Health tips: శాకాహార‌మా? లేక మాంసాహార‌మా? ఏది ఆరోగ్యానికి మంచిది

By manavaradhi.com

Published on:

Follow Us
Non-vegetarian vs vegetaria

మనం తీసుకునే ఆహారంతోనే ఆరోగ్యం ముడిపడి ఉంటుంది. ఆరోగ్యకరమైన సమతులాహారం తీసుకోవడం గుండె జబ్బుల నివారణకు ఒక చక్కని మార్గం. రోజూ తాజా ఆకుకూరలు, పండ్లు తీసుకోవడం మంచిది. అలాగే చాలా మంది కొవ్వు తక్కవగా ఉండేహారాలు కూడా ఆరోగ్యానికి మంచిదే అంటారు. అసలు ఇంతకీ గుండె సంరక్షణ కోసం శాకాహారమా? – కొవ్వు తక్కువ ఆహారమా? ఏది మంచిది?

మన శరీరంలోని ముఖ్యమైన అవయవాల్లో గుండె ఒకటి. ఇది శరీరంలోని అవయవాలకు రక్తాన్ని పంప్ చేస్తుంది. దీంతో అవయవాలు సరిగ్గా పనిచేస్తాయి. అయితే ప్రస్తుత తరుణంలో అస్తవ్యస్తమైన మన జీవన విధానంతోపాటు పలు ఇతర కారణాల వల్ల మనకు గుండె జబ్బులు వస్తున్నాయి. చాలా మంది హార్ట్ ఎటాక్‌ల బారిన పడి చనిపోతున్నారు. అయితే గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే.. మన జీవన విధానాన్ని పూర్తిగా మార్చుకోవాలి.

సరైన పౌష్టికాహారం తీసుకోవాలి. గుండె సంరక్షణలో కీలక పాత్ర వహించే ఆహారాల్లో ప్రధానమైనవి ఆకు కూరలు. ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరానికి ఇబ్బందికరమైన మలినాలను సులభంగా శుభ్రపరుస్తుంది. ఫలితంగా గుండెకు మంచి ఆరోగ్యాన్ని అందించగలం. కూరగాయలూ, పండ్లలో విటమిన్స్, న్యూట్రియెంట్స్ లభిస్తాయి. వీటిలో కాలరీలు తక్కువ, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. కూరగాయలూ, పండ్లూ వంటివి శాకాహరం లో ఉండే కొన్ని గుణాలు కార్డియో వాస్క్యులర్ డిసీజెస్ రాకుండా చేస్తాయి.

గుండెకు ఎలాంటి సమస్యలు దరిచేరకుండా ఉండాలంటే మంచి ఆహారపు అలవాట్లు, సరైన జీవనశైలిని అలవర్చుకోవాలి. మనిషి ఆరోగ్యానికి శాకాహార ఎక్కువ మేలు చేస్తుంది. అనారోగ్యానికి గురికాకుండా ఉండాలంటే మనం తినే ఆహారంలో అధిక శాతం శాకాహారం ఉండాలి. శాకాహారం వల్ల గుండె పదిలంగా ఉంటుంది. హృదయ సంబంధ సమస్యలు దూరంగా ఉంటాయి. వెజిటేరియన్ ఫుడ్ బీపీని తగ్గిస్తుంది. హార్ట్ ఎటాక్‌ వచ్చే ముప్పును తగ్గిస్తుంది. బీన్స్, కూరగాయలు, పప్పులు, బఠాణీలు తీసుకోవడం వల్ల శరీరానికి పొటాషియం, ఫైబర్, ఐరన్ సమృద్ధిగా అందుతుంది.

బరువు తగ్గాలనుకునే వారికి శాకాహారం చాలా మంచిది. వయసు పెరిగేకొద్దీ వచ్చే అనారోగ్యం, జీర్ణ సంబంధ సమస్యలను తగ్గించడానికి వెజిటేరియన్ ఫుడ్ ఉపయోగపడుతుంది. ఆకుకూరలు, కూరగాయలు, కాయలు, పండ్ల వంటివి అమృతమైన ఆహారం. అవి ఎంత తింటే అంత మన శరీరానికి మేలు జరుగుతుంది. వీటిలో పోషకాలు ఎక్కువ, కొవ్వు తక్కువ. అందువల్ల అవి తింటే…. గుండె ఆరోగ్యానికి చాలా మంచిది.

మాంసం, గొర్రె, సాసేజ్‌లు మరియు సలామి వంటి ప్రాసెస్ చేసిన మాంసాలలో కూడా అధిక పరిమాణంలో సంతృప్త కొవ్వులు ఉంటాయి. పామాయిల్ మరియు కొబ్బరి నూనెలు,పేస్ట్రీలు, పైస్, సాసేజ్ రోల్స్, కేకులు, బిస్కెట్లు, పిజ్జాలు మరియు కొవ్వు తక్కువగా ఉండే ఆహారాలు. కొవ్వు తక్కువ ఆహారం,సంతృప్త కొవ్వులు రక్తంలో కొలెస్ట్రాల్‌ స్థాయులు పెరిగేలా చేస్తాయి. చెడ్డ కొలెస్ట్రాల్‌ (హెచ్‌డీఎల్‌) మోతాదులు ఎక్కువైతే గుండెజబ్బు, పక్షవాతం ముప్పు పెరుగుతుంది.

మాంసం, చర్మంతో కూడిన చికెన్‌, వెన్న, ఛీజ్‌, వెన్నతీయని పాలతో చేసిన పదార్థాల్లో సంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని పరిమితంగానే తీసుకోవాలి. గుండె ఆరోగ్యం కొవ్వు లేని ఆహారం తీసుకోవడంపై ఆధారపడి ఉన్నప్పటికీ… కొవ్వు లేని ఆహారం ఎక్కువగా తీసుకోవడం కూడా ప్రమాదకం. కొలెస్ట్రాల్ ప్రపంచవ్యాప్తంగా గుండె సమస్యలు పెరగడానికి మరో కారణం. కాబట్టి గుండె ఆరోగ్యంగా ఉండాలంటే సమపాళ్లలో కొవ్వు, కొలెస్ట్రాల్ ఉండే ఆహారాన్ని తీసుకోవడం ముఖ్యం.

మనం తినే ఆహారం గుండె ఆరోగ్యం మీద చాలా ప్రభావం చూపుతుంది. గుండె ఆరోగ్యంగా వుండాలంటే రోజు సమతుల ఆహారాన్ని తీసుకోవాలి. మనిషి ఆరోగ్యానికి శాకాహారమే మేలు చేస్తుంది.అనారోగ్యానికి గురికాకుండా ఉండాలంటే మనం తినే ఆహారంలో అధిక శాతం శాకాహారమే ఉండాలి.

Leave a Comment