Antibiotics : ఎక్కువగా యాంటీబయాటిక్స్ మందులు వాడితే ఏమవుతుందో తెలుసా..!

By manavaradhi.com

Published on:

Follow Us

యాంటీబయాటిక్‌ బ్యాక్టీరియాను సంహరించి, మన ప్రాణాల్ని కాపాడటంలో వరంలాంటి ఔషధం ఇది. శాస్త్రవేత్తలు రకరకాల యాంటీబయోటిక్స్‌ అందుబాటులోకి తెచ్చారు. ఇవన్నీ రకరకాల బ్యాక్టీరియాను సంహరించే అస్త్రాలే. శ‌రీరానికి ద్రోహం చేసే శత్రువుల‌ను త‌రిమికొట్టేందుకు మ‌నం ప్ర‌ధానంగా యాంటీ బ‌యోటిక్స్ వాడుతుంటాం. ముఖ్యకంగా మిగిలిపోయిన యాంటీబయాటిక్స్ మోతాదుకు మించి వాడ‌టం కార‌ణంగా ర‌క‌ర‌కాల స‌మ‌స్య‌ల్ని కొనితెచ్చుకుంటున్నాం. ఇంత‌టి స‌మ‌స్యాత్మ‌క‌మైన యాంటీ బయాటిక్స్ ను విచ్చలవిడిగా వాడడం తగ్గించాలి. జ‌లుబు, జ్వ‌రం రాగానే వైద్యుడ్ని సంప్ర‌దించ‌డం ఎందుక‌ని ఇంటిలో అంతకు ముందు ఎప్పుడో వాడిన నాలుగు ట్యాబ్లెట్లు వేసుకొంటాం. మనకు తెలియకుండా ఓవర్ డోస్ వేసుకుంటూ వ్యాది నిరోధన శక్తిని తగ్గించేసుకుంటున్నాం. పదేళ్లుగా ఈ వాడకం బాగా పెరిగింది. మ‌రోవైపు జబ్బు త్వరగా తగ్గిపోతుంది కదా అని.. డోస్ లు పెంచి మరీ వాడుతున్నారు. ఈ విచ్చలవిడి వాడకం ఒక్కోసారి ప్రాణానికే ప్రమాదం అని హెచ్చిరిస్తున్నారు వైద్యులు.

  • బ్యాక్టీరియాలన్నీ చెడ్డవే కాదు. వీటిలో మనకు సాయం చేసేవీ, హాని కారక క్రిముల నుంచి మనల్ని కాపాడేవీ ఉంటాయి. ఈ మంచి బ్యాక్టీరియా లేకపోతే మనం ఆరోగ్యంగా ఉండటం కష్టం. అయితే మనం యాంటీబయాటిక్‌ వేసుకున్నప్పుడు- దాని ప్రభావానికి చెడు బ్యాక్టీరియానే కాదు.. కొంత మంచి బ్యాక్టీరియా కూడా చనిపోతుంది. అందుకే విరేచనాల వంటి రకరకాల దుష్ప్రభావాలు బయల్దేరతాయి. కొన్నిసార్లు మంచి బ్యాక్టీరియా దెబ్బతిని, దాని స్థానంలో కొంత చెడు బ్యాక్టీరియా చేరుతుంది. దాంతో కొత్త సమస్యలు బయల్దేరతాయి. కాబట్టి యాంటీబయాటిక్స్‌తో అంతా మంచే అనుకోవద్దు.
  • పిల్లలకు జబ్బు చేసినప్పుడు లేదా ఏవేని గాయాలు తగిలినప్పుడు మీ అంతట మీరుగా నిర్ణయించేసుకుని యాంటిబయాటిక్స్‌ను వాడటం మంచిది కాదు. ఎల్లప్పుడు డాక్టరును సంప్రదించిన తరువాత, ఆయన సూచించిన మేరకే చిన్నపిల్లలకు యాంటిబయాటిక్స్‌ను ఇవ్వాలి.
  • వివిధ వ్యాధుల నివారణకు యాంటీ బయోటిక్స్ వాడడం సర్వసాధారణం. శరీరంలోని కాలేయం వంటి అవయవాల మీద ఈ యంటి బయాటిక్స్ ప్రభావం పడి, జాండిస్ వంటి వ్యాధులకు దారితీసే ప్రమాదం ఉంది. పవర్ ఫుల్ యాంటిబయోటిక్ ఇంజక్షన్లు ఎక్కువ కాలం పాటు తీసుకుంటే అవి కిడ్నీల మీద ప్రభావం చూపే ప్రమాదం ఉంది. అందుకనే ఏ మందులనైనా డాక్టర్ల సలహా సూచనలను అనుసరించే వాడాలి.వ్యాధిని బట్టే యాంటీ బయాటిక్స్ వాడే కాలవ్యవధి ఆధారపడి ఉంటుంది.

