Spotless Face Tips: ముఖంపై మొటిమలు, మచ్చలు మాయం కావాలంటే..!

By manavaradhi.com

Published on:

Follow Us
Tips for Acne Scars

అందంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. ముఖ్యంగా మహిళలు తమ అందం విషయంలో పట్టింపుగా ఉంటారు. అందరికంటే తామే అందంగా కనిపించాలని తాపత్రపడుతుంటారు. కానీ ముఖంపై ఏర్పడే మచ్చల వల్ల వారు ఎంతో కుంగిపోతుంటారు. సాధారణంగా యవ్వనంలో ముఖంపై మొటిమలు చాలామందిలో ఏర్పడడం సహజమే. హార్మోన్లలో వచ్చే మార్పులు, ఆహారపు అలవాట్లు, జీవన విధానం వల్ల మొటిమలు ఏర్పడతాయి. ఐతే మొటిమలు తగ్గినా కానీ ఒక్కోసారి ముఖంపై మచ్చలు అలాగే ఉండిపోతాయి. దీంతో ముఖం అందవిహీనంగా కనిస్తుంది.

మొటిమల తర్వాత ఏర్పడే మచ్చలు చర్మం ఉపరితలంపై ఎబ్బెట్టుగా కనిపిస్తాయి. కొన్నిసార్లు మొటిమలు గులాబీ లేదా ముదురు రంగు గుర్తులను వదిలిపెడతాయి. ఈ మచ్చలను తాత్కాలికమైనవని చెప్పవచ్చు. ఇవి క్రమంగా కాలంతో మసకబారతాయి . కానీ దీనికి కూడా కొన్ని వారాల నుంచి నెలల సమయం పట్టే అవకాశం ఉంది. మొటిమల వల్ల ఏర్పడే మచ్చలు ముఖ్యంగా మూడు రకాలుగా ఉంటాయి. వాటిని బాక్స్ కార్స్ , రోలింగ్ స్కార్స్, ఐస్ పిక్ స్కార్స్ గా అభివర్ణించారు చర్మ వ్యాధి నిపుణులు.

మొటిమల వల్ల ఏర్పడే మచ్చలను తగ్గించడానికి సహాయపడే అనేక విధానాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఈ మరకలను నివారించుకునే మార్గాలపై కచ్చితంగా చర్మ వ్యాధి నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవాలి. ఆ తర్వాత చికిత్స తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ప్రస్తుతం అత్యాధునిక లేజర్ చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా చర్మపై ఏర్పడే మరకలను సులభంగా నయం చేసుకోవచ్చు. మచ్చల రూపాన్ని బట్టి తగిన చికిత్సను సూచిస్తారు. చర్మాన్ని తిరిగి సాధారణంగా చేయడానికి లేదా కొత్త కొల్లాజెన్ , ఎలాస్టిన్ ఉత్పత్తిని ప్రోత్సహించడానికి లేజర్ చికిత్స ఉపయోగపడుతుంది. లేజర్ చికిత్సలతోపాటు పలు రకాల ఇంజక్షన్లు కూడా మచ్చల చికిత్స కోసం ఉపయోగిస్తున్నారు. ఈ స్టెరాయిడ్ ఔషధాల వల్ల మచ్చలను సులభంగా నయం చేయవచ్చు. ఇందులో ఫిల్లర్ అని పిలిచే జెల్స్‌ను వాడతారు. తద్వారా ఇండెంట్ చేసిన మచ్చలలోకి వాటిని నేరుగా ఇంజెక్ట్ చేస్తారు. కానీ ఇదంతా తాత్కాలిక ప్రక్రియ మాత్రమే . ఐతే చికిత్స పూర్తయిన తర్వాత మచ్చలు తొలగిపోయి చర్మం మృదువుగా తయారవుతుంది. చర్మంపై ఏర్పడే మచ్చలను తొలగించడానికి శస్త్రచికిత్సా పద్ధతులు కూడా అందుబాటులో ఉన్నాయి. వైద్యులు పంచ్ బయాప్సీలు , డెర్మాబ్రేషన్ లాంటి సాధనాలు ఉపయోగించి .. చర్మంపై ఏర్పడిన పొరను జాగ్రత్తగా తొలగిస్తారు. చర్మం ఉపరితలంపై ఏర్పడిన ఫైబ్రోటిక్ మచ్చలను విచ్ఛిన్నం చేస్తారు.

చర్మం అందంగా కనిపించాలన్నా.. మంచి స్కిన్ టోన్ రావాలన్నా రోజూ సన్ స్క్రీన్ ధరించడం చాలా ముఖ్యం. ఎందుకంటే సూర్యరశ్మిలో వెళ్లినప్పుడు . . చర్మం. . అల్ట్రా వాయిలెట్ కిరణాలను గురి కావడం వల్ల రంగు మారుతుంది. ఇందుకోసం సన్ స్క్రీన్ వాడుకుంటే చర్మం ప్రకాశవంతంగా ఉంటుంది. మరోవైపు చర్మ సౌందర్యం కోసం చాలా మంది ఏవేవో క్రీములు వాడుతుంటారు. వాటి వల్ల వచ్చే ఫలితం తాత్కాలికమే. అంతే కాకుండా.. వాటిల్లో ఉండే రసాయనాల వల్ల చర్మానికీ హాని జరుగుతుంది. అలాకాకుండా సహజమైన పద్ధతుల్లో చర్మానికి మెరుపును తీసుకురావడంపై దృష్టిసారించాలి. అవసరమైతే చ్రమ వ్యాధి నిపుణుల సలహా తీసుకుంటే మంరింత మంచిది.

మొటిమల వల్ల ముఖంపై ఏర్పడిన మరకలను తొలగించేందుకు ఇప్పుడు చాలా పద్ధతులు అందబాటులోకి వచ్చాయి. చర్మ వైద్యులను సంప్రదిస్తే .. ఎవరికి అవసరమైన చికిత్సలను వారికి అందిస్తారు. కాబట్టి .. ముఖంపై ఏర్పడే మచ్చలపై నిశ్చింతగా ఉండవచ్చు. ఐతే .. మొటిమలు రాగానే .. వాటిని గిల్లడం చాలా మందికి అలవాటు . అలా చేయకుండా .. వీలైనంత వరకు .. వాటంతట అవే తగ్గిపోయే వరకు చూసుకోవడం మంచిది. అలాగే చర్మం కాంతివంతంగా మెరిసేందుకు ఎక్కువ నీరు తీసుకోవాలి. నూనెలు, వేపుడు పదార్థాలు తగ్గించాలి. తాజా కూరగాయలు తీసుకోవాలి . క్రమం తప్పకుండా చర్మంపై ఏర్పడే దుమ్ము , ధూళి కణాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి.

Leave a Comment