Beauty Tips: సహజంగా మెరిసే చర్మాన్ని పొందడం ఎలా?

By manavaradhi.com

Published on:

Follow Us
The beauty tips

పుట్టుకతో వచ్చిన రంగు ఏదైనా సరే.. ముఖ వర్చస్సు బాగుండాలని.. ముఖంపై మచ్చలు మొటిమలు లేకుండా అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ముఖం అందంగా కాంతివంతంగా కనిపించడానికి రసాయన క్రీమ్స్ కంటే సహజమైన పదార్ధాల చిట్కాలు మంచివి. ఫేస్ కు గ్లో ఇచ్చే సింపుల్ చిట్కాలు.

అందంగా ఉండాలని అందరూ కలలు కంటారు. కానీ ఇది అందరికీ సాధ్యం కాదు. కొందరిలో వయసుపైబడుతున్నా యవ్వనం ఛాయలు ఏమాత్రం తగ్గవు. కానీ మరి కొందరిలో మాత్రం ముప్పై ఏళ్లకే ముసలితనం ఛాయలు కనిపిస్తాయి. దీనికికారణం వాతావరణ కాలుష్యం,పని ఒత్తిడి,నీరు తక్కువగా తాగడం,నిద్రలేమి. కొన్ని ఇతర కారణాల వల్ల చర్మం జీవం కోల్పోయి నిర్జీవమైపోతుంది. చర్మ రక్షణ కోసం చాలామంది తెలిసో తెలియకో కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. ఈ పొరబాట్ల వలన చర్మానికి హాని జరుగుతుంది. చర్మ సంరక్షణ కోసం రకరకాల క్రీములు వాటికి సంబంధించిన ఉత్పత్తుల్ని తరచుగా వాడడం చర్మ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఇలాంటి ఉత్పత్తులను ఉపయోగిస్తే చర్మంపై దద్దుర్లు ఏర్పడి.. కందినట్లుగా మారుతుంది.

మృతుకణాలు తొలగించేందుకు రకరకాల స్క్రబ్‌లు వాడుతుంటారు. ఈ స్క్రబ్స్ వాడితే చర్మం కాంతివంతంగా మారుతుంది.. కానీ, అదే పనిగా ఈ స్క్రబ్స్ వాడితే చర్మం పొడిబారుతుంది. పౌష్టికాహార అలవాట్లు పాటించటం వల్ల చర్మాన్ని కాతివంతంగా ఉంచుకోవచ్చు. విటమిన్ ఎ అధికంగా ఉండే క్యారెట్, వెన్న, గుడ్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని రోజువారీ ఆహారంతోపాటు తీసుకోవడం వల్ల చర్మంపై ముడతలు రావని పోషకాహా నిపుణులు చెబుతున్నారు.

చర్మ సంరక్షణ గురించి తెలుసుకునే ముందు.. మీ చర్మం ఏ రకమో తెల్సుకోవాలి. జిడ్డు చర్మమా, పొడి చర్మమా, లేదా సాధారణ చర్మమా, సుర్యకాంతి వల్ల ఇబ్బంది కలిగే రకమా… అనేది తెల్సుకోవాలి. నడివయసులో రకరకాల చర్మ సమస్యలు చుట్టుముడుతుంటాయి. వీటి బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. సాధారణంగా మగవారి చర్మం స్త్రీల కన్నా ఎక్కువ జిడ్డు కలిగి ఉంటుంది. అందువల్ల ఎక్కువ శాతం మగవారిలో ముడతలు వచ్చే ప్రమాదం ఉంది. చర్మాన్ని ఎప్పటికప్పుడు తేమగా ఉంచే మాయిశ్చరైజర్ లేదా క్రీమ్ వాడితే మంచి ఫలితం కనిపిస్తుంది.