ఎప్పుడో వాడగా మిగిలిపోయిన యాంటీబయాటిక్స్‌ను మళ్లీ వినియోగిస్తుంటారు చాలామంది. వైద్యుల సిఫారసు లేకుండానే వాటిని పిల్లలు, కుటుంబ సభ్యులకు ఇస్తుంటారు. ఇలా ఇష్టం వచ్చినట్లు యాంటీబయాటిక్స్‌ను వాడటం ఆరోగ్యానికి హానికరం. దీనివల్ల వ్యాధినిరోధక శక్తి తగ్గిపోతుందని వైద్యులు చెబుతున్నారు. శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని తగ్గించేసి.. యాంటీబయోటిక్స్ తో నింపేస్తున్నారు. యాంటీ బయోటిక్స్ ఎంత ఎక్కువగా వాడితే అన్ని కొత్త రోగాలు పుట్టుకొస్తాయి. సర్జరీ సమయంలో.. యాంటిబయోటిక్స్ పాత్ర కీలకమైనది. రెగ్యులర్ గా వీటిని తీసుకునే వారికి ఆపరేషన్ సమయంలో పనిచేయకపోతే ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. విచ్చ‌ల‌విడిగా వాడ‌టం వ‌ల్ల యాంటీ బాడీ రెసిస్టెన్స్ పెరిగి.. జ‌బ్బు త‌గ్గ‌క‌పోవ‌డం వంటి కొత్త స‌మ‌స్య‌లు పుట్టుకొస్తున్నాయి. అవ‌స‌రం లేకుండా యాంటీ బ‌యోటిక్స్ వాడ‌టం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఉప‌యోగ‌ప‌డే బ్యాక్టీరియాను కూడా నాశ‌నం చేస్తుంది. వ్యాధి చాలా వరకూ బ్యాక్టీరియా వల్లనే వచ్చిందని గుర్తించినప్పుడు యాంటీబయాటిక్స్‌ తప్పకుండా వాడాలి. పరీక్షలు చేసి క్రిమిని గుర్తించినప్పుడు వాడొచ్చు. కాబట్టి విచక్షణతో వాడటం ముఖ్యం.

వైద్యుల చీటీ లేకుండా కూడా యాంటీబయాటిక్స్‌ దుకాణాల్లో విరివిగా దొరుకుతున్నాయి. వీటిని ఎప్పుడు, ఎందుకు వాడాలన్న అవగాహన లేకుండా ఎవరికివారు కొనుక్కొని వాడేసుకుంటున్నారు. అవసరం లేకున్నా విచక్షణా రహితంగా వాడటం వల్ల బ్యాక్టీరియా వీటికి అలవాటుపడి మొండిగా తయారవుతోంది. వైద్యుడి స‌ల‌హా లేకుండా ఎడాపెడా యాంటీబ‌యోటిక్స్ వాడి అనర్థాల‌ను కొనితెచ్చుకోవ‌ద్ద‌ని కూడా నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.

Leave a Comment