T20 World Cup 2024: అమెరికాగడ్డపై టీ-20 ప్రపంచకప్ .. భారత్ విజేతగా నిలిచేనా..!

By manavaradhi.com

Published on:

Follow Us
T20 World Cup 2024

క్రికెట్ అభిమానులు ఎంతో అభిమానించే టీ20 ప్రపంచకప్ మొదలవుతుంది. అయితే ఇక్కడ చెప్పుకోదలచిన మరో విషయం ఏంటంటే… అసలు క్రికెట్ అంటే పెద్దగా పట్టించుకోని అగ్రరాజ్యం అమెరికా .. వెస్టిండీస్‌తో కలిసి ఈ టోర్నీకి ఆతిథ్యమివ్వడం. అంతేకాదు ఇంతకు ముందెన్నడు లేని విధంగా ఏకంగా ఈ సారి టీ 20 ప్రపంచకప్‌ మెగా టోర్నీలో 20 జట్లు తలపడనున్నాయి. అయితే అందరి చూపు మాత్రం ఈ సారి భారత్ ,డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లాండ్‌ , ప్రపంచకప్ అంటే టక్కన గుర్తుకు వచ్చే ఆస్ట్రేలియా.. విధ్వసం కరమైన ఆటగాళ్లకు నియమైన వెస్టిండీస్‌లపైనే ఉన్నాయి. ఈ సారి ఎలాగేన కప్పు గెలిచి తమ ఖాతాలో వెసుకోవాలని న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా ఉవ్విళ్లూరుతున్నాయి. మరో వైపు పాకిస్థాన్ జట్టుకూడా టీ20 ప్రపంచకప్‌లో అత్యంత నిలకడైన టీమ్ పాక్ ఇప్పటివరకు 6 సార్లు సెమీస్‌ చేరింది. 2009లో విశ్వ విజేతగా నిలిచింది. పాకిస్థాన్‌ ఈసారి కూడా పటిష్టంగానే ఉంది. శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్‌ కప్పుపై తమదైన ముద్ర వేయాలని చూస్తున్నాయి. ఆతిథ్య అమెరికా, ఐర్లాండ్, నెదర్లాండ్స్, నమీబియా, స్కాట్లాండ్, నేపాల్, ఒమన్, కెనడా, పాపువా న్యూగినీ, ఉగాండా కప్పులో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి.

  • టీ20 ప్రపంచ కప్ గెలిచిన జట్లు
  • 2007 భారత్ (పాకిస్థాన్‌పై 5 పరుగుల తేడాతో విజయం)
  • 2009: పాకిస్థాన్ (శ్రీలంకపై 8 వికెట్ల తేడాతో గెలుపు)
  • 2010: ఇంగ్లాండ్ (ఆస్ట్రేలియాపై 7 వికెట్లతో విజయం)
  • 2012: వెస్టిండీస్ (శ్రీలంకపై 36 పరుగుల తేడాతో గెలుపు)
  • 2014: శ్రీలంక (ఇండియాపై 6 వికెట్ల తేడాతో విజయం)
  • 2016:వెస్టిండీస్ (ఇంగ్లాండ్‌పై 4 వికెట్ల తేడాతో విజయం)
  • 2021:ఆస్ట్రేలియా (న్యూజిలాండ్‌పై 8 వికెట్ల తేడాతో గెలుపు)
  • 2022: ఇంగ్లాండ్ (పాకిస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో విజయం)

20 జట్లను 5 టీమ్స్ చొప్పున 4 గ్రూప్‌లుగా విభజించారు. ఒక్కో జట్టు తమ గ్రూప్‌లోని ఇతర నాలుగు జట్లతో తలపడుతుంది. టాప్‌-2లో నిలిచిన రెండు టీమ్‌లు సూపర్‌ ఎయిట్‌కు చేరుకుంటాయి. సూపర్‌ ఎయిట్‌లో ఎనిమిది టీమ్‌లను రెండు గ్రూప్‌లుగా విడదీస్తారు. ఒక్కో టీమ్‌ మిగిలిన మూడు జట్లతో మ్యాచ్‌లు ఆడుతుంది. ఒక్కో గ్రూప్ నుంచి టాప్‌-2లో నిలిచిన రెండు టీమ్‌లు సెమీస్ ఆడుతాయి. చివరగా ఫైనల్‌ మ్యాచ్ జరుగుతుంది. వెస్టిండీస్‌లో ఆరు, అమెరికాలలో మూడు వేదికలలో మ్యాచ్‌లు జరగనున్నాయి.

ఈసారి టీ20 ప్రపంచకప్ సందర్భంగా న్యూయార్క్ లాంటి పెద్ద నగరంలో నిర్వహించనున్నారు. న్యూయార్క్‌లో పెద్ద సంఖ్యలో భారతీయులు, పాకిస్థానీయులు నివసిస్తున్నారు. అందుకే స్టేడియం పూర్తిగా నిండిపోతుంది. ఈ సారి టిక్కెట్లకు డిమాండ్ కూడా ఎక్కువగా ఉండడంతో ఒక్కో టిక్కెట్టు రూ.2 లక్షలకు విక్రయించారు.

టోర్నీలో భిన్న సమయాల్లో మ్యాచులు జరగనున్నాయి. భారత కాలమాన ప్రకారం ఉదయం 5 గంటలు, 6 గంటలు, రాత్రి 8 గంటలు, 9, 10.30, 12.20 గంటలకు ప్రారంభం అవుతాయి. భారత్ ఆడే మ్యాచులన్నీ రాత్రి 8 గంటలకు ప్రారంభం అవుతాయి.

Leave a Comment