రక్తంలో సాధారణం కంటే అనారోగ్యకరమైన స్థాయిలో కొలెస్ట్రాల్ పెరిగిపోతే, దాన్ని అధిక కొలెస్ట్రాల్ స్థితి అంటారు. అది చాలా తీవ్రమైన సమస్య… ఇది గుండెజబ్బులకు,స్థూలకాయం మరియు ఇతర వ్యాధులకు అధిక కొలెస్ట్రాల్ ఒక ముఖ్య కారణం. కొలెస్ట్రాల్ ను పెంచే ఆహారాలు ఏవి.. వాటి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.
ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో భోజనం కాస్తా మొక్కుబడి కార్యక్రమంగా మారిపోయింది. దాంతో శరీరానికి సరైనా పోషకాహారం అందక పలు రకాల ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. ఒక్కోవ్యక్తికి ఒక్కో రకంగా పౌష్టికాహారం అవసరమౌతుంది. ఏదైనా సరే ఆహారాన్ని మరీ ఎక్కువగా కాకుండా తక్కువగా కాకుండా తీసుకోవాలి. కొలెస్ట్రాల్ అనేది శరీర ప్రతి కణంలో కనిపించే కొవ్వు లాంటి పదార్ధం. కొలెస్ట్రాల్ హార్మోన్లు, విటమిన్ డి, మరియు ఆహారాలను జీర్ణం చేసే పదార్ధాలను ఉత్పత్తి చేయడానికి అవసరం అవుతుంది. శరీరంలో ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ స్థాయిలు ఉండటం వలన గుండెపోటు మరియు స్ట్రోక్ వ్యతిరేకంగా రక్షణ కల్పిస్తాయి.
అధిక స్థాయి కొలెస్ట్రాల్ రక్త నాళాలలో క్రొవ్వు నిక్షేపాలకు దారితీస్తుంది. ఇవి రక్త ప్రవాహంలో జోక్యం చేసుకుంటాయి. అందువలన గుండెపోటు వచ్చే అవకాశాలు మరింతంగా పెరుగుతాయి. రక్తంలో సాధారణం కంటే అనారోగ్యకరమైన స్థాయిలో కొలెస్ట్రాల్ పెరిగిపోతే, దాన్ని అధిక కొలెస్ట్రాల్ స్థితి అంటారు. అది చాలా తీవ్రమైన సమస్య. తీవ్రమైన గుండెజబ్బులకు,స్థూలకాయం మరియు ఇతర అలాంటి వ్యాధులకు అధిక కొలెస్ట్రాల్ ఒక ముఖ్య కారణం. జీవనవిధాన మార్పులు అంటే ఆరోగ్యకర డైట్, రోజువారీ వ్యాయామం మరియు కొన్ని ముఖ్యమైన మందులు వాడకంతో అధిక కొలెస్ట్రాల్ ను నియంత్రణలో ఉంచుకోవచ్చు.
చాలా మంది అన్ని కొవ్వు పదార్థాలు అనారోగ్యకరమైనవని, మళ్ళీ బరువు పెరగటం, కొలెస్ట్రాల్ స్థాయి పెరగటానికి కారణమవుతాయని అనుకుంటాం. కానీ శరీరానికి పనిచేయటానికి,ఆరోగ్యంగా ఉండటానికి ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలు అవసరమని అర్థం చేసుకోం. అన్ని కొవ్వు పదార్థాలు అనారోగ్యకరమైనవి కావు. ఉదాహరణకి, పిజ్జాలు, బర్గర్లలో ఉండే కొవ్వులు అనారోగ్యకరమైనవి, కానీ అవకాడోలు, నెయ్యి మరియు కొబ్బరికాయలోవి ఆరోగ్యానికి మంచివి. అందుకని మీ డైట్ కి ఆరోగ్యకరమైన కొవ్వులను జతచేయటం వలన అధిక కొలెస్ట్రాల్ తగ్గించుకోవచ్చు.
చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే ఆహారాలు..!
