సీజనల్ గా వచ్చే పండ్లు, కూరగాయల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అన్ని ఇన్ని కావు..!

By manavaradhi.com

Published on:

Follow Us

మనకు మార్కెట్‌లో నేడు అనేక రకాల పండ్లు, కూరగాయలు అందుబాటులో ఉన్నాయి. వీటిని తీసుకుంటే శరీరానికి కావల్సిన పోషకాలను పొందడం మాత్రమే కాకుండా శక్తి కూడా అందుతుంది. వివిధ రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. పండ్లలో సహజంగానే ఫ్యాట్‌, సోడియం, క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. కొలెస్ట్రాల్‌ ఉండదు. ఎన్నో అతిముఖ్యమైన పోషకాలు పండ్లలో ఉంటాయి. పొటాషియం ఎక్కువగా ఉన్న పండ్లు, ఆహారపదార్థాలు తినడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. అరటిపండు, ఆప్రికాట్స్‌, కమలాపండ్లలాంటి వాటిల్లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. పండ్లలోని పీచుపదార్థాల వల్ల శరీరంలో బ్లడ్‌ కొలెస్ట్రాల్‌ ప్రమాణాలు తక్కువగా ఉంటాయి. కొలెస్ట్రాల్‌ తక్కువ ఉండడం వల్ల గుండెజబ్బులు వచ్చే అవకాశం బాగా తగ్గుతుంది. జీర్ణ క్రియ సక్రమంగా ఉండాలంటే తినే ఆహారంలో పీచుపదార్థాలు పుష్కలంగా ఉండాలి. పీచు పదార్ధాలు బాగా ఉన్న కూరగాయలు తినడం వల్ల మలబద్ధకం, జీర్ణవ్యవస్థకు సంబంధించిన జబ్బులు రావు. పండ్లు, కూరగాయలు బాగా తినడం వల్ల స్ట్రోక్‌ వంటివి వచ్చే అవకాశం తక్కువ. పండ్లు, కూరగాయలు బాగా తినడం వల్ల ఊబకాయం బారినపడరు. టైప్‌-2 డయాబెటిస్‌ రాదు. గుండెజబ్బులు వచ్చే అవకాశం లేదు.

  • కొన్ని పండ్లు కొన్ని సీజన్స్ లలో మాత్రమే దొరుకుతాయి. కొన్ని పండ్లు సంవత్సరానికి ఒక్కసారే దొరుకుతాయి. నేరేడు పండ్లు మ‌న‌కు మార్కెట్‌లో విరివిగా ల‌భిస్తాయి. నిగనిగలాడుతూ.. నోరూరించే వీటిని తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. వీటిని తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి దాదాపుగా అన్ని ర‌కాల పోష‌కాలు స‌మృద్ధిగా ల‌భిస్తాయి.
  • బొప్పాయిలో పీచు పదార్థం అధికం. బొప్పాయిలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఇది గాయం నయం చేయటానికి సహాయపడుతుంది, ఆక్సిడేటివ్ ఒత్తిడి కారణంగా క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. దగ్గు వంటి సాధారణ రుగ్మతలతో పోరాడడానికి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
  • దానిమ్మ ఆరోగ్యానికి చాలా మంచిది బరువు పెరగనివ్వదు మరియు ఇందులో పెద్ద మొత్తంలో పోషకాంశాలు కలిగి ఉంటాయి. దానిమ్మలోని విటమిన్ సి వ్యాధిని రోధకతను పెంచడానికి గొప్పగా సహాయపడుతుంది.
  • జామకాయ రక్తంలోని చక్కెర స్థాయిలను నెమ్మదిగా గ్రహించేల సహాయపడుతుంది. ఎక్కువగా ఫైబర్’ని కలిగి ఉండటం వలన డయాబెటిక్ వ్యాధులకు మంచి ఆహరం.
  • పుచ్చపండు నమ్మలేని విధంగా ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. రక్త పీడనాన్ని తగ్గించటమే కాకుండా సహజ సిద్దమైన డైయురేటిక్’గా పనిచేసి శరీరంలో నీటి మట్టాన్ని సమన్వయ పరుస్తుంది.
  • రోజూ పొటాషియం సమృద్ధిగా ఉండే ఖర్బూజా, నారింజ వంటి పండ్లు తినటం వల్ల రక్తపోటు పెరగకుండా.. అంటే హైబీపీ రాకుండా కొంత మేలు జరుగుతుంది. అలాగే వీటితో కిడ్నీల్లో రాళ్ల ముప్పు, ఎముక నష్టం వంటి సమస్యలూ దరికిరావు. మనం రోజువారీ ఆహారం తినేటప్పుడు దానిలో కనీసం సగభాగం పండ్లు-కూరగాయలతో నింపగలిగితే మనం తగినన్ని పండ్లు తిన్నట్టే.