ఎండలో ఎక్కువగా తిరిగే వారి చర్మం కాంతిని కోల్పోతుంది. వయసుపైబడుతుండే కొద్దీ చర్మంపై ముడతలు స్పష్టంగా కనిపిస్తాయి. అందువల్ల చర్మవైద్య నిపుణులను సంప్రదించి మాయిశ్చరైజింగ్ మరియు ఫేస్ క్రీములను వాడాల్సి ఉంటుంది. అంతేకాని అందంగా కనిపించడం కొసం నడివయసులో సర్జరీ చేయించుకుంటే భవిష్యత్తులో మరిన్ని కాంప్లికేషన్స్ కు దారితీయవచ్చు. అయితే ఈ చర్మ సమస్యలు అందరికీ ఒకేలా ఉండవు. వారి శరీర తత్వాన్ని బట్టి మారుతుంటాయి. అందువల్ల ఆహారపానీయాల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా సాల్మన్ మరియు వాల్ నట్స్, ఒమేగా 3 ఫాటీ యాసిడ్ ను కలిగి ఉంటాయి. వీటి వల్ల వయస్సు కనపడక నిత్య యవ్వనంగా కనిపిస్తారు. రెడ్ వైన్ కూడా కొంత మోతాదులో తీసుకోవడం వల్ల వయస్సు, చర్మం కాంతివంతంగా ఉంటుందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. ఇవేకాక పండ్లు తినటం వల్ల కూడా చర్మం కాంతివంతంగా ఉంటుంది.

నడివయసులో చర్మ సంరక్షణ కోసం ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. వృద్ధాప్యంలో చర్మం పొడిబారటం, గోకితే తెల్లి పొట్టు లేవడం తరచుగా కనిపిస్తుంది. వయసు మీడపడుతున్న కొద్దీ చర్మంలో నూనె గ్రంథుల సంఖ్య తగ్గుతూ వస్తుండటమే ప్రధాన కారణం. దీని ఫలితంగా దురద, చిరచిర వంటివి తలెత్తుతాయి. కొందరు విపరీతంగా గోకుతుంటారు. దీని నుంచి బయటపడేందుకు స్నానం చేయడానికి అరగంట ముందు ఒంటికి కొబ్బరినూనె రుద్దుకోవాలి. మద్యం తీసుకోనే అలవాటు ఉంటే దానిని పూర్తిగా మానేయాలి. అలాగే సిగరేట్ స్మోకింగ్‌కు దూరంగా ఉండాలి. ప్రతిరోజు ఎక్కువ మోతాదు నీరు తాగాలి. అవకాడో, క్యారట్, దోసకాయ, బెర్రీ, ఆపిల్, నట్స్, తృణధాన్యాలు వంటివి డైలీ మెనూలో చేర్చుకోవాలి.

ఎండలో ఉన్నా లేకపోయినా సన్‌స్ర్కీన్‌ లోషన్‌ ఉపయోగించాలి. రోజూ ఆహారంలో శరీరానికి కావలసిన యాంటీఆక్సిడెంట్లు లభించేలా చూసుకోవాలి. అలాగే రోజూ తగినంత నిద్ర ఉండేలా చూసుకోవాలి. మంచి ఫేస్‌ వాష్‌ క్లీన్సర్‌తో తరచుగా ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. రాత్రి పడుకునే ముందు మేకప్‌ పూర్తిగా తీసివేయాలి. ఇవేకాక క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఇలా చేయడం వల్ల నడివయసు ఎలాంటి చర్మ సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు. చర్మ సమస్యలు తీవ్రమైన సందర్భాల్లో డెర్మటాలజిస్టులను సంప్రదించి తగు సలహాలు, సూచనలు పొంది అనుసరించాలి.

ముఖం అందంగా, నునుపుగా ఉండాలని అనుకోవటం సహజం. ముఖచర్మంపై ఉన్న స్వేదరంధ్రాలపై దుమ్ము, ధూళి అంటుకోవడంతో పాటు ముఖం జిడ్డుగా తయారై వెంటనే మార్కెట్లో దొరికే సౌందర్య సాధనాల్ని కొని ఉపయోగిస్తుంటారు. దీనివల్ల స్వేదరంధ్రాలు మూసుకుపోయి ముఖం అందాన్ని కోల్పోతుంది. ఇలా కాకుండా అందమైన ముఖం కోసం ఇంట్లోనే సులభమైన చికిత్సలను నిర్భయంగా వాడుకోవచ్చు.

Leave a Comment