Blood Clots: రక్తనాళాల్లో రక్తం గడ్డ కడుతోందా? రక్తం గడ్డ కట్టడానికి అసలు కారణాలు .?

By manavaradhi.com

Published on:

Follow Us
Blood Clots Health Risks

మన శరీరంలో అన్ని భాగాలకు రక్త ప్రసరణ చాలా అవసరం. జీవక్రియల్లో ఏదైనా సమస్య ఎదురైనప్పుడు అన్ని భాగాలకు రక్త ప్రసరణలో సమస్యలు ఏర్పడతాయి. ఫలితంగా రక్తం గడ్డలు కట్టడం మొదలౌతుంది. ఒక్కసారి ఈ సమస్య మొదలైందంటే, శరీరంలో ఇతర జీవక్రియల మీద కూడా ప్రభావం చూపుతుంది.

మన శరీరంలో ప్రధానమైన అవయవాలు చాలానే ఉన్నాయి. కానీ వీటన్నింటికీ శక్తిని అందించేది రక్తం. ఓ పక్క నుంచి ఆక్సిజన్, మరో పక్క నుంచి న్యూట్రిషన్లతో పాటు… అవయవాలకు సరైన రక్త ప్రసరణ ఉంటేనే ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవక్రియలన్న సక్రమంగా తగ్గుతాయి. వీటిలో ఏది తగ్గినా రక్తం ప్రసరించే వేగం తగ్గిపోతుంది. రక్తం ప్రసరించే వేగం తగ్గిందంటే అనారోగ్య సమస్యలు మొదలై, శరీరం పెద్ద ప్రమాదంలో పడుతుంది. వీటిలో ఏ ఒక్కటి లోపించినా, రోజువారి జీవక్రియలకు అంతరాయం కలగడంతో పాటు, శరీరంలో బ్లడ్ క్లాట్స్ ఏర్పడతాయి. ఈ బ్లడ్ క్లాట్స్ శరీరంలో డీప్ వీన్ థ్రో బోయోసిస్ కండీషన్స్ కు దారి తీస్తాయి. ఇవి ప్రాణంతకమైన సమస్యలుగా చుట్టు ముడతాయి.

సాధారణంగా రక్తానికి గడ్డకట్టే గుణం ఉంటుంది. శరీరంలో ఎక్కడైనా గాయం అయినప్పుడు బయటకు వచ్చిన రక్తం గడ్డకట్టి, ఎక్కువ రక్తం బయటకు పోకుండా చూస్తుంది. గాయాలు అయినప్పుడు రక్తం గడ్డ కట్టడం ఆరోగ్యకరమే అయినప్పటికీ, శరీరం లోపల గడ్డ కట్టడం మాత్రం గుండె పోటుకు, ప్రమాదకరమైన అనారోగ్యసమస్యలకు దారి తీస్తుంది. రక్తం గడ్డ కట్టడం అనేక రసాయన చర్యల మీద ఆధారపడి ఉంటుంది. రక్తంలో ప్లేట్ లెట్స్ ఉంటాయి. రక్తనాళం దెబ్బ తిన్నప్పుడు, చిన్న ట్రిగ్గర్ల ద్వారా అవి విడుదల అవుతాయి. ఆ ప్రాంతంలోని గోడలు మరియు ఇతర భాగాల నుంచి రక్తం బయటకు రావడానికి ఆపేందుకు ఓ ప్లగ్ ఆకారంలో అవి ఏర్పతాయి. ఈ ప్లేట్లెట్లు ఇతర కణాలను ఆకర్షించేందుకు రసాయనాలను విడుదల చేస్తాయి. ఇవి తదుపరి దశను ప్రారంభిస్తాయి. తదుపరి దశలో ఇవి బ్లడ్ క్లాట్స్ గా మారతాయి.

బ్లడ్ క్లాట్స్ సమస్య ఉన్న వారిలో కాలులో బ్లడ్ క్లాట్స్ ఏర్పడి సాధారణ సమయంలో కొందరిలో ఎక్కువ నొప్పి ఉంటే, మరికొందరిలో తక్కువ నొప్పి ఉంటుంది. నడిచేటప్పుడు నొప్పి మరింత ఎక్కువ కావచ్చు. అదే విధంగా బ్లడ్ క్లాట్స్ అయిన ప్రదేశంలో చర్మం పేల్ బ్లూ లేదా అసాధారణ రంగు కలిగి ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆ ప్రదేశాన్ని గోకడం, స్క్రబ్ చేయడం లేదా ఇతర గాయాలు కాకుండా జాగ్రత్త పడాలి. ఈ సమస్యతో బాధపడేవారికి తరచూ జ్వరం వస్తుంది. ముఖ్యంగా రాత్రుల్లో ఇది మరింత ఎక్కువ అవుతుంది. ఈ పరిస్థితి వచ్చే లోపే జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. అదే విధంగా కాలు వాచినట్లు అయ్యి, అది మరింత పెరుగుతూ వెళితే… బ్లడ్ క్లాట్స్ సమస్య ఉందనే విషయాన్ని గుర్తించాలి. కాలులో వాపు చేరి బరువు పెరగడం కూడా ఈ లక్షణాల్లో ఒకటి. అదే విధంగా శ్వాసలో ఇబ్బందులు ఎదురైనట్లైతే లంగ్స్ లో క్లాట్స్ కారణం కావచ్చు.

