దాల్చిన చెక్క అనగానే మసాలా దినుసులతో పెద్ద పీట వేస్తాం. దాని సువాసనే వేరు, ఎక్కువగా అందుకే వాడుతాం కూడా. ఒక్క రుచి, సువాసనే కాకుండా.. దానివలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. దాల్చిన చెక్కలో కౌమారిన్ అనే ఒక సహజ పదార్థం ఉంది. వివిధరకాలుగా దీనిని తీసుకోవడం వలన శరీరానికి ప్రయోజనం కలిగి, ఎన్నో ఆరోగ్య సమస్యల నుండి దూరంగా ఉండవచ్చు.
మనం ఇంట్లో వాడుకునే దాల్చిన చెక్కతో చాలా ఉపయోగాలు ఉన్నాయి. వెయిట్ లాస్ కి సహకరించే అద్భుతమైన స్పైస్ గా దాల్చిన చెక్క పేరొందిందన్న విషయం తెలిసిందే. దాల్చిన చెక్క వలన కేవలం అధిక బరువు తగ్గడమే కాదు మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలను మనం పొందవచ్చు. ఈ హెల్త్ బెనిఫిట్స్ తో పాటు దీనిని ఎన్నో సౌందర్య చికిత్సలలో కూడా వాడతారు. అలాగే, దాల్చిన చెక్కను ఔషధంగా కూడా వాడతారు. వివిధ వంటకాలలో దాల్చిన చెక్కను వాడతారు. దీనిని జోడించడం వలన వంటకాల ఫ్లేవర్ పెరుగుతుంది. ప్రత్యేకించి సాంప్రదాయ వంటకాలలో దాల్చిన చెక్కను కచ్చితంగా వాడతారు.
న్యూట్రియెంట్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి దాల్చిన చెక్కలో పుష్కలంగా లభిస్తాయి. పొటాషియం, మాంగనీస్, కేల్షియం, జింక్ మరియు ఐరన్ లకు నిలయంగా దాల్చిన చెక్కను చెప్పుకోవచ్చు. ఈ న్యూట్రియెంట్స్ అనేవి బ్లడ్ ప్రెషర్ ని అలాగే బ్లడ్ షుగర్ లెవెల్స్ ని తగ్గించేందుకు ఉపయోగపడతాయి. అలాగే గైనకాలాజికల్ సమస్యలను, రెస్పిరేటరీ మరియు డైజెస్టివ్ సమస్యలను తగ్గించేందుకు కూడా దాల్చిన చెక్క తనదైన పాత్ర పోషిస్తుంది.
దాల్చిన చెక్క మన ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుంది…?
- దాల్చిన చెక్క తో చేసిన టీ తాగటం వలన జలుబు మరియు దగ్గు నుండి ఉపశమనం పొందుతారు.
- దాల్చిన చెక్క ఎక్కువగా ‘యాంటీ-బాక్టీరియల్’ గుణాలను కలిగి ఉన్నందున, రక్తప్రసరణ వ్యవస్థలో కలిగే ఆటంకాలను తొలగిస్తుంది. వ్యాధితో ఉన్నపుడు రక్తంలోని ఆక్సిజన్ శాతాన్ని పెంచి, వ్యాధి గ్రస్త కారకాలకు వ్యతిరేకంగా పనిచేసేలా చేస్తుంది.
- దాల్చిన చెక్క ఒక భిన్నమైన మసాలా. ఇది యాంటీ-మైక్రోబియల్ గుణాలను కలిగి ఉండటం వల్ల చర్మ రక్షణకి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇది యాంటీ-సెప్టిక్ గుణాలను కలిగి ఉండటం వల్ల గాయాలు మానటానికి మందుగా వాడతారు.
- దాల్చిన చెక్కని, జీర్ణాశయానికి సంబంధించిన సమస్యలకు చికిత్సగా వాడతారు, మరియు ఇది జీర్ణాశయాన్ని దాని విధులకు అనుకువగా ఉంచుతుంది.
- పచ్చి దాల్చిన చెక్కని తినటం వల్ల, కడుపులోని గ్యాస్’ను తొలగిస్తుంది. దాల్చిన చెక్క కాన్సర్ కారకాలతో అద్భుతంగా పోరాడి, వాటి వ్యాప్తిని తగ్గిస్తుంది.
- రోజు ఒక సగం చెంచా దాల్చిన చెక్క తీసుకోవటం వల్ల, ముఖ్యంగా కాన్సర్ ప్రమాదం నుండి కాపాడుతుంది. హానికర బాక్టీరియా వల్ల వచ్చే పంటి చిగురు సమస్యలలో కూడా దాల్చిన చెక్క సహాయపడుతుంది.
దాల్చిన చెక్క లభించే పోషకాలు ఏంటి…?
దాల్చిన చెక్క పోషకాల గని. దాల్చినలో మాంగనీస్, పీచు పదార్థం, కాల్షియం ఎక్కువ. అలాగే దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లకు కొదువలేదు. యాంటీ ఆక్సిడెంట్లు వ్యాధులతో పోరాడతాయి. శరీరంలో చేరిన విష పదార్థాలను తొలగిస్తాయి. దాల్చిని యాంటీ ఆక్సిడెంట్స్ ప్రయోజనాలు పరంగా చాలా శక్తివంతమైనది. చర్మ కణాల నష్టాన్ని తగ్గించి, వృద్ధాప్య ప్రక్రియను తగ్గిస్తుంది.
దాల్చిన యాంటి డయాబెటిక్ లక్షణాలు కలిగినది. రక్తంలో చెక్కెర మోతాదు ను తగ్గించడం లో తోడ్పడుతుంది. దాల్చిన కొన్ని అధ్యయనాల ప్రకారం మెదడుకు సంభందిన్చన అల్జిమర్ మరియు పార్కిన్సన్ వంటి రుగ్మతల బారిన పడకుండా కాపాడుతుంది. మన శరీరాన్ని వ్యాధుల బారినుండి కాపాడేందుకు దాల్చిన చాలా ఉపయోగ పడుతుంది. దాల్చినచెక్క రోగనిరోధక వ్యవస్థపై గణనీయంగా ప్రభావం చూపుతుంది, మానవ శరీరం యొక్క నిరోధక వ్యవస్థను బాగా పెంచుతుంది. దాల్చిన చెక్కలో వుంటే మాంగనీసు, డయాటరీ ఫైబర్, ఐరన్, కాల్షియం… ఇవన్నీ కూడా ఆరోగ్యానికి ఎంతో అవసరమైనవే. కాబట్టి దాల్చిన చెక్కని ఎన్ని రకాలుగా ఆహారంలో భాగం చేసుకోవచ్చు.
దాల్చిన చెక్కలో దాగి ఉన్న ఔషదగుణాల గురించి. జలుబు చేసినా, వేడి చేసినా, దగ్గు వస్తున్నా మీరు మీ వంటింట్లో దొరికే దాల్చిన చెక్కను తగిన విధంగా వాడితే వ్యాధులు తగ్గే అవకాశం చాలా ఉంది. మరి ఇన్ని అద్భుత ప్రయోజనాలున్న దాల్చిన చెక్కను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోండి మీ ఆరోగ్యాన్ని పెంపొందించుకొండి.