Pumpkin Benefits: గుమ్మడి కాయ వల్ల ప్రయోజనాలు తెలుసా?

By manavaradhi.com

Published on:

Follow Us
Health benefits of Pumpkin

భారత సంప్రదాయక వంటకాలలో గుమ్మ‌డికాయ‌కు మంచి స్థానమే ఉంది. అన్ని దేశాలలో దొరికే గుమ్మడిలో అనేక అద్భుత ఔషధాలున్నాయి. గుమ్మడి కాయ అనగానే మనకి గుర్తొచ్చేది దిష్టి. ఇంట్లోని మహిళలు దిష్టి తీయడానికి ఎక్కువగా గుమ్మడికాయనే వాడుతుంటారు. గృహప్రవేశం నుండి కొత్త వెహికిల్స్ దాకా ఇలా ఏ శుభకార్యం అయినా గుమ్మడికాయ కొట్టే మొదలుపెడతారు. పౌష్టిక శక్తిలోకానీ, తినుట కింపుగా ఉండుటయందు కూడా ఇదే మంచిది. గుమ్మడి కాయ రకరకాల వంటగా చేసుకొని తినవచ్చును, జ్యూస్ గా తయారుచేసుకొని తీసుకోవచ్చును, సూప్ లా వాడుకోవచ్చు.

గుమ్మడిలో వివిధ రకాల యాంటీ ఆక్సిడెంట్స్, క్యాల్షియం, ఐరన్, ప్రోటీన్స్, పొటాషియం, ఫాస్పరస్, విటమిన్ ఏ, బీ1, సీ, డీ, బీ12 వంటి ప్రధానమైన విటమిన్స్ పుష్కలంగా ఉంటాయ‌ని, ఫ్లెవనాయిడ్స్, కెరోటినాయిడ్స్ కూడా పుష్కలంగా ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. గుమ్మడి గుండెకు ఎంతోమేలు చేస్తుంది. దీనిలోని పీచు, విటమిన్ సీ గుండెకు రక్తప్రసరణ సక్రమంగా జరిగేలా చూస్తాయి. పొటాషియం అధిక రక్తపోటును తగ్గిస్తుంది. గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. ఎముక సాంద్రత దృఢపడుతుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా ఉంటాయి. గుమ్మడి తిన‌డం వ‌ల్ల వీటిలో ఉండే ఇనుము సంతాన సాఫల్యతను పెంచుతుంది. వీటిలోని విటమిన్ ఏ.. శరీరంలో బీటాకెరొటిన్‌గా మారి హార్మోన్ల అసమతుల్యత రాకుండా కాపాడుతుంది. విటమిన్ సీ .. శరీరంలో వ్యాధినిరోధకశక్తిని పెంచుతుంది. గుమ్మడి గింజలు.. శరీరంలో మేలు చేసే హార్మోన్లను విడుదల చేయడంతో ఒత్తిడి తగ్గి అలసట దూరమవుతుంది. హాయిగా నిద్రపడుతుంది.

గుమ్మడికాయ… దీనిని అందరూ సరిగా తీసుకోరు. కాని దీనివలన అనేక ఉపయోగాలు ఉన్నాయి. గుమ్మడిలో జింక్, విటమిన్ సి ఉండటం వల్ల కాలిన గాయాలకు మందులా పనిచేస్తుంది. గుమ్మడికాయ ప్రొస్టేట్ గ్రంథి వాపుతో బాధపడే వారికి ఉపశమనాన్ని ఇస్తుంది. ఇందులో చాల ఎక్కువగా ల‌భించే బీటా కెరోటిన్.. శరీరానికి తక్కువ క్యాలరీలు అందిస్తుంది . కంటిచూపు మెరుగుప‌డటానికి దోహదం చెస్తాయి. కంటి సంబంధ సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. గుమ్మడి పండునే కాకుండా వాటి లేత ఆకులు, కాండం, పూలు కూడా వంట‌కాల్లో వాడుకుంటుంటారు.

మనం తయారుచేసుకుని తినే వంటకాలు, అందులో వినియో గించే పదార్థాలు అన్నీమన ఆరోగ్యానికి దివ్యఔషధాల్లా పనిచేసేవే. వాటిల్లో గుమ్మ‌డికాయ‌ల‌కు కూడా స్థానం ఉంది. వీటికి కూడా మ‌న మెనూలో భాగం క‌ల్పించి క‌నీసం నెల‌కోసారైనా తినేలా చూసుకుంటే ఆరోగ్యం భేషుగ్గా ఉంటుంది.

Leave a Comment