ఊపిరితిత్తుల్లో క్లాట్స్ చాలా ప్రమాదం గనుక… వెంటనే జాగ్రత్తపడడం మేలు చేస్తుంది. ఎక్కువగా దగ్గు రావడం, దగ్గుతున్నప్పుడు రక్తం పడడం కూడా ఈ లక్షణంగానే భావించి వెంటనే జాగ్రత్త పడాలి. బ్లడ్ క్లాట్స్ సమస్య ఉన్న వ్యక్తి బలహీనంగా మారతారు. నిరంతరం అలసటగా కనిపిస్తారు. కాళ్ళు కదిపేందుకు కూడా కష్టంగా భావిస్తారు. అదే విధంగా చెస్ట్ లో కూడా నొప్పి ఉంటుంది. శరీరంలో మిగిలిన ప్రదేశం కంటే క్లాట్స్ ఉన్న భాగం వెచ్చగా అనిపిస్తుంది. వీటిలో ఏ లక్షణాలు ఎదురైనా వెంటనే వైద్యుని సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

శరీరంలో మనకు తెలియకుండా జరిగే చర్యలు ఎన్నో ఉంటాయి. కొన్న సందర్బాల్లో అనుకోకుండా శరీరంలో లోపలి బాగాల్లో ధమనుల్లో లేదా నరాలలో రక్తం గడ్డ కడితే అది ప్రాణాపాయ స్థితికి చేర్చుతుంది. కొన్ని బ్లడ్ క్లాటింగ్ లక్షణాలను గుర్తించకుండా నిర్లక్ష్యం చేస్తూ అలాగే జీవనం సాగిస్తే మరిన్ని ఫీటల్ డిసీజ్ లకు దారితీస్తుంది. తిమ్మెర్లు, లేదా నొప్పి, సలపడం వంటి లక్షణాలు కబడితే ? ఈ లక్షణాలు తరచూ అనిపిస్తుంటే రక్తం గడ్డకట్టినట్టు గుర్తించాలి. శరీరం లోపల రక్తం గడ్డ కట్టినప్పుడు… రక్త ప్రసరణ సరిగా జరగదు. ఫలితంగా ఆ ప్రదేశంలో వాపు రావడం, నొప్పిగా ఉండడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనికి వెంటనే చికిత్స తీసుకోకపోతే ప్రాణాలకే ప్రమాదంగా పరిణమిస్తుంది.

బ్లడ్ క్లాట్స్ కి అనేక ఇతర కారణాలు ఉన్నాయి. వీటిలో ఒబేసిటి, పొగ త్రాగడం, గర్భం, క్యాన్సర్, ఊపిరితిత్తుల సమస్యలు, గుండె సమస్యలు, అర్థరైటిస్, కీమో థెరఫి లాంటి ఎన్నో ఇబ్బందికరమైన లక్షణాలు ఈ సమస్యలో ప్రధానంగా కనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో జన్యుసంబంధమైన కారణాల వల్ల కూడా ఈ సమస్య ఎదురు కావచ్చు. ముఖ్యంగా ఈ బ్లడ్ క్లాట్స్… ఊపిరితిత్తులకు చేరితే అనేక సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. ఇలాంటి అలవాట్లు ఉన్నవారు, సమస్యలు ఎదురైన వారు ముందుగా వాటిని గుర్తించి, వైద్యుని సంప్రదించి, కారణాలు తెలుసుకుని మంచి పరిష్కారాన్ని పొందవచ్చు. వైద్యులు సూచించిన ఆహారం, జీవన విధానంలో మార్పు, వ్యాయామాల లాంటి వాటి ద్వారా బ్లడ్ క్లాట్స్ సమస్య నుంచి రక్షణ పొందవచ్చు.

బ్లడ్ క్లాట్స్ సమస్యను ఎంత త్వరగా గుర్తించామన్న దాని మీద ఆధారపడి చికిత్స ఉంటుంది. అందుకే ఈ సమస్య పట్ల అవగాహన కలిగి ఉండి, త్వరగా గుర్తించడం ద్వారా దీని నుంచి బయట పడడం సులభం అవుతుంది. కాబట్టి శరీరంలో రక్తంలో రక్తం గడ్డ కట్టిందని తెలుస్తానే వెంటనే లక్షణాలను గుర్తించి చికిత్స తీసుకోవడం చాలా అవసరం.

Leave a Comment