ఆరోగ్యం బాగా లేదంటే వైద్యులు బ్రెడ్ తీసుకోమని సలహా ఇస్తారు. అదే విధంగా మైదాతో చేసిన ఆహారం మంచిది కాదని వైద్యులే అంటూ ఉంటారు. చాలా మంది బ్రెడ్ తో శాండ్ విచ్ మొదలుకుని, హల్వా వరకూ చేసుకుని ఆహారంగా తీసుకుంటారు. ఈ పరిస్థితుల్లో అసలు బ్రెడ్ తినడం మంచిదేనా, ఏ విధంగా తినాలి, ఎలాంటి బ్రెడ్ ఆరోగ్యానికి మంచి, బ్రెడ్ ను ఆహారంగా తీసుకునే విషయంలో పాటించాల్సిన జాగ్రత్తలేంటి..?
ప్రధానంగా బ్రెడ్ ను ధాన్యాలతో తయారు చేస్తారు. అందువల్లే వాటిలో కొన్ని రకాల కార్బోహైడ్రేట్స్, క్రొవ్వులు, తీపి పదార్థాలు కలిగిన పిండి పదార్థాలు ఉంటాయి. అందుకే బ్రెడ్ కొంచెం అంటుకొనేలా జిగటగా అనిపిస్తుంది. ఇటువంటివి గుండె ఆరోగ్యానికి మంచివి కాదు. నిజానికి, బ్రెడ్స్ లో వివిధ రకాలున్నాయి. అందులో చాలా వరకూ గుండెకు ఆరోగ్యకరం. సాధారణంగా మనం అందరం ఎక్కువగా చూసేది వైట్ బ్రెడ్ ఇందులో క్రొవ్వులు మరియు కొలెస్ట్రాల్ అధికంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి.
అదేవిధంగా లోఫ్యాట్ బ్రెడ్ కూడా ఉన్నాయి. వీటిని సాధారణంగా బ్రౌన్ బ్రెడ్ అని పిలుస్తుంటాం. ఈ బ్రౌన్ బ్రెడ్ ను సోయాతో తయారు చేస్తారు. గుండె ఆరోగ్యానికి మేలు చేసే ఇతర బ్రెడ్ రకాలు తృణధాన్యాలతో తయారు చేసే బ్రెడ్ గోధుమ బ్రెడ్. చాలామంది సాండ్ విచ్ కోసం వైట్ బ్రెడ్ ఉపయోగిస్తుంటారు. వైట్ బ్రెడ్ లో ఎలాంటి ఫైబర్ ఉండదు. గ్లైసెమిక్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఇది రక్తంలో చక్కెరను పెంచుతుంది. ఇది రక్తపోటు, ఇతర గుండె సంబంధిత వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది. అధిక రక్తపోటు సమస్య కూడా వస్తుంది. అందువల్ల వీలైనంత వరకు వైట్ బ్రెడ్ కు దూరంగా ఉండండి. బ్రౌన్ బ్రెడ్ ను వాడండి. ఇది ఆరోగ్యానికి చాలా ఉపయోగకరం.
తృణధాన్యాలతో తయారు చేసిన బ్రెడ్ లో ఆరోగ్యకరమైన పిండి పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. మరికొన్న రకాల బ్రెడ్ లు చిరుధాన్యాలు ఫ్లాక్స్ సీడ్స్ మరియు వాల్ నట్స్ తో తయారు చేస్తారు. ఎందుకంటే వీటిలో ఒమేగా 3ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. అంతే కాదు వీటిలో మంచి కొలెస్ట్రాల్ కూడా అధికంగా ఉంటుంది. ఈ రకమైన బ్రెడ్ కూడా గుండె ఆరోగ్యానికి మంచిదే. గోధుమ పిండితో తయారు చేసే బ్రెడ్. గోధుమ బ్రెడ్ ను ముతక లేదా పాలిష్ పట్టని గోధుమలతో తయారు చేస్తారు. అందువల్లే ఇది ఆరోగ్యానికి మంచిది మరియు ఇందులో ఫైబర్స్ మరియు పిండిపదార్థాలు అధికంగా ఉండి, గుండెకు మేలు చేస్తాయి.