కేకులు, కుకీలు, తెల్ల బ్రెడ్ వంటివన్నీ బేకరీ ఉత్పత్తులు, వీటిని అధిక మొత్తాల్లో ఈస్ట్, పంచదార మరియు ఇతర ప్రాసెస్డ్ పదార్థాలతో తయారుచేస్తారు. ఈ వాడే వస్తులు మన ఆరోగ్యానికి చాలా హానికరమైనవి. బేకరీ ఆహారపదార్థాలు మీ కొలెస్ట్రాల్ స్థాయిలను ఇతర అనారోగ్యాలను కలిగిస్తున్నాయి. ఆల్కహాల్ లో అనారోగ్యకర కొవ్వులు ఎక్కువగా ఉండటం వలన అది మీ అధిక కొలెస్ట్రాల్ లక్షణాలను మరింత పెంచివేస్తుంది. మీరు అప్పుడప్పుడు మాత్రమే తాగినా కూడా శరీరానికి మంచిది కాదు. మానసిక ఒత్తిడిని అదుపులో ఉంచుకోకపోవటం అనేక ఆరోగ్య సమస్యలకి ఒక ముఖ్య కారణం. అది శారీరకం మరియు మానసికం కావచ్చు. శరీరంలో మానసిక ఒత్తిడి వలన కార్టిసాల్ పెరిగినప్పుడు, ఈ కార్టిసాల్ మీ శరీరంలో తిరిగి కొలెస్ట్రాల్ ను పెంచవచ్చు. అందుకని మానసిక వత్తిడిని అదుపులో పెట్టుకోవటం వలన కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించుకోవచ్చు.
మనం తీసుకోనే ఆహారంలో ఖచ్చితంగా కోన్ని ఆహార నియమాలను పాటించాలి. తీపిపదార్థాలు, వేపుడు పదార్థాలు వీలయినంత వరకు తగ్గించుకోవాలి. తక్కువ తిన్నా, లేదా ఎక్కువ తిన్నా రెండూ ప్రమాదాలు కొని తెస్తాయి. ప్రమాదకరమైన కొవ్వులతో పాటు, ఆహారంలో అవసరమైన కొవ్వులు కూడా ఉంటాయి. మంచి చేసే కొవ్వుల వల్ల శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి. అలాగే అనవసరమైన కొవ్వు శరీరంలో పేరుకు పోయి, స్థూలకాయంతో పాటు ఇతర రోగాలను తీసుకొస్తుంది. ఏ ఆహారం తీసుకున్నా ఎలా తీసుకోవాలన్న విషయాన్ని తెలుసుకున్నప్పుడే ఆహారం శరీరానికి మేలు చేస్తుంది. ప్యాక్ చేసిన బయటి ఆహారాన్ని కొంటున్నప్పుడు తప్పనిసరిగా వెనక భాగంలో ఉండే వివరాలను చదవాలి. దానిలో ఉండే కెలోరీలు, కొవ్వు, ఉప్పు శాతం ఎంతున్నాయో చూసుకోవడం మంచిది.
కొలెస్ట్రాల్ అధిక స్థాయిలో ఉన్నా లేకున్నా, క్రమం తప్పకుండా వివిధ నట్స్ తీసుకోవడం వలన ఆరోగ్యం మెరుగుపడుతుంది. నట్స్ లో స్టెరాల్స్ అనే సమ్మేళనాల వలన శరీరంలో చెడ్డ కొలెస్ట్రాల్ స్థాయిలను సహజంగా తగ్గిస్తాయి. అందుకని ప్రతిరోజూ చేతిలో పట్టినన్ని నట్లు తినటం మీ అధిక కొలెస్ట్రాల్ సమస్యలను తగ్గిస్తుంది. అధిక కొలెస్ట్రాల్ బరువు పెరగటానికి కారణమైతే, బరువు పెరగటం కొలెస్ట్రాల్ పెరుగుదలకి కారణమవుతుంది. అందుకని మీ కొలెస్ట్రాల్ నియంత్రణకోసం మీరు బరువు మరియు శరీరంలో కొవ్వు స్థాయి రెండూ తగ్గించుకోటానికి కష్టపడాలి. కఠినమైన డైట్ మరియు వ్యాయామం, వైద్యుని పర్యవేక్షణలో తప్పక అవసరం.
సాధారణంగా శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగాయంటే చెప్పలేనన్ని అనారోగ్య సమస్యలు వచ్చిపడుతుంటాయి. అందుకే చాలా మంది డైట్ ను ఫాలో అవుతుంటారు. శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్స్ ఉంటాయి. ఒక చెడు కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హని కలిగిస్తే, మంచి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కాబట్టి చెడు కొలెస్ట్రాల్ ను పెంచె ఆహారాలకు దూరంగా ఉందాం… ఆరోగ్యంగా జీవిద్దాం…