Colon Cancer: ఈ ఆహార పదార్థాలతో పెద్దపేగు క్యాన్సర్‌కు చెక్‌..!

By manavaradhi.com

Published on:

Follow Us
Best and Worst Foods to Prevent Colorectal Cancer

మన జీర్ణవ్యవస్థలో చివరన ఉండే పెద్దపేగు… పేరుకు తగ్గట్లే కీలకమైన విధులు నిర్వహిస్తుంటుంది. ఆహారంలోని నీటిని, పొటాషియమ్ వంటి లవణాలను, కొవ్వులో కరిగే విటమిన్లను అది గ్రహించి శరీరానికి అందిస్తుంది. దాంతోపాటు శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపించివేస్తుంది. ఇంతటి కీలకమైన పెద్దపేగును వైద్యపరిభాషలో కోలన్ అంటారు. పెద్ద పేగు భాగంలో కణితులు ఏర్పడితే కొలెరెక్టల్ క్యాన్సర్‌గా చెబుతారు.

క్రమంగా లేని ఆహారపు అలవాట్లు, అనారోగ్య జీవన శైలితో ఇటువంటి క్యాన్సర్ వస్తుందని చెబుతారు. ఎక్కువ వయస్సు వారికి ఇది వచ్చే చాన్సు ఎక్కువ. అధికంగా మాంసం తినటం, అధికంగా ఆల్కహాల్ తీసుకోవటం వంటివి దీనికి దారి తీయవచ్చు. ఆధునిక ఆహార పద్ధతి మరియు జీవనశైలి లో మార్పులు చేయడం వలన కూడా 70% పెద్దప్రేగు కాన్సర్ కేసులను నివారించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

పీచుపదార్థాలన్నవి పెద్దపేగు ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో కీలక భూమిక పోషిస్తాయి. జీవనశైలిలో వస్తున్న మార్పులతోపాటు తీసుకునే ఆహారం కూడా క్యాన్సర్‌ సోకడానికి కారణమవుతున్నాయని పలు పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. కాన్సర్‌కు ప్రధాన కార కాలైన వేపుళ్లు, నిల్వ పచ్చల్లు, ప్రాసెసెడ్‌ ఫుడ్‌, పొగాకు ఆధారిత ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. నిత్యం డైరీ ఉత్ప‌త్తులు తీసుకోవ‌డం ద్వారా కోల‌న్‌ను బ‌లంగా ఉంచే క్యాల్షియం అందుతుంది. అలాగే విట‌మిన్ డీ స‌ప్లిమెంట్స్ కూడా ప‌నిచేస్తాయి.

రెగ్యులర్ డైట్ లో 15గ్రాముల తగ్గకుండా ఫైబర్ ఫుడ్స్ ను తీసుకోవడం వల్ల ఇది కోలన్ క్యాన్సర్ ను నివారిస్తుంది. ఓట్ మీల్‌, గోధుమ‌లు, బ్రౌన్ రైస్ , గోధుమ‌ల‌తో త‌యారైన బ్రెడ్ తీసుకోవ‌డం చాలా మంచిది. ఫొల్లేట్ ల‌భించే ఆరెంజ్ జ్యూస్, ఫోర్టిఫైడ్ సెరల్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, డార్క్ లీఫీ వెజిటేబుల్స్, లెగ్యుమ్స్ ను రెగ్యులర్ గా తీసుకోవాలి. విట‌మిన్ బీ, ఈ ల కోసం చిక్కుడు గింజ‌లు, సోయాబీన్స్‌, బ‌టానీలు తీసుకోవాలి.

  • మన ఆహారంలో ఆకుపచ్చటి తాజా ఆకుకూరలు, కూరగాయలు, తాజా పండ్లు లాంటి పీచు ఎక్కువగా ఉండే శాకాహారం ఎక్కువగా తీసుకోవాలి.
  • కోల‌న్ క్యాన్స‌ర్‌ను నివారించడంలో ఫైటో కెమిక‌ల్స్ ప్ర‌ధాన పాత్ర పోషిస్తాయి. అందుకని ఫైటో కెమిక‌ల్స్ ల‌భించే బ్రొకోలీ, కాలీఫ్లవర్, క్యాబేజ్ వంటి క్యూసిఫెర‌స్ వెజిటెబుల్స్ , పండ్ల‌ను నిత్యం డైట్‌లో చేర్చుకోవాలి.
  • రోజుకు ఒకటి, రెండు వెల్లుల్లి రెబ్బలను వారం పాటు తినడం వల్ల కోలన్ క్యాన్సర్ రిస్క్ ను తగ్గించుకోవచ్చు.
  • నిత్యం క‌ప్పు లోఫ్యాట్ పాలు తీసుకోవ‌డం చాలా మంచిది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కోసం ఎక్కువ‌గా చేప‌లు తీసుకోవాలి.
  • మాంసాహారం తీసుకునే వారు రెడ్ మీట్ వంటి వేటమాంసం కంటే చికెన్, చేపలు తీసుకోవడం మంచిది.
  • ఇక మాంసాహార ప్రియులు తమకు ఇష్టమైన మాంసాహారాన్ని తీసుకునే సమయంలో దానికి తగినట్లుగా అంతేమోతాదులో గ్రీన్‌సలాడ్స్ రూపంలో శాకాహారం తీసుకుంటూ మాంసాహారంతో వచ్చే రిస్క్‌ను తగ్గించుకోవచ్చు.
  • మ‌ద్యం, సిగ‌రెట్ స్మోకింగ్ మానుకోవాలి.

Leave a Comment