మనం వ్యాయామం చేస్తున్నప్పుడు చెమట రూపంలో ఎలక్ట్రోలైట్స్ శరీరం నుంచి బయటకు వెళ్లిపోతాయి. శరీరం కోల్పోయిన నీటిని, వాటిలోని శక్తిని తిరిగి శరీరం పొందాలంటే ఏంచేయాలి..? ఎలాంటి ఎలక్ట్రోలైట్ డ్రింకులను తీసుకోవాలి..?
మనం నిత్యం ఎన్నోగ్లాసుల నీరు తాగుతుంటాం. ఈ నీటి నుంచే మన శరీరానికి కావాల్సిన శక్తి అందుతుంది. అయితే మన శరీరానికి అవసరమైనంత మేరకు శక్తి తాగునీటి ద్వారా అందుతుందా అన్నది ప్రశ్నగానే ఉంది. మరి ఇలా నీటి ద్వారా కావాల్సిన శక్తి అందనప్పుడు మరే ఇతర పానీయాల ద్వారా ఎలక్ట్రోలైట్స్ అందుకోవడం అవసరం. ఎలక్ట్రోలైట్స్‌లో మన శరీరానికి కావాల్సిన సోడియం , పొటాషియం, క్లోరైడ్, బైకార్బోనేట్‌లు ఉంటాయి. ఇవన్నీ శరీరంలోని ద్రవాల పీహెచ్ విలువను సమతుల్యం చేయడంలో ప్రభావితం చూపి ఎలక్ట్రైలైట్లుగా మారుతాయి. ఎలక్ట్రోలైట్స్ మన శరీరం నిర్వర్తించే అన్ని విధుల్లో పాల్గొంటుంటాయి. నరాలు, కండరాల పనితీరును నిర్దారిస్తుంటాయి. అందుకని శరీరానికి అవసరమైన మోతాదులో ఎలక్ట్రోలైట్స్‌ను అందించడం ప్రధానమైనదిగా చెప్పుకోవచ్చు.
శరీరం తనకు కావాల్సిన ఎలక్ట్రోలైట్స్‌ను తానే తయారుచేసుకుంటుంది. మనం తీసుకునే ఆహారం ద్వారా శరీరానికి ఎలక్ట్రోలైట్స్ అందుతాయి. అవసరానికి మించి ఎక్కువవడం కూడా శరీరానికి మంచిది కాదని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. సోడియం ఎక్కువైతే రక్తపోటును పెంచుతుంది. పొటాషియం ఎక్కువగా ఉంటే గుండె లయ సమస్యలు వస్తున్నందున శరీరానికి మోతాదు మేరకు అందేలా చూడాలి. వ్యాయామం చేసిన సందర్భాల్లో చెమట బాగా వేసి శరీరంలోని ద్రవాలు బయటకు వెళ్లిపోతాయి. ఇలాంటి సమయంలో ఎలక్ట్రోలైట్స్ ఎక్కువగా అవసరమవుతాయి. అలాగే శరీరం బరువు తగ్గించేందుకు అవలంభించే కీటోజెనెసిస్‌లో తక్కువ క్యాలరీలు శరీరానికి అందుతాయి కాబట్టి శరీరం ఎక్కువ ద్రవాలను కోల్సోతుంది. ఇలాంటి సమయాల్లో ఎలక్ట్రోలైట్స్ ఉండే ద్రవాలను తీసుకోవాలి.
డయేరియాకు గురైన సందర్భాల్లో, వాంతులు చేసుకొన్న సందర్భాల్లో శరీరం ఎక్కువ మొత్తంలో ద్రవాలను కోల్పోతుంది. ఫలితంగా శరీరం నిస్సత్తువగా మారి ఇతర అవయవాలపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అందుకని ఈ దశలో ఎలక్ట్రోలైట్స్ ఉండే ద్రవాలను ఎక్కువగా తీసుకోవడం ద్వారా ద్రవాల ద్వారా కోల్పోయే సోడియం, పొటాషియం, క్లోరైడ్స్‌లను తిరిగి పొందే వీలుంటుంది. కొబ్బరినీటిలో ఉండే ఎలక్ట్రోలైట్స్.. విటమిన్స్ , మినరల్స్ రక్తసరఫరాను , బ్లడ్ ఫ్లోను మెరుగుపరుస్తుంది. బీట్‌రూట్, ఆపిల్ జ్యూస్ కూడా మంచి ఎలక్ట్రోలైట్స్ అందిస్తాయి. శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకముందే ప్రతి అర్ధగంటకు ఒకసారి నీళ్లు తాగడం అలవాటు చేసుకోవాలి.
శరీరం సమతుల్యత పాటించడంలో ఎలక్ట్రోలైట్స్ పాత్ర అమోఘమైనది. ఇవి హార్మోన్లు, శరీర ద్రవాల సాధారణ పనితీరుకు ఆటంకం కలిగించకుండా ఎలక్ట్రోలైట్స్ ఉన్న పానీయాలు తీసుకోవడం ద్వారా శరీరం తిరిగి శక్తిని పుంజుకొంటుంది. సో ఎలక్ట్రోలైట్ డ్రింక్స్ అవసరమైన మేరకు తీసుకోండి.







