పుచ్చకాయ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ఇమ్యూనిటీ పవర్ ను పెంచడంలో పుచ్చకాయ సహాయపడుతుంది. పుచ్చకాయలో 95 శాతం వరకు నీరు ఉంటుంది. పుచ్చకాయ తినడం వల్ల కంటిచూపు మెరుగుపడుతుంది. పుచ్చకాయ చర్మం, ఎముకలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
మన శరీరానికి ప్రయోజనకరంగా ఉండే అత్యవసర ఖనిజాలు మరియు విటమిన్లను పుచ్చకాయ కలిగి ఉంటుంది. ఇవన్నీ కాకుండా, పుచ్చకాయ అనేది లైకోపీన్ అని పిలవబడే ఒక ఫైటోకెమికల్ యొక్క గొప్ప వనరు, ఇది పండు యొక్క ముదురు ఎరుపు రంగుకి బాధ్యత వహిస్తుంది. ఈ ఫైటోకెమికల్ శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. పుచ్చపండు గుజ్జు, తొక్కలో సిట్రులిన్ అనే అమైనో ఆమ్లం దండిగా ఉంటుంది. ఇది న్రైటిక్ ఆక్సైడ్ ఉత్పత్తయ్యేలా ప్రేరేపిస్తుంది. ఫలితంగా రక్తనాళాలు విప్పారతాయి. అవయవాలకు రక్త ప్రసరణ మెరుగవుతుంది.
పుచ్చపండులో బీటా కెరొటిన్, విటమిన్ సి వంటి పోషకాలు దండిగా ఉంటాయి. ఇవి యాంటీఆక్సిడెంట్లుగానూ పనిచేస్తాయి. అంటే రోగనిరోధకశక్తి పెంపొందటానికి తోడ్పడతాయన్నమాట. పొటాషియం మూత్రం ఎక్కువ వచ్చేలా చేస్తుంది. దీంతో రక్తపోటు తగ్గుముఖం పడుతుంది. అందువల్ల పొటాషియం తగినంతగా లభించాలంటే పుచ్చపండు తింటే సరి. ఇలా రక్తపోటు అదుపులో ఉండేలా చేసుకోవచ్చు. మరోవైపు దీనిలోని లైకోపేన్ గుండెజబ్బు ముప్పు తగ్గటానికీ తోడ్పడుతుంది.
పుచ్చపండు గుజ్జు ఎర్రటి రంగులో ఉండటానికి కారణం బీటా కెరొటిన్. ఇది చర్మం, ఎముకలు ఆరోగ్యంగా ఉండటానికి చాలా ముఖ్యం. వయసు పెరుగుతున్నకొద్దీ కంట్లోని రెటీనా మధ్యభాగం క్షీణించటం మూలంగా చూపు తగ్గిపోయే సమస్యనూ ఇది నివారిస్తుంది. పుచ్చపండులో నీరు ఎక్కువగా ఉంటుంది కదా. పైగా ఇందులో ఖనిజాల పాళ్లు మెండు. అలాగే ఒంట్లో ఆమ్ల స్వభావాన్నీ తగ్గిస్తుంది. మూత్రం ఎక్కువగా వచ్చేలా చేస్తుంది. అందువల్ల ఒంట్లో పేరుకుపోయిన విషతుల్యాలు పోగొట్టుకోవాలని భావించేవారికిది ఎంతగానో ఉపయోగపడుతుంది.
పుచ్చపండు తేలికగా జీర్ణమవుతుంది. మంచి పిండి పదార్థాలు సైతం ఉండటం వల్ల తక్షణ శక్తినిస్తుంది. అందువల్ల నీరసం, నిస్సత్తువ వంటివి వెంటనే తగ్గుతాయి. మానసికంగానూ మంచి హుషారు, ఉత్సాహం చేకూరుతాయి. ఆర్జినైన్ అనే అమైనో ఆమ్లం ఉత్పత్తి కావటంలో పుచ్చపండులోని సిట్రులిన్ పాలు పంచుకుంటుంది. ఆర్జినైన్ రోగనిరోధక వ్యవస్థను ఉత్తేజితం చేస్తుంది. అలాగే పుండ్లు త్వరగా మానటానికీ దోహదం చేస్తుంది.
పుచ్చకాయ దాహార్తిని తీర్చడంతోపాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. శరీరానికి చలువను అందిస్తుంది.ఇందులో ఉన్నన్ని నీళ్ళు మరే పండులోగాని, కాయలోగాని లేవు. బీటా కెరోటిన్, విటమిన్ ఎ, బి1, బి6, విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఇందులో అధికంగా లభిస్తాయి. పుచ్చకాయలో ప్రోటీన్, కొవ్వు, సోడియం తక్కువ. కొలెస్టరాల్ అసలు ఉండదు. పిండి పదార్థాలు, పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి.
సన్బర్న్ను నివారించడంలో గొప్పగా సాయపడుతుంది. బి విటమిన్లు , పొటాషియం పుష్కలంగా ఉండే పుచ్చకాయ నుంచి ఎలక్ట్రోలైట్లు సమృద్ధిగా అందుతాయి. బి విటమిన్లు శరీరానికి శక్తినందిస్తే.. పొటాషియం గుండెకు మేలు చేస్తుంది. పుచ్చకాయ జ్యూసును తీసుకోవడం వల్ల చర్మం మరింత తేటగా మారుతుంది. ఎండల వల్ల శరీరం డీహైడ్రేట్ కాకుండా రక్షిస్తుంది. వీటిలోని విటమిన్ బి6 నాడీ వ్యవస్థను ప్రశాంతపరుస్తుంది. రక్తప్రసరణను మెరుగుపర్చి, బీపీని అదుపులో ఉంచుతుంది.
ఇమ్యూనిటీ పవర్ ను పెంచడంలో పుచ్చకాయ సహాయపడుతుంది. రక్తప్రసరణను మెరుగుపరచడంలో తోడ్పడుతుంది. అధిక రక్తపోటున్నవారు పుచ్చకాయలను ఎక్కువగా తింటే అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది.