నేటి ఉరుకుల పరుగుల బిజీ జీవితంలో ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ ఆహారం, వ్యాయామంలపై దృష్టి సారించారు. కానీ నిద్రకు మాత్రం సరైన ప్రాధాన్యతను ఇవ్వడం లేదు. దీని ఫలితంగా అనేక రకాల అనారోగ్యసమస్యలు తలెత్తున్నాయి. మనం తీసుకోనే ఆహారాలు సైతం మన నిద్ర మీద ప్రభావాన్ని చూపుతున్నాయి .. అసలు ఇంతకీ ఏయే.. ఆహారాలు మనకు సరిగ్గా నిద్రపట్టడానికి ఉపయోగపడతాయి.. ఏ ఆహారాలు నిద్రకు భగం కలిగిస్తాయి.
కొంతమందికి కళ్లు మూసుకోగానే నిద్ర పట్టేస్తుంది. ఇంకొంతమందికి ఎంత ప్రయత్నించినా కళ్లు మూతలు పడవు. ఏ సమస్య లేకుండా కంటి నిండా నిద్ర పట్టాలంటే కొన్ని ఆహార చిట్కాలు పాటించాలి. ఆరోగ్యంగా ఉండాలంటే ఎనిమిది గంటలు నిద్ర పోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సెలవిస్తోంది. సామాన్యంగా పిల్లలకు పెద్దలకంటే ఎక్కువగా నిద్ర అవసరం. ఇది వారి శారీరక పెరుగుదలకు మానసిక అభివృద్ధికి చాలా అవసరం.
అప్పుడే పుట్టిన పిల్లలైతే సుమారు 18 గంటల నిద్ర అవసరం, వారు పెరుగుతున్న కొద్దీ ఇది తగ్గిపోతుంది. రోజంతా కష్టించి పనిచేసి అలసిపోయిన శరీరానికి రాత్రి వేళ కమ్మనైన నిద్ర అందజేస్తే మనం ఆరోగ్యంగా ఉంటామన్నది సత్యం. చాలమంది నిద్ర పట్టక సతమవుతుంటారు. మంచంపై అటూఇటూ తిరగడం, లేచికూర్చోవడం, మళ్లీ పడుకునేందుకు ప్రయత్నించడం చేస్తుంటారు. ఇలాటివారు క్రమబద్ధమైన అలవాట్లను పాటిస్తే.. మంచి నిద్ర సొంతమవుతుంది. సరైన నిద్రకు ఆహార నియమం కూడా ఎంతో అవసరం.
నిద్ర చక్కగా పట్టడానికి తీసుకోవాల్సిన ఆహారాలు
- రాత్రిపూట ఎంత లైట్ గా ఆహారం తీసుకుంటే.. అంత తేలికగా జీర్ణమవుతుందని చాలా మంది చెబుతూ ఉంటారు. ఎందుకంటే.. జీర్ణమవడానికి ఎక్కువ సమయం పట్టే ఆహారాలు తీసుకోవడం వల్ల మెటబాలిక్ సిస్టమ్ పై తీవ్ర ఒత్తిడి పడుతుంది. దానివల్ల మనకు త్వరగా నిద్ర పట్టదు. కాబట్టి నిద్రకు ముందు సులభంగా జీర్ణమయ్యే ఆహారాలను తీసుకోవాలి.
- డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ నివారించడానికి చక్కటి పరిష్కారం బీట్ రూట్. అలాగే స్టమక్ అప్ సెట్ నివారించడానికి కూడా ఇది సహాయపడుతుంది. ఇందులో పొటాషియం, ఫైబర్, మెగ్నీషియం ఉండటం వల్ల తేలికగా జీర్ణమవుతుంది.
- పెరుగు లేదా యోగర్ట్ లో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఏసిడోఫిలస్ అనే బ్యాక్టీరియా జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే గ్యాస్ట్రిక్ సమస్యలను నివారిస్తుంది. కాబట్టి డిన్నర్ లో పెరుగు చేర్చుకోవడం మంచిది.
- అవకాడో ఫ్రూట్ లో ఫైబర్, మోనో శ్యాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియకు చాలా మంచిది. వీటిని తినడం వల్ల డైజెస్టివ్ ట్రాక్, గాల్ బ్లాడర్ హెల్తీగా ఉంటాయి.
- టమోటాలు జీర్ణమవడానికి సహాయపడతాయి. ఇందులో పొటాషియం, మెగ్నీషియం, లైకోపిన్ ఉండటం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.
- క్యారట్స్ కంటి చూపుకి మంచివి. అలాగే.. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్స్ ఎక్కువగా ఉండటం వల్ల.. జీర్ణక్రియకు సహాయపడతాయి. కాబట్టి రాత్రిపూట భోజనంలో క్యారట్, రోటీ తీసుకుంటే.. మంచి ఫలితాలు పొందవచ్చు.
- బ్రౌన్ రైస్ లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి.. దీన్ని రాత్రి భోజనంలో తీసుకోవడం వల్ల.. జీర్ణమవడం మరింత సులువవుతుంది. నిద్రా మంచిగా పడుతుంది.
మనకు నిద్ర రాకుండా చేసే ఆహారాలు
రాత్రిళ్లు నిద్ర సరిగా రాకపోవడానికి మనం తీసుకునే ఆహారపదార్థాలు కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. మంచి నిద్ర రావాలంటే మనం తీసుకోనే ఆహారం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. నిద్ర చెడగొట్టే పానీయాలను గానీ ఘన పదార్థాలను కానీ తీసుకోకూడదు. కారంతో పాటు స్పైసీ గా ఉండే ఏ ఆహార పదార్థాలైనా రాత్రి పూట తిన్నట్లయితే నిద్రకు ఆటంకం కలిగే అవకాశం ఉంటుందంటున్నారు పోషకాహార నిపుణులు. పిజ్జాలు, ఐస్ క్రీములు, ఎక్కువ చీజ్ ఉన్న ఆహారపదార్థాలు.. వరి అన్నం ఎక్కువగా తీసుకున్నా నిద్రకు ఆటంకాలుగా మారుతాయి.
మాంసాహార పదార్ధాలు రాత్రి వేళ తింటే అవి సరిగా జీర్ణం కాకపోవడం వల్ల సుఖ నిద్ర పట్టదంటున్నారు నిపుణులు. అందుకే రాత్రివేళ మితాహారం తీసుకోవడం ఉత్తమం. టీ, కాఫీలకు బదులుగా బాదం పాలు వంటివి తీసుకోవచ్చు. నిద్రించే ముందు గోరువెచ్చని పాలు గ్లాసుడు త్రాగితే మంచిది. నిద్రపోయే ముందు డార్క్ చాక్లెట్లు తినొద్దని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. బట్టర్, క్రీమ్, సాస్ లు పడుకునే ముందు తీసుకుంటే సరిగా నిద్ర పట్టదని, వాటికి రాత్రి సమయంలో వీలైనంత దూరంగా ఉండాలని అంటున్నారు. నిద్రకుపక్రమించే ముందు షుగర్ క్యాండీస్, చాక్లేట్స్ తినకూడదు. జీర్ణవ్యవస్థకు ఇబ్బంది కలిగించే మాంసాహారం తినకూడదు. ఎక్కువ ఫైబర్ కలిగివుండే ఉల్లిపాయ, బ్రకోలి, క్యాబేజీ వంటి వెజిటేబుల్స్ కూడా తినొద్దు. మధ్యం,ధూమపానంకు దూరంగా ఉండాలి.