Fainting : కళ్ళు తిరుగుతున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

By manavaradhi.com

Published on:

Follow Us
Fainting

కొంతమందికి సడెన్ గా బ్లడ్ ప్రెషర్ తగ్గిపోయి కొన్నిసార్లు కళ్ళు తిరిగి కిందపడిపోతుంటారు. కిందపడిన తర్వాత రక్త ప్రసరణ సాధారణ స్థితికి వచ్చాక తిరిగి లేచి కూర్చుంటారు. ఈ‌ పరిస్థితినే ఫెయింటింగ్ అంటారు. ఈ‌ స్థితులు ఎక్కువగా మధుమేహవ్యాధిగ్రస్తుల్లో , గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. అసలు ఈ‌ సమస్య ఎందుకు వస్తుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యకు దూరంగా ఉండవచ్చో..?

కారణాలు వేరు వేరు కావచ్చు గానీ, కళ్లు తిరగడం అనేది ప్రతి ఒక్కరికీ అనుభవమే. దీనినే ఫెయింటింగ్ అంటారు. ఫెయింటింగ్ సమస్య రావడానికి అనేక కారణాలున్నాయి. మెదడుకు ఆక్సీజన్ సరఫరా సరిగా జరగకపోవడంతో పాటు రక్త సరఫరా సరిగ్గా జరగకపోవడం, రక్తాన్ని ఎక్కువగా కోల్పోవడం వల్ల ఎన్నో కారణాలు ఈ సమస్య తలెత్తడానికి కారణమవుతున్నాయి. రక్తపోటు 110/ 70 కి తగ్గితే దాన్ని లో బీపీ గా పరిగణిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో వ్యక్తులు కళ్ళు తిరిగిపడిపోతుంటారు.

కొన్నిసార్లు ఫెయింటింగ్ అనేది ఎలాంటి వైద్య ప్రాధాన్యత లేని అంశంగా ఉంటుంది. కానీ మరికొన్నిసార్లు తీవ్రమైన జ్వరం మరియు రుగ్మత కారణంగా పెద్ద అనారోగ్య సమస్యగా పరిణమిస్తుంది. ఈ సమస్యకు సంబంధించిన లక్షణాలను వైద్యులు గుర్తించి నిర్ధారణ చేసిన తర్వాతే దీన్ని ఫెయింటింగ్ గా గుర్తించి అత్యవసర వైద్య చికిత్స అందిస్తారు. ఎవరికైతే క్రమం తప్పకుండా కళ్ళు తిరిగినట్లు అనిపిస్తుందో వారు వెంటనే సమీపంలో ఉన్న వైద్యుణ్ణి సంప్రదించాల్సి ఉంటుంది.

ఫెయింటింగ్ సమస్య రావడానికి అనేక కారణాలున్నాయి. మెదడులోని ఓ ప్రాంతానికి రక్తాన్ని చేర్చే నాళాలు మూసుకుపోవడంతో మూర్భ వస్తుంది. దీని వల్లకూడా చాలమంది సోమ్మసిల్లి పడిపోతారు. ఫెయింటింగ్ కు దారితీసే వాటిలో న్యూరో కార్డియోజెనిక్ సింకోప్ ఒకటి. రోగికి రక్త పీడనం తగ్గడం మరియు పల్స్ రేట్ కూడా తగ్గడం వల్ల మెదడుకు రక్తం మరియు ఆక్సిజన్ సరఫరాలో తాత్కాలికంగా ఆటంకం ఏర్పడుతుంది. లో బీపీ వల్ల శరేరంలోని కీలక అవయవాలైన మెదడు, గుండె, మూత్రపిండాలకు ఆక్సీజన్ మరియు ఆహార సరఫరా సరిగ్గా జరగదు. లో బీ పీ వల్ల మన శరీరం లో ని వివిధ భాగాలకు అందవలసినంత ఆక్సిజెన్ అంటే ప్రాణ వాయువు అందదు. దాని వల్ల తల తిప్పటము, వికారం గా అవటము, కళ్ళు తిరిగినట్టయి క్రిందకు వాలిపోవడమో , లేక క్రింద పడిపోవడమో జరగవచ్చు.

సాధారణంగా యుక్త వయసులో ఉన్న యువతులలు కళ్ళుతిరిగి పడిపోవడం చూస్తుంటాము. వారు సాధారణంగా అతి నాజూకు గా ఉండి ఆహారం కూడా చాలా మితం గా తీసుకుని, ఉదయం సరిగా తినక ..అతి ప్రయాస పడటం వల్ల ఇలాంటి లక్షణాలు కనపడవచ్చు. చాలామందిలో ఫెయింటింగ్ సమస్యకు గురైనపుడు వారిలో కొన్ని ప్రత్యేక లక్షణాలు కనిపిస్తాయి. కొంతమంది తమ మెదడును, చర్యలను ఆధీనంలో ఉంచుకోలేకపోతారు. తల తిరగడం, మైకంగా ఉండటం, వికారం, చెమటలు పట్టడం, వాంతులు అవటం, మెడనొప్పి రావడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి.

మధుమేహాం ఉన్నవారిలో చాలమందిలో షుగర్ లేవల్ తగ్గితే వారు సోమ్మసిల్లి పడిపోతుంటారు. కాబట్టి డయాబెటిస్ ఉన్నారు రక్తంలో షుగర్ లేవల్స్ పడిపోకుండా చూసుకోవాలి. అలాగే జీవనశైలిలో మార్పులో చేసుకోవడం ద్వారా ఈ సమస్య కంట్రోల్లో ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఒత్తిడి ఎక్కువగా ఉంటుందో అప్పుడు శరీర అవయవాలకు రక్తప్రసరణ తగ్గి లోబిపి లక్షణాలు మొదలవుతాయి. కాబట్టి లోబిపి రాకుండా ముందుగానే జాగ్రత్త పడాలి.

కొన్నిసార్లు కళ్ళు తిరిగినట్లు అనిపిస్తే వెంటనే కొంత సమయం కూర్చొని పరిస్థితి స్థిమతపడే వరకూ విశ్రాంతి తీసుకోవాలి. కొంతమందిలో ఏ పనిచేయాలన్నా తగినంత సామర్థ్యం ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో సిట్రస్ పండ్లు తీసుకోవడం వల్ల శరీరం స్థిరంగా ఉంటుంది. వికారం సమస్య ఉన్నవాళ్ళు తాజా నిమ్మరసం తీసుకోవాలి. ఇలాంటి జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లైతే ఫెయింటింగ్ సమస్యకు దూరంగా ఉండవచ్చు. కాకపోతే చాలా సార్లు క్రమం తప్పకుండా సోమ్మసిల్లి పడిపోతుంటే వారు వెంటనే వైద్యుణ్ణి సంప్రదించాల్సి ఉంటుంది. దానికి తగిన కారణాలను వివిధ వైద్యపరీక్షల ద్వారా గుర్తించి తగిన చికిత్సను అందిస్తారు.

జాగ్రత్తలతో ఫెయింటింగ్ సమస్యకు దూరంగా ఉండవచ్చు? సాధ్యమైనంత వరకు డీహైడ్రేషన్ ను అవాయిడ్ చేస్తూ మందుల విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యకు దూరంగా ఉండవచ్చు. తద్వారా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

Leave a Comment