గుండె నుంచి శరీర భాగాలకు ప్రాణవాయువు కూడిన రక్తాన్ని సరఫరా చేసేవి అర్టరీలు.. తిరిగి శరీర భాగాల నుంచి కార్బన్ డయాక్సైడ్ కూడిన రక్తాన్ని గుండె కి తీసుకెళ్లే వి వీన్స్. ఈ రెండిటిలో కూడా క్రొవ్వు కూడిన అడ్డంకులు లేదా బ్లాక్స్ (BLOCKS) ఏర్పడినపుడు వాటిని clear చేసి మరలా రక్త సరఫరా నిరాటంకంగా జరిగేందుకు సాయపడే వైద్య ప్రక్రియే బలూన్ యంజియో ప్లాస్టి లేదా యంజియో ప్లాస్టి అంటారు.
గుండే నుంచి శరీర భాగాలకు, తిరిగి గుండె కి ఇలా ఇరువైపులా రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడినపుడు రక్త ప్రవాహానికి ఆటంకం ఎదురవుతుంది. బ్లాక్స్ అని మనం సాధరణంగా పిలువబడే ఈ అడ్డంకులు లేత పసుపు రంగులో ఉండే ఒక జిగురైన పదార్ధం వల్ల ఏర్పడతాయి. దీనినే వైద్య పరిభాషలో ప్లాక్ (plaque) అంటారు. ఇవి ప్రధానంగా చెడు కొవ్వులు అని చెప్పుకోవచ్చు.
ప్లాక్ రక్తనాళాల లోపలవైపు గోడలకు అతుక్కొని నెమ్మదిగా పేరుకొని పోతూ రక్త సరఫరా కి ఆటంకం గా మారుతుంది. ఎపుడైతే ఈ అడ్డంకులు పూర్తిగా లేదా పాక్షికంగా ఒకటి లేదా పలు రక్త నాళాల్లో ఏర్పడతాయో అపుడు యాంజైన లేదా చెస్ట్ పెయిన్ లక్షణాలు వచ్చే అవకాశం ఉంది. ఈ కండిషన్ నుంచి బయట పడేందుకు, రక్త సరఫరా తిరిగి నిరాటంకంగా జరిగేలా చేసేందుకు అవసరమయ్యే ప్రొసీజర్ నే మనం యంజియో ప్లాస్టీ అంటున్నాం.
యాంజియో ప్లాస్టి ప్రొసీజర్ ని రెండు ముఖ్య కారణాల కోసం వైద్యులు సూచించవచ్చు. ఒకటి – గుండెలో రక్త సరఫరా సరిగ్గా జరగనందువల్ల వచ్చిన చెస్ట్ పెయిన్ కి వైద్యం రూపంలో ఇక రెండవది హార్ట్ ఎటాక్ వచ్చిన వారిలో హార్ట్ మసిల్ ని మరింత damage కాకుండా కాపాడేందుకు. యంజియో ప్లాస్టి ప్రొసీజర్ ని కార్డియాక్ క్యాతటరైశేషన్ అనే వైద్య పద్ధతి ఉపయోగించి, సన్నటి ట్యూబ్ – అంటే క్యాథెటర్ ని చేతి వెంబడి లేదా గ్రాయిన్ (groin) అంటే గజ్జల నుంచి వెళ్ళే రక్త నాళం గుండా పంపిస్తూ, గుండె వద్ద ఉండే రక్తనాళాలను access చేస్తారు. ప్రొసీజర్ లో కొద్ది మోతాదులో అనేస్తీసియా అవసరం పడుతుంది.
‘కాంట్రాస్ట్ డై’ ని క్యాథెటర్ ద్వారా రక్త నాళం లోకి పంపడం, ఆ డై ప్రవాహాన్ని బయట ఎక్స్ రేస్ ద్వారా మానిటర్ చేస్తూ, పిక్చర్స్ తీస్తారు. ఇలా క్యాథెటర్ సాయం తో గుండె ఛేంబర్స్ లో లేదంటే గుండె రక్త నాళాల్లో ఎక్కడైతే blocks ఉన్నాయో కనిపెట్టి ఆ తరువాత వాటిని తొలగించేందుకు ఒకటి లేదా రెండు పద్ధతుల్లో యంజియో ప్లాస్టి ప్రొసీజర్ ని చేస్తారు కార్డియాక్ నిపుణులు. ఇదంతా కూడా క్యాత్ ల్యాబ్ లో యంజియో ప్లాస్టి ప్రొసీజర్స్ లో అత్యంత నైపుణ్యం ఉన్న గుండె వైద్య నిపుణులు చేసే మెడికల్ ప్రొసీజర్.
యాంజియో ప్లాస్టి పోసిజర్ కి ముందు ఆ తరువాతా ఎలాంటి అంశాలను తెలుసుకోవల్సిన అవసరం ఉంది అని మీకు సందేహం రావచ్చు.ప్రొసీజర్ కి ముందు ఆయా వ్యక్తులు సంసిద్ధంగా ఉన్నారా లేదా అని చూసేందుకు కొన్ని రక్త పరీక్షలు అలాగే గుండె పనితీరు చూసే ecg చేయించాల్సి ఉంటుంది. ఇక ప్రొసీజర్ అయిన తరువాత కొద్ది గంటల పాటు హాస్పిటల్ లోనే రెస్టింగ్ పోసిషన్ ఉండాల్సి ఉంటుంది. ఎక్కడ నుంచి అయితే క్యాథెటర్ ఉపయోగించారో – ఆ ప్రదేశం చేయి లేదా కాలికి రెండు నుంచి మూడు గంటల పాటు బ్యాండ్ ఎయిడ్ ఉంచుకోవాలి. కొద్ది గంటల పాటు సాలిడ్ ఆహారం కాకుండా కేవలం ద్రవ పదార్ధాలను మాత్రమే తీసుకోవాలి. వైద్య సూచన మేరకు జాగ్రత్తలు తీసుకొని ఫాలో అప్ లో ఉండాలి.