తాజా పండ్లలో, కూరగాయల్లో తగినన్ని పోషకాలుంటాయి. అయితే, పోషక ప్రయోజనాలు కాస్తంత కూరగాయల్లోనే ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతుంటారు. బీట్ రూట్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాల పొందవచ్చు. కాలేయం పనితీరు మెరుగుపడటానికీ బీట్‌రూట్‌ తోడ్పడుతుంది. గర్భిణుల్లో ఆరోగ్యకరమైన కణజాలం వృద్ధి చెందేలా చేస్తుంది కూడా. ఈ శీతాకాలంలో దొరికే కాయగూరలలో కాలీఫ్లవర్ ఒకటి. ఆరోగ్యప్రయోజనాలను కూడా అధికంగా కలిగిఉంది. ఎందుకంటే కాలీఫ్లవర్లో విటమిన్ సి, లోఫ్యాట్, పుష్కలంగా ఉండి క్యాన్సర్‌తో పోరాడుతుంది. కాలీఫ్లవర్ సాధారణంగా ఎక్కువ మొత్తంలో ఫైబర్’లను కలిగి ఉండి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. క్యారెట్‌లోనున్న గుణాలు మరెందులోను ఉండవంటున్నారు వైద్యులు. మరి కొంతమంది క్యారెట్‌ను పచ్చి గా తినేందుకు ఇష్టపడతారే కానీ, వండి తే మాత్రం ఇష్టపడరు. ఇందులోని అధిక క్యాలరీలు పిల్లలు శారీర కంగా, మానసికంగా ఎదిగేలా చేయడమే కాక మేధో వికాసానికి ఎంతో తోడ్పడతాయని వైద్యులు చెబుతున్నారు. సోరకాయను ఆహారంలో భాగం చేసుకుంటే బరువు తగ్గే అవకాశం ఉంది. ఇందులో డయటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీనితో వండిన వంటలు తినడం వల్ల కడుపు నిండిపోయిన భావన కలుగుతుంది. కొలెస్ట్రాల్ పాళ్లు కూడా చాలా తక్కువగా ఉంటాయి. గుండె ఆరోగ్యానికి మంచి మేలు చేస్తుంది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కాకరలో ఎన్నో రోగాలను నయం చేసే ఆయుర్వేద గుణాలున్నాయి.

కడుపులో గ్యాస్ రానియ్యకుండా కాకరకాయ దోహద పడుతుంది. అదనంగా చేరిన పసరు రక్తంలోని మలినాలను తొలగిస్తుంది. తాజా కాయలు ఆస్తమా, జలుబు, దగ్గు మొదలైన శ్వాస సంబంధిత సమస్యల నివారణకు అద్భుతంగా పనిచేస్తుంది. మనకు మార్కెట్‌లో నేడు అనేక రకాల పండ్లు, కూరగాయలు అందుబాటులో ఉన్నాయి. వీటిని తీసుకుంటే శరీరానికి కావల్సిన పోషకాలను పొందడం మాత్రమే కాకుండా శక్తి కూడా అందుతుంది. కూరగాయలను స్నాక్స్ కు బదులు తీసుకోవాలి. ప్రతీ సీజన్ లో కొన్ని రకాల పండ్లు లభిస్తుంటాయి వీటిని కూడా తప్పక తినాలి. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉండగలం.

Leave a Comment