బ్రౌన్ బ్రెడ్ ను గోధుమ మరియు సోయా పిండి కలయికతో తయారు చేస్తారు. అందుకే అది బ్రౌన్ కలర్ లో ఉంటుంది. ఇది జిగట లేని కారణంగా ఇది లోఫ్యాట్ కలిగి ఉండటం చేత ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. మల్టీ గ్రెయిన్ బ్రెడ్ అంటే ఆరోగ్యానికి మేలు చేసే వివిధ రకాల ధాన్యాలు గోధుమలు, రే, మిల్లెట్ మొదలగువాటితో తయారు చేస్తారు. అందువల్లే ఇందులో డైటేరియన్ ఫైబర్ అధికంగా ఉంటుంది. రై బ్రెడ్ మనకు అందుబాటులో ఉండే, ఆరోగ్యవంతమైన బ్రెడ్ రకాలలో ఇది ఒకటి. కానీ ఇందులోని తృణధాన్యాలతో తయారు చేసిన రుచి అందిస్తున్నదా లేదా అని నిర్ధారించుకోవాలి.
బ్రెడ్లను తక్కువ మొత్తంలో మాత్రమే తినాలి. బ్రెడ్ ను ఏ రూపంలో తీసుకొన్న మీ శరీరంనకు ఎటువంటి పోషణను అందించదు. అంతేకాక ఫైబర్ కూడా ఉండదు. మీరు ఇప్పటికీ కొన్ని గోధుమ బ్రెడ్లను లేదా పూర్తి ధాన్యం బ్రెడ్లను తీసుకొంటే ఎక్కువ మొత్తంలో కాకుండా కొన్ని పోషకాలను మాత్రమే అందిస్తుంది. ఎక్కువ సోడియం కంటెంట్ కలిగి ఉన్నది బ్రెడ్ లో అధిక రక్తపోటుకు మరియు గుండె వ్యాధులకు దోహదం చేసే సోడియం ఎక్కువ స్థాయిలో ఉంటుంది. బ్రెడ్ ను ప్రతి రోజు అల్పాహారంగా తీసుకొంటే శరీరం లో ఉప్పు ఎక్కువ స్థాయిలో ఉండటానికి కారణమవుతుంది. బ్రెడ్ ను బర్గర్లు మరియు శాండ్విచ్లు రూపాల్లో ఎక్కువగా తీసుకోవటం వలన గుండె వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. బరువు పెరుగుటకు దోహదం చేస్తుంది. బ్రెడ్ లో చాలా తక్కువ కేలరీలు కలిగి ఉండుట వలన వాటిని మనం ప్రతి రోజు అల్పాహారంగా తీసుకుంటే మనం చాలా కేలరీలు తిసుకున్నట్టే అవుతుంది. కేకులు లేదా బర్గర్లు రూపంలో ఉన్నప్పుడు అదనంగా ఉప్పు లేదా శుద్ధి చేసిన చక్కెర ఉండటం కూడా బరువు పెరుగుట దోహదం చేస్తుంది.
తెలుపు బ్రెడ్ తో సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కార్బ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అయితే ఇతర పోషకాలను కలిగి ఉండదు. ఆహారం తిన్నాక కూడా కడుపు ఖాళీ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. పిండిపదార్థాలు ఎక్కువగా ఉంటాయి. బ్రెడ్ తయారిలో అనేక వస్తువులను కలపటం వలన భారీ మోతాదులో కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటుంది. తక్కువ మోతాదులో తిన్నప్పుడు పిండిపదార్ధాలు మీ శరీరంనకు లాభం చేకుర్చినప్పటికి ఎక్కువ మొత్తంలో తిన్నప్పుడు మీకు హానిని కలిగిస్తాయి. అధిక మోతాదు పిండి పదార్థాలను ఎక్కుడ మోతాదులో తీసుకొంటే జ్ఞానపరమైన క్రియలు యొక్క తగ్గుదల అంటే ‘బ్రెయిన్ ఫాగ్’కు కారణం కావచ్చు.