Meditation : రోజులో ధ్యానం చేయడానికి ఉత్తమ సమయం ఏది?

By manavaradhi.com

Published on:

Follow Us
Meditation

మ‌నిషి ఆరోగ్యంగా ఉండేందుకు యోగా, వ్యాయామాలు ఎంత దోహ‌దం చేస్తాయో.. ధ్యానం కూడా అంతే దోహ‌ద‌ప‌డుతుంది. ధ్యానం వ‌ల్ల మాన‌సిక ఆరోగ్యం మెరుగు ప‌డుతుంది. మ‌న‌స్సు ప్ర‌శాంతంగా మారుతుంది. ఏకాగ్ర‌త పెరుగుతుంది. ఒత్తిడి, ఆందోళ‌న త‌గ్గుతాయి. దీంతోపాటు ప్ర‌శాంత‌మైన జీవితం గ‌డ‌ప‌వ‌చ్చు.

ధ్యానంఒత్తిడి, నిరాశ మరియు యాంగ్జైటీ యొక్క సంకేతాలను తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాక జ్ఞానపరమైన సామర్ధ్యాలు యొక్క సంరక్షణ మరియు పని ప్రదేశంలో మీ పనితీరును మెరుగుపరచడానికి ఎంతగానో సహాయపడుతుంది. ధ్యానం చేయడానికి ముందు మీరు చేయాల్సిందల్లా మీకు అనుకూలంగా ఉన్న ఒక సమయాన్ని ఎంచుకోవాలి. మీరు దీనిని రోజు ప్రారంభ సమయాల్లో చేయటం మంచిది. ఈ సమయంలోనే నిశ్సబ్దం మరియు ప్రశాంతత ఉంటాయి. అంతేకాక మీకు గందరగోళం మరియు నగర జీవితం యొక్క సాధారణ గజిబిజి ఉండదు. అయితే, రోజులో ఈ సమయంలో తగినంత ఖాళీ లేని వారు అనేక మంది ఉన్నారు. మీ పని అయిన తర్వాత సాయంత్రం లేదా నిద్రించే ముందు చేయవచ్చు.

మీరు ప్రతి రోజు ఒకే సమయంలో చేయాలి. ఒక సౌకర్యవంతమైన ప్రదేశాన్ని ఎంచుకోండి. మీరు మీ బెడ్ రూమ్ ను ఎంచుకోవచ్చు. అలాగే ఒక తోట లేదా ఒక పచ్చిక కలిగిన ప్రదేశంలో చేయవచ్చు. మీరు శబ్దాలకు దూరంగా చాలా సమర్థవంతంగా ధ్యానం చేయవచ్చు.

అనుకూలమైన సమయాన్ని చూసుకొన్న మాదిరిగానే మీకు ఆటంకము కలగని ప్రదేశాన్ని చూసుకోండి. ఒక నిశ్శబ్దమైన మరియు ప్రశాంతమైన పరిసరాలు మనకు ధ్యానం యొక్క గొప్ప అనుభూతి కలగడానికి దోహదపడాయి. మీ భంగిమ కూడా మీ ధ్యానం మీద ప్రభావం చూపుతుంది. మీరు ప్రశాంతంగా, సౌకర్యవంతంగా, స్థిరంగా ఉండేలా చూసుకోండి. మీ వెన్నెముక నిటారుగా ఉండేలా నేరుగా కూర్చోండి. మీరు ధ్యానం చేసినంతసేపు కళ్ళు మూసుకొని భుజములు మరియు మెడ ప్రశాంతంగా ఉంచుకోండి. పద్మాసనం లో కూర్చొని ధ్యానం చెయ్యమని నిపుణులు చెబుతున్నాయి.

