Teeth Whitening : పళ్ళు తెల్లగా మెరవాలంటే ..?

By manavaradhi.com

Published on:

Follow Us
Teeth Whitening

న‌వ్వు ప‌ర‌మౌష‌ధం. రోజంతా ఎంత క‌ష్ట‌ప‌డుతున్నా ముఖంపై చిరున‌వ్వు లేక‌పోతే దానికి విలువే ఉండ‌దు. అలాగే ఎక్కువ‌గా న‌వ్వుకోవ‌డం ద్వారా ఒత్తిడిని దూరం చేసుకోవ‌చ్చు. అంతటి ప్రాధాన్యం ఉన్న అంద‌మైన చిరునవ్వు సొంతం కావలంటే దంత సౌందర్యం పట్ల ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.

ఓ అందమైన నవ్వు కొన్ని మిలియన్ల గుండెను కరింగిచేస్తాయి. తెల్ల‌టి ప‌లు వ‌ర‌స‌లు మ‌న ముఖ అందాన్ని ఇనుమ‌డించ‌డ‌మే కాకుండా మ‌న‌లో ఆత్మ‌స్థైర్యాన్ని పెంపొందిస్తాయి. మ‌న ముఖంలో అందమైన భాగం పలువరుస. పలువరుస చ‌క్క‌గా ఉన్నా, పళ్ళు పచ్చగా గార పట్టి ఉంటే నలుగురిలో హాయిగా నవ్వలేం. అందుకని ఎప్పుడూ పళ్ళను శుభ్రంగా ఉంచుకోవాలి. దంతాలు ఆహారం నమలడానికి, మాట్లాడటానికి మాత్రమే కాదు, మీ అందాన్నే మార్చివేస్తుంది. నవ్వినా, మాట్లాడినా దంతాలు తెల్లగా, అందంగా కనిపిస్తే ముఖ సౌందర్యం మరింత ఇనుమడిస్తుంది. అందుకని దంతాలను ఎప్పుడూ తెల్లగా, ఎటువంటి మచ్చలు లేకుండా చూసుకోవాలి.

దంతాలు తెల్ల‌గా మెరిసేందుకు ప్ర‌స్తుతం మార్కెట్లో అనేక ర‌కాల సాధ‌నాలు అందుబాటులోకి వ‌చ్చాయి. దంతాల‌ను బ్ర‌షింగ్ చేసుకొనేందుకు వైట‌న‌ర్‌, పండ్ల మధ్య పాచిని తొల‌గించేందుకు బ్లీచింగ్‌ కిట్స్‌, వైట‌నింగ్ స్ట్రిప్స్‌, దంతాలకు తెలుపు తెచ్చే టూత్‌పేస్టులు, నుర‌గ‌లు దొరుకుతున్నాయి. వీటిని వాడ‌టం వ‌ల్ల దంతాల‌పై నిలిచిపోయే ఆహారాల‌ను తొల‌గించ‌డ‌మే కాకుండా వాటికార‌ణంగా ప‌ట్టిన గార‌ను కూడా తొల‌గించుకోవ‌చ్చు. నోట్లో ఎక్కువ‌గా లాలాజలం వృద్ధిచెందించే యాపిల్స్‌, పియ‌ర్స్‌, క్యార‌ట్ వంటివి తిన‌డం వ‌ల్ల దంతాలు శుభ్ర‌ప‌డుతాయి. స్ట్రాబెర్రీలను బాగా నమిలి తిన‌డం వ‌ల్ల వాటిలోని గింజలు పళ్ళపై ఉన్న పచ్చదనాన్ని తొలగించి మెరిసేలా చేస్తాయి. కొబ్బ‌రినూనె, అర‌టి తొక్క‌, ప‌సుపును దంతాల‌పై రుద్దుకోవ‌డం ద్వారా మిల‌మిల మెరిసేట్లుగా చేసుకోవ‌చ్చు.

సరైన పోషకాహారం తీసుకోకపోవడం, సరైన శుభ్రత పాటించకపోవడం, ఆల్కహాలు, కాఫీ, టీలు, కార్బోనేటెడ్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల దంతాలు పుసుపుగా మారుతాయి. పాన్‌మసాలాలు, పొగాకు నమలటం, సిగ‌రెట్ తాగ‌డం, వర్ణ ద్రవ్యాలు అధికంగా ఉన్న పండ్లు, వైన్‌ వంటి వాటి వాడ‌కం వల్ల దంతాల రంగు పసుపుగా మారుతుంది. స్వీట్లు, జంక్‌ఫుడ్స్ తిన‌డం వ‌ల్ల దంతాలు చెడిపోయి ప‌లువ‌రుస దెబ్బ‌తినే అవ‌కాశాలు ఉంటాయి. నిత్యం నోటి శుభ్ర‌త‌పై దృష్టిసారించాలి. రోజూ ప్లాసింగ్ చేసుకోవాలి. దంత‌క్ష‌యం నివార‌ణ‌కు పాలు, పాల ఉత్ప‌త్తులు ఎక్కువ‌గా తీసుకోవాలి. డార్క్ చాక్లెట్ల‌ను తిన‌డం వ‌ల్ల కూడా ప‌ళ్లు తెల్ల‌గా చేసుకోవ‌చ్చు. భోజ‌నం చేసిన అనంత‌రం దంతాల‌ను బ్ర‌ష్ చేసుకోవ‌డం, ఆహారం తీసుకొన్న ప్ర‌తిసారీ దంతాల‌ను నీటితో పుక్కిలించడం చేయ‌డం ద్వారా దంతాల‌ను తెల్ల‌గా కాపాడుకోవ‌చ్చు.

మ‌న చుట్టూ ఉండే వాతావ‌ర‌ణాన్ని కూడా న‌వ్వుతూ ఉండే వారితో ఆహ్లాద‌క‌రంగా మార్చుకుంటే అదే ప‌ది వేలు. మనసారా హాయిగా నవ్వుకోగలిగిన మనిషిని ఏ చింతలూ కలవరపరచలేవు. అందుకే చ‌క్క‌టి ప‌లువ‌రుస‌ను సొంతం చేసుకోండి.. మ‌న‌సారా హాయిగా న‌వ్వుకోండి.

Leave a Comment