Health Tips :సీ విట‌మిన్ త‌గ్గితే వ‌చ్చే ముప్పు..!

By manavaradhi.com

Published on:

Follow Us
Vitamin C Benefits, Sources, Supplements

విటమిన్లు సూక్ష్మమైన పోషక పదార్దములు .ఇవి శక్తినిచ్చే పదార్థాలు కావు. శరీరంలొని వివిధ జీవక్రియలను పరోక్షంగా నియంత్రిస్తాయి. వీటి లోపం వలన అనేక వ్యాధులు కలుగుతాయి. ఏ,బీ,సీ,డీ,ఈ,కే.. అనే ఆరు విటమిన్లు ఉన్నాయి.విటమిన్లు కొవ్వులలో కరిగేవి, నీటిలో కరిగేవి.. అనే రెండు ర‌కాలుగా ఉంటాయి. శ‌రీర ఆరోగ్యానికి ప్రధానమైన సూక్ష్మ పోషకాల్లో విటమిన్ సీ ఒకటి. ఇది యాంటీ ఆక్సిడెంట్ గుణం కలిగి ఉంటుంది. విటమిన్ సి రోగనిరోధకశక్తిని పెంపొందించి, జబ్బుల బారిన పడకుండా కాపాడుతుంది. ఎముక‌లు, దంతాలు బలంగా ఉండేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంది. రక్తంలో కొలెస్టిరాల్ ను కరిగిస్తుంది. సి-విటమిన్‌ లోపం వల్ల గుండెజబ్బులు, మెద‌డులోని క‌ణ‌జాలంలో ర‌క్త‌నాళాలు చిట్లి ర‌క్తం గ‌డ్డ‌క‌ట్ట‌డం వ‌ల్ల ప‌క్ష‌వాతం వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయ‌ని ప‌లు ప‌రిశోధ‌న‌లు తేల్చాయి.

మూత్రపిండాలు చెడిపోయి డ‌యాలిసిస్ చేయించుకొనే వారు, ఎక్కువ‌గా ఆల్క‌హాల్ తీసుకొనేవారు, సిగ‌రేట్లు విప‌రీతంగా తాగేవారిలో విట‌మిన్ సీ అవ‌సంర చాలా ఉంటుంది. శ‌రీరంలో ఫ్రీరాడిక‌ల్స్ కార‌ణంగా చెడిపోయిన భాగాన్ని బాగుప‌రిచేందుకు వీరికి మిగ‌తా వారిక‌న్నా రోజుకు 35 మిల్లీగ్రాముల విట‌మిన్ సీ అవ‌స‌రం అవుతుంది. చిన్న దెబ్బ‌ల‌కే ర‌క్తం కారుతున్నా, చిన్న‌చిన్న‌ గాయాలు మాన‌డానికి ఎక్కువ స‌మ‌యం తీసుకొంటున్నా.. ప్లేట్‌లెట్ల సంఖ్య త‌గ్గినా సీ విట‌మిన్ లోపంగా భావించాలి. పంటి చిగుళ్ల నుంచి ర‌క్తం కారుతున్నా.. దంతాలు వ‌దులుగా త‌యారైనా విట‌మిన్ సీ లోపించిన‌ట్టుగా భావించాలి. న‌డుం చుట్టు కొవ్వు చేరి బెల్లీ పెరిగిపోతున్నా విట‌మిన్ సీ త‌క్కువ అవుతున్న‌ట్టుగా గుర్తించాలి. చ‌ర్మం ముడుత‌లు ప‌డిపోవ‌డం, డ్రైగా మారుతున్న‌ట్ట‌యితే విట‌మిన్ సీ మీ శ‌రీరంలో త‌గ్గిపోయిన‌ట్టుగా భావించాలి. త్వ‌ర‌గా అలిసిపోతున్నా , రోగ‌నిరోధ‌క‌శ‌క్తి త‌గ్గిపోయి చిన్న జ్వ‌రానికే ఇబ్బందిప‌డుతున్నా.. దృష్టిస‌మ‌స్య‌లు వ‌చ్చి కాట‌రాక్ట్ ప‌నిచేయ‌కున్నా.. విట‌మిన్ సీ లోపంగా గుర్తించాలి.

విటమిన్ సీ లోపించినవారు స్కర్వి వ్యాధికి లోనవుతారు. ఈ వ్యాధి కార‌ణంగా కంటి చూపు మంద‌గించ‌డ‌మే కాకుండా ఎముకల ఎదుగుదల లేక బాధపడతారు. వేలి గోర్లు ప‌గిలిపోవ‌డం, కీళ్ల‌నొప్పులు రావ‌డం, చర్మం కింద ఉండే ర‌క్త‌నాళాలు చిట్లి రక్తస్రావం జ‌రుగుతుంది. డయాబెటిస్ వ్యాధిగ్రస్థుల్లో షుగర్ స్థాయి నియంత్ర‌ణ‌లో సీ విట‌మిన్ ఎంతో తోడ్పడుతుంది. ఇంత అద్భుతమైన ఈ పోషక పదార్థం.. నారింజ, పచ్చిమిరప, పుచ్చపండు, పొప్పడి, ద్రాక్ష, మామిడి, జామ, టమాట, గోబీపువ్వు, క్యాబేజి, పైనాపిల్‌, నిమ్మ వంటి సిట్రస్ పండ్ల రసాల్లో, ఆకుకూరల్లో పుష్క‌లంగా ల‌భిస్తుంది. అలాగే ఆకుప‌చ్చ మిర‌యాలు, బ్ర‌కోలీ, కివీ పండు, స్ట్రాబెర్రీల్లో అధికంగా ఉంటుంది.

శరీరంలో విటమిన్ల మోతాదు తగ్గినా.. పెరిగినా సమస్యలు తప్పవు. అన్ని విట‌మిన్ల మాదిరిగానే సీ విట‌మిన్ కూడా మ‌న‌కు ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది. నిత్యం విట‌మిన్ సీ ఆహారాలు తీసుకోవ‌డం ద్వారా ప‌లు అనారోగ్య సమస్యలు దరిచేరవు.

Leave a Comment