మన శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గినప్పుడు కొన్ని రకాల సమస్యలు ఎదురౌతూ ఉంటాయి. అలాంటి వాటిలో జలుబు కూడా ఒకటి. జలుబు చేయడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అయితే కొంత మందిలో ఇది ఒక పట్టాన తగ్గదు. ఎప్పుడూ ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. అలాంటి జలుబుకు కారణాలు ఏమిటి. ఏయే పరిస్థితుల వల్ల జలుబు ఆగకుండా ఇబ్బంది పెడుతూనే ఉంటుందో తెలుసుకుందాం…
మన జీవితాలలో మనందరం ఎప్పుడోఅప్పుడు జలుబును అనుభవించే ఉంటాం. జలుబును ఎదుర్కొనే రోగనిరోధక శక్తి మనలో ఎవరికీ ఉండదు. 200 వైరస్లు ఒకేసారి అటాక్ చేస్తే వచ్చేదే జలుబు. దీంతో ముక్కు దిబ్బడ, గొంతులో గరగరా, శ్వాసకోశ సంబంధమైన ఇబ్బందులు ఏర్పడతాయి. దగ్గుతో పాటు తుమ్ములు ఎక్కువగా వస్తాయి. ఇంట్లో ఒకరికి వచ్చిందంటే అది త్వరగా ఇతర సభ్యులకు కూడా అంటుకుంటుంది .జలుబు అనేది బ్యాక్టీరియా లేదా వైరస్ ఇన్ఫెక్షన్ వలన శరీరానికి సోకుతుంది. సాధారణంగా, జలుబు చేసినప్పుడు, ఇతర లక్షణాలైన జ్వరం,తలనొప్పుల వంటి వాటితో పోలిస్తే తగ్గటానికి ఎక్కువ సమయం పడుతుంది. జలుబు చేసినప్పుడు, రోజువారీ పనులు చేసుకోటం కొంచెం కష్టమవుతాయి. తలనొప్పి, ముక్కు కారుతుండటం, శ్వాస తీసుకోవటంలో కష్టాలు, ముక్కులో దురద,ముక్కుదిబ్బడ, అలసట వంటి లక్షణాలు ఉంటాయి. సాదారణంగా పెద్దవారికి ఏడాదికి 2-5సార్లు జలుబుచేస్తుంది. అదే పన్నెండేళ్లలోపు పిల్లలకి ఏడాదికి 6-10సార్లు సగటున జలుబు రావచ్చు. పిల్లల్లో రోగనిరోధకశక్తి బలహీనంగా ఉండటం వల్ల వారు తరచుగా జలుబుకి గురౌతారు. జలుబుని నివారించేందుకు రోగనిరోధక శక్తిని ఆరోగ్యంగా ఉంచుకోవటంతోపాటు, చేతులను తరచూ కడుక్కోవాలి.
జలుబును పోగోట్టే ఆహారాలు ఏంటి….?
కాలంతో పాటుగా మన శరీరంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయని తేలింది. మన డీఎన్ఏలో మార్పులు రావడం, రోగనిరోధకశక్తి క్షీణించడం వంటి పరిస్థితులు ఏర్పడతాయి. పైగా ఈ సమయంలో సూర్యరశ్మి నుంచి విటమిన్ డి కూడా తక్కువగానే అందుతుంది. విటమిన్ డి లోపం మనలోని రోగనిరోధకశక్తిని మరింతగా క్రుంగతీస్తుంది. ఫలితంగా జలుబుని వ్యాపించే వైరస్లు మనమీద దాడిచేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గ్రీన్ టీలో వ్యాధులతో పోరాడే ఆమ్లజనకాలు ఎక్కువగా ఉంటాయి. ఇది యాంటీ వైరల్ గా పని చేస్తుంది. ఇందులో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. వెల్లుల్లిలో యాంటీవైరల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. జలుబుతో పోరాడే గుణాలు వెల్లుల్లిలో ఎక్కువగా ఉంటాయి. అల్లంలో సెస్క్విటర్పెన్స్ అనే రసాయనాలుంటాయి. ఇది జలుబుపై పోరాడడుతుంది. పసుపులో అధిక ఆమ్లజనకాలుంటాయి. ప్రతి రోజూ మనం తినే ఆహారంలో పసుపు ఉండేలా చూసుకోవాలి. పసుపులో ఉండే యాంటీ బయోటిక్, యాంటీ వైరల్ గుణాల వల్లే జలుబు త్వరగా తగ్గుతుంది.
యాపిల్స్ లో ఆమ్లజనకాలు అధికంగా ఉంటాయి. ఇవి జలుబుతో బాగా పోరాడతాయి. ఆరెంజ్ లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది వైరల్ ఇన్ఫెక్షన్లతో బాగా పోరాడగలదు. జలుబును తగ్గించేందుకు ఆరెంజ్ బాగా ఉపయోగపడుతుంది. పుట్టగొడుగులు మనలోని రోగనిరోధకశక్తిని పెంచుతాయి. సాధారణంగా మనకొచ్చే జలుబు విషయంలో పుట్టగొడుగులు బాగా పని చేస్తాయి. చిలగడదుంపలలో విటమిన్ ఏ, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవి వ్యాధినిరోధకశక్తిని పెంచుతాయి.
జలుబు చేసినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి…?
జలుబు చేసినప్పుడు ఏ ఆహారాలు పడితే అవి తినకూడదు. అలా తినడం వల్ల సమస్య మరింత తీవ్రమౌతుంది. ముఖ్యంగా కామన్ కోల్డ్ మరియు ఇన్ఫెక్షన్స్ ను నివారించుకోవడానికి హిస్టమైన్ అధికంగా ఉన్న ఆహారాలు అసలు తీసుకోకూడదు. అదే విధంగా శరీరంలో మ్యూకస్ ఉత్పత్తిని ప్రోత్సహించే ఆహారాలకు కూడా దూరంగా ఉండాలి. రెడ్ మీట్, అసిడిక్ ఫుడ్స్ కు కంప్లీట్ గా దూరంగా ఉండాలి. జలుబు చేసినప్పుడు అసిడిక్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల అధికంగా ఇన్ఫ్లమేషన్ కు మరియు శరీరంలో మరిన్ని ఆమ్లాలాలు ప్రసరణకు కారణం అవుతుంది. జలుబుతో బాధపడేవారు తప్పనిసరిగా చీజ్ కు కూడా దూరంగా ఉండాలి. . దీన్ని తినడం వల్ల మ్యూకస్ ప్రొడక్షన్ కు దారితీస్తుంది. జలుబు చేసినప్పుడు ఆయిల్ ఫుడ్స్ లేదా ఫ్రైడ్ ఫుడ్స్ కు ఖచ్చితంగా దూరంగా ఉండాలి. కోల్డ్ ఉన్నప్పుడు ఇలాంటి ఆహారాలు త్వరగా జీర్ణమవ్వవు. అంతే కాదు ఇలాంటి ఆహారాలు తిన్నప్పుడు, జీర్ణమవ్వడానికి ఎక్కువ ఎనర్జీ అవసరం అవుతుంది. కాబట్టి జలుబు చేసినప్పుడు ఏవిపడితే అవి తినకుండా మన రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలు తీసుకుంటూ జలుబు నుండి ఉపశమనం పొందంవచ్చు.