Health Tips: శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారా..?

By manavaradhi.com

Updated on:

Follow Us
COPD

మన శరీరంలో ముఖ్యమైన పాత్రను పోషించే ఊపిరితిత్తులకు అనేక రకాల సమస్యలు వస్తుంటాయి. వాటిలో ముఖ్యమైనది COPD.పొగ తాగడం వల్ల , వాతావరణ మార్పులు , కాలుష్యం, ఇన్ఫెక్షన్స్ వలన శ్వాస కోశాలు దెబ్బతినడం వల్ల వస్తుంది. ఇది మగవారిలో మరింత ఎక్కువగా ఉంటుంది . అసలు ఇంతకీ శ్వాసకోశ ఇబ్బందులుకు ప్రధాన కారణాలు

రోజు రోజుకు పెరిగిపోతున్న వాయుకాలుష్యం వలన కొత్త కొత్త ఆరోగ్య స‌మ‌స్యలు మ‌న‌ల్ని చుట్టుముడుతున్నాయి. కాలుష్యం, ధూమ‌పానం కార‌ణంగా మ‌న‌ల్ని ఇబ్బందిపెట్టే ముఖ్య ఆరోగ్య స‌మ‌స్యల్లో దీర్ఘకాల ఊపిరితిత్తుల సమస్యల్లో సీవోపీడీ ముఖ్యమైంది. ఊపిరితిత్తుల్లో గాలి మార్గాలతో పాటు గాలి గదులూ ఉంటాయి. వీటి ఆకృతి చెడిపోయి.. ఇవి సాగిపోయి వదులుగా తయారవడంతో అడ్డంకులు తలెత్తి ఊపిరితిత్తుల సామర్థ్యం గణనీయంగా తగ్గిపోతుంది. ఫలితంగా శ్వాస కష్టం కావటం, దగ్గు, పిల్లికూతల వంటి లక్షణాలు కనిపిస్తాయి.

రకరకాల సమస్యలతో కూడిన సీవోపీడీలో ప్రధానమైనవి క్రానిక్ బ్రాంకైటిస్, ఎంఫిసీమా. గాలి కాలుష్యానికి ముఖ్యంగా వాహన కాలుష్యానికి చాలాకాలంగా గురైనవారికి సీవోపీడీ వచ్చే అవకాశం చాలా ఎక్కువ. వీరిలో చాలా మందికి సమస్య ఉన్నట్టే తెలియదనీ అధ్యయనాలు చెబుతున్నాయి. దీంతో సమస్య చాలా తీవ్రమయ్యేంత వరకూ చికిత్స తీసుకోలేకపోతున్నారు. ఒకసారి సీవోపీడీ బారినపడితే నియంత్రణలో ఉంచుకోవటం తప్పించి, పూర్తిగా నయం చేసే చికిత్స ఏదీ లేదు. అందువల్ల దీనిపై అవగాహన ఏర్పరచుకోవటం చాలా అవసరం.

శ్వాసకోశ ఇబ్బందులు ముఖ్యంగా చలికాలంలో తీవ్రంగా ఉంటుంది. కాలుష్యంలో తిరిగేవారు, ఫ్యాక్టరీలలో పనిచేసే వారు, రసాయనికలతో, స్మోకర్స్‌, పాసివ్‌ స్మోకర్స్‌ల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. వాయునాళాలు సన్నబడడం వల్ల ఊపిరిత్తులు బరువుగా ఉన్నట్లు , ఛాతి పట్టేసినట్లు, శ్వాస ఆడనట్లుగా అనిపిస్తుంది. చాలా మంది సీవోపీడిని వెంటనే గుర్తించకుండా వ్యాధి ముదిరిన తర్వాత వైద్యుల వద్దకు వెళ్తున్నారు. జబ్బును మొద‌ట్లోనే గుర్తిస్తే నివారించడానికి అస్కారముంది. విపరీతమైన దగ్గు, శ్లేష్మం వస్తే సీవోపీడీగా అనుమానించాలి. ఊపిరి పీల్చడంలో ఇబ్బందిగా అనిపించడం. జలుబు, ఛాతి ఇన్‌ఫెక్షన్‌ త్వరగా తగ్గకపోవడం లాంటి లక్షణాలు ఉంటే సీవోపీడీగా భావించి వైద్యుల్ని సంప్రదించాలి.

సీవోపీడిని నిర్లక్ష్యం చేయకుండా ప్రత్యేక వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా గుర్తించాలి. శ్వాసకోశ సమస్యలు తీవ్రంగా ఉన్నా, దగ్గు, జలుబు మందులు వాడినా తగ్గకపోతే లంగ్‌ ఫక్షనింగ్‌ టెస్టు చేయించుకోవాలి. ముఖ్యంగా సిగ‌రెట్ తాగ‌డం మానేయాలి. సిగ‌రెట్ తాగేవాళ్లకు దూరంగా ఉండాలి. పౌష్టికాహారాన్ని డైట్‌లో చేర్చుకోవాలి. బ్రీతింగ్‌ వ్యాయమం చేస్తూ ఊపిరితిత్తులు బ‌లంగా త‌యార‌య్యేలా చూసుకోవాలి. వైద్యుల సలహా ప్రకారం వ్యాక్సిన్‌ వేయించుకోవాలి.

ఫ్యాక్టరీల్లో ప‌నిచేసేవారు ర‌సాయ‌నాలు పీల్చుకోకుండా విధిగా మాస్కులు ధ‌రించాలి. ఆస్తమా బాధితులు ఇన్‌హెలర్‌ వినియోగించాలి. చ‌లికాలంలో ఈ స‌మ‌స్య ఎక్కువ‌గా బ‌య‌ట‌ప‌డుతున్నదందున‌.. ఈ స‌మ‌స్యతో బాధ‌ప‌డుతున్నవారు వారి శ‌రీరాన్ని వెచ్చగా ఉంచుకునేలా చూసుకోవాలి. ఉద‌యం వేళ‌ల్లోగానీ, పుప్పొడి ఎక్కువ‌గా ఉండే ప్రాంతాల‌కు వెళ్లకుండా చూసుకోవాలి.

ప్రస్తుతం నానాటికి గాలి కాలుష్యం పెరిగిపోవడం వల్ల ప్రతి పది మందిలో ముగ్గురు సీవోపీడీతో బాధపడుతున్నట్టుగా గ‌ణాంకాలు చెబుతున్నాయి. అలాగే సిగ‌రెట్‌కు అల‌వాటుప‌డిన వారిలో ఈ స‌మ‌స్య జీవితాంతం వేధింస్తుందని ప‌రిశోధ‌కులు తేల్చారు. కాబట్టి కాలుష్యానికి, సిగ‌రెట్ స్మోకింగ్‌కు దూరంగా ఉండ‌టం వ‌ల్ల సీవోపీడీ స‌మ‌స్య మ‌న‌ల్ని చుట్టుముట్టకుండా చూసుకోవ‌చ్చు.

Leave a Comment