎక్కువగా ఉంది.
  • పాలకూర, తోటకూర, గోంగూర, బచ్చలి వంటి ఆకుపచ్చని రంగులో ఉండే ఆకుకూరల్లో విటమిన్ కె పుష్కలంగా లభిస్తుంది. వీటిల్లో విటమిన్ కె తో పాటూ విటమిన్ ఎ ,విటమిన్ సి లు కూడా ఉన్నాయి. కనుక వీటిని రోజూ తింటే బోలెడంత ఆరోగ్యం .
  • ఒక కప్పు ఉడికించిన ఆకుకూరలలో 800గ్రాముల విటిమన్ కె ఉంటుంది. క్యాబేజ్ ను కూరగానే కాదు చైనీస్ ఫుడ్ లపై చల్లుకుని కూడా తింటారు. అలాగే సలాడ్ లాగా కూడా తినవచ్చు. ఏ రకంగా తిన్నా వీటిల్లో విటమిన్ కె, విటమిన్ సి , విటమిన్ బి6 శరీరానికి అందుతాయి. ఇది కొలెస్ట్రాల్ తగ్గించడానికి సహకరిస్తుంది.
  • గ్రీన్ పీస్ తినే మార్గాలు బోలెడు. వీటినీ కూరల్లో వేసుకోవచ్చు లేదా వాటితో అనేక రకాలుగా స్నాక్స్ తయారుచేసుకోవచ్చు. వారానికి రెండు మూడు సార్లయినా పచ్చి బఠానీలను ఆహారంలో తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఇందులో ఉండే విటమిన్ ఎ, సి, కెలు ఆరోగ్యాన్ని సమతూకంలో ఉంచుతాయి. బఠానీల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. వీటిని నిత్యం ఆహారంలో భాగం చేసుకుంటే విట‌మిన్ కె లోపం రాకుండా జాగ్ర‌త్త ప‌డ‌వ‌చ్చు.

విటమిన్ కె లోపం ఉన్న వారికి బోన్ ఫ్యాక్చర్ ప్రమాదం ఉంటుంది. అలాగే గుండెలో రక్తం గడ్డకట్టకుండా చూస్తుంది. క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా కూడా విటమిన్ కె తోడ్పడుతుంది. విటమిన్ కె పుష్కలంగా ఉన్న ఆహార పదార్థాలు నిత్యం ఆహారంలో ఉండేట్టు చూసుకుంటే.. మన ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోవచ్చు.

Leave a Comment