భోజనం చెయ్యడానికి ముందు ధ్యానం చెయ్యడం మంచిది. ఒకవేళ భోజనం చేసిన తరువాత ధ్యానం చేస్తే మీకు నిద్ర రావచ్చు. అలాగే ఏది ఏమైనా కూడా మీరు ఆకలిగా వున్నపుడు ధ్యానం చెయ్యడానికి ప్రయత్నించకండి. ఎందుకంటే మీ ద్యాసంతా ఆకలి మీదకు వెళుతుంది. ఐతే మీరు భోజనం చేసిన 2 గంటల తరువాత ధ్యానం చెయ్యవచ్చు.సులభమైన వ్యాయామం లేదా సూర్య నమస్కారాలు చెయ్యడం వలన రక్త ప్రసరణ జరుగుతుంది. దీనివల్ల మీ శరీరం లో వున్నా జడత్వం పోయి శరీరం తేలికగా అనిపిస్తుంది.ఇలా చెయ్యడం వలన మీరు ధ్యానం లో చాలాసేపు కూర్చోగలరు.

విసర్జన సమయంలో పారాసింపథెటిక్‌ నాడీ వ్యవస్థ ఉత్తేజితం అవుతుంది. దీంతో ఒత్తిడి తొలగిపోయి, హాయి భావన కలుగుతుంది. ఈ సమయంలో మనసు కుదురుగా ఉంటుంది. అందువల్ల కాలకృత్యాలు తీర్చుకున్నాక కాసేపు ధ్యానం చేసుకోవటం మంచిది. దీంతో శరీరం మరమ్మతు చేసుకునే ప్రక్రియ పుంజుకుంటుంది. ఎవరికి ఇష్టమైన పద్ధతిలో వారు ధ్యానం చేసుకోవచ్చు. కళ్లు మూసుకొని శ్వాస మీద దృష్టి నిలిపినా చాలు. ధ్యానం ఇష్టం లేనివారు ఆత్మావలోకనమైనా చేసుకోవచ్చు. తమను తాము అర్థం చేసుకోవటానికి, తప్పొప్పులను, బలాలు బలహీనతలను గుర్తించటానికిది ఉపయోగపడుతుంది. ధ్యానం అనేది పూర్తిగా విశ్రాంతి సమయం. కాబట్టి దీనిని మీకు పూర్తిగా అనుకూలమైన సమయంలో చెయ్యాలి. కాబట్టి మీకు ఆటంకము కలగని సమయాన్ని, ప్రాంతాన్ని చూసుకోండి.

మాములుగా సూర్యోదయం మరియు సూర్యాస్తమయం ధ్యానం చెయ్యడానికి అనుకూలంగా వుంటాయి. ధ్యానం చేసేటప్పుడు వదులుగా ఉన్న బట్టలను ధరించాలి. టైట్ గా ఉన్న బట్టలను ధరిస్తే గాలి ఆడదు. నేల మీద చాప వేసుకొని చేయాలి. శాంతియుతంగా కూర్చుని మీ మోకాలు పై మీ చేతులను ఉంచండి. మీ కాళ్ళను క్రాస్ గా పెట్టండి. ఇప్పుడు, శాంతముగా మీ కళ్ళు మూసుకొని, లోతైన శ్వాస తీసుకోండి. ప్రత్యేకంగా ముక్కు ద్వారా శ్వాస తీసుకోండి. మీ వెన్నెముక పొడవుగా నిటారుగా ఉండాలి. చాలా రిలాక్స్ గా మెడను ఉంచండి. ఈ సమయంలో మీ కళ్ళను మూసి ఉంచటానికి ప్రయత్నించాలి. మన మనస్సు ఆందోళన నుండి విముక్తి పొందేలా ప్రశాంతత మరియు శాంతి ధ్యానం వల్ల కలుగుతుంది. ధ్యానంలో వచ్చే ఆనందం ద్వారా మనం ఆనందకరమైన, స్వచ్ఛమైన స్థితిని అనుభవించగలుగుతాము.

ఇలా నిత్యం ధ్యానం చేస్తే మంచి ఫ‌లితాలు ఉంటాయి. అయితే రాత్రి నిద్ర‌కు ఉప‌క్ర‌మించే ముందు 5 నిమిషాల పాటు ధ్యానం చేస్తే చ‌క్క‌ని నిద్ర‌ను కూడా పొంద‌వ‌చ్చు. మ‌రుస‌టి రోజు ఉద‌యం నిద్ర‌లేచాక మైండ్ ఫ్రెష్‌గా ఉంటుంది. కొత్త ఆలోచ‌న‌లు వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది. రిలాక్స్‌డ్‌గా ఉంటారు.

Leave a Comment