Spinach: పాలకూర ఆరోగ్యానికి మంచిదే.. కానీ ఎక్కువ తీసుకుంటే మంచిది కాదట..!

By manavaradhi.com

Updated on:

Follow Us
Health benefits and nutritional value of spinach

మనం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యం స‌రిగా లేకుంటే ఎన్ని ఉన్నా వేస్టే క‌దా.. అందుకే ఆరోగ్యంగా ఉండ‌మ‌ని నిపుణులు ప‌దే ప‌దే చెబుతుంటారు. అలా ఉండాలంటే ఆకుకూర‌లు ఎక్కువ‌గా తినాలి. అందులో పాల‌కూర ఎంతో ప్ర‌త్యేకమైనది.. వారానికి ఒక‌సారి పాల‌కూర తింటే పెద్ద రోగాల‌ను సైతం త‌రిమికొట్టొచ్చు అంటున్నారు వైద్యులు.

మనం నిత్యం తినే అనేక ఆకుకూరల్లో పాలకూర కూడా ఒకటి. పాలకూర పిల్లలకు, పెద్దలకు అవసరమైన పోషకాలను, శక్తిని అందిస్తుంది. దీనిని మీ ఆహారంలో ఒక భాగంగా చేర్చుకోవడం వల్ల, అనేకమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. పాలకూరలో ఉండే విటమిన్ ఎ మన కంటి చూపును మెరుగు పరుస్తుంది. అలాగే వయస్సు మీద పడడం వల్ల వచ్చే శుక్లాలు, ఇతర కంటి సమస్యలను రాకుండా చూస్తుంది.

నిత్యం పాలకూర ఆహారంలో భాగం చేసుకుంటే నేత్ర సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. అంతేకాక వీటిలో ఉన్న విటమిన్-A కళ్ళ మంటలను కూడా నిరోధిస్తుంది. పాలకూరను, మెదడుకు అవసరమైన చక్కని ఆహారం. ఇది ఫోలిక్ ఆమ్లం, విటమిన్ A, విటమిన్ C వంటి ఖనిజాలతో పాటు, అనేక ఇతర యాంటీ-ఆక్సిడెంట్లను కూడా కలిగి ఉంది. అంతేకాకుండా, ఇది మీ జ్ఞానశక్తిని మెరుగుపరుస్తుంది.

పాలకూర వల్ల కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏంటి …?
ప్రతిరోజూ పాలకూరను తినడం వల్ల, మీ రోజువారీ పోషక అవసరాలను తీర్చటానికి సహాయపడుతుంది. పాలకూర ఆకులలో ఫోలేట్, విటమిన్ సి, విటమిన్ ఎ, క్యాల్షియం, ఐరన్ మొదలైన వాటితో పూర్తిగా నిండి ఉంటాయి. మధుమేహం, మూత్రపిండాలలో రాళ్ళు, క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్ వంటి తీవ్రమైన ఆరోగ్య పరిస్థితుల నుంచి మిమ్మల్ని రక్షించటానికి ఇది సహాయపడుతుంది. ఇందులో రోగ నిరోధక సమ్మేళనాలను, యాంటీఆక్సిడెంట్లను ఎక్కువగా కలిగి ఉంటుంది. కాబట్టి ఇది శరీరంలో వచ్చే వాపులను నివారించి, దానిని చికిత్స చేయడంలో సహాయపడుతుంది.

పాలకూరలో విటమిన్ K పుష్కలంగా లభించడం వల్ల ఎముకలను బలంగా, ఆరోగ్యంగా ఉంటాయి. ఇది బోలు ఎముకల వ్యాధికి చికిత్స చేసి, దానిని నిరోధించగలదు. కాబట్టి, ప్రతిరోజు పాలకూరను తినడం వల్ల బోలు ఎముకల వ్యాధికి వ్యతిరేకంగా పోరాడటంలో సహాయపడుతుంది. పాలకూర నుంచి లభించే ఫైబర్ కారణంగా జీర్ణక్రియ సులభంగా అవుతుంది. పేగులు శుభ్రంగా ఉంటాయి. అందుకే మలబద్ధకాన్ని నివారించడంలో పాలకూర కీలకపాత్ర పోషిస్తుంది. మరోవైపు ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీరాడికల్స్ తో పోరాడతాయి.

పాలకూరలో ప్రోటీన్లు ఎక్కువగా ఉండటం వలన మీ కడుపు పూర్తిగా నిండిన అనుభూతిని ఎక్కువ కాలం పాటు ఉంచుతుంది. పాలకూరలో ఉండే విటమిన్ కె రక్తాన్ని త్వరగా గడ్డ కట్టేందుకు దోహదపడుతుంది. మన శరీరంలో తగినంత విటమిన్ కె లేకపోతే గాయాలు అయినప్పుడు పెద్ద ఎత్తున రక్తస్రావం అవుతుంది. దాన్ని ఆపాలంటే మన శరీరంలో విటమిన్ కె ఉండాలి.

పాలకూర వంటి ఆకుకూరలలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. త్వరగా బరువు తగ్గాలని కోరుకునే వారికి ఇది చాలా మంచిది.ఇది అధిక ఫైబర్ కలిగి ఉంది. పాలకూరలో ఉండే మెగ్నీషియం రక్తపీడనం నియంత్రణలో ఉండేందుకు సహాయపడుతుంది. అలాగే ఇందులో ఉండే ఫోలేట్ హృద్రోగ సమస్యలు రాకుండా నివారిస్తుంది. శరీరంలో చెడు కొలస్ట్రాల్ ను తగ్గిస్తుంది.

ఆకుకూరల్లో పోషక విలువల గురించి చెప్పనక్కర్లేదు. ప్రతి రోజు ఏదో ఒక రూపంలో తాజా ఆకుకూరలను తినడం అలవాటు చేసుకోవాలి. ఆకుకూర అనగానే దాన్ని ఏ పప్పులోనో, కూరల్లోనో వేసుకుని మాత్రమే తినకూడదు. ఒట్టి ఆకుకూరలతో రకరకాల కూరల్ని వండుకుతినాలి. అప్పుడే మనకు అన్నిరకాల పోషకాలు లభిస్తాయి.

Leave a Comment