Dandruff – చుండ్రుకు చెక్ పెట్టాలంటే… ఇలా చేయండి..!

By manavaradhi.com

Published on:

Follow Us
Dandruff

మన శరీరం లో అతి పెద్ద భాగం చర్మం. ఇందుకు తగ్గట్టే చర్మానికి వచ్చే సమస్యలు కూడా అనేకం. అటువంటి వాటిలో అత్యంత సాధరణంగా కనిపించేదే dandruff లేదా చుండ్రు. సాధరణంగా స్కిన్ పైన ఉండే స్కిన్ సెల్స్ లేదా కణాలు పాతవి రాలి కొత్తవి వస్తుంటాయి. తలపైన అంటే మాడు చర్మం నుంచి మృత కణాలు రాలి కొత్తవి రావడం కూడా అలాంటిదే. కానీ ఎపుడైతే సాధారణ స్థాయికి మించి ఇలా స్కిన్ రాలిపోతుందో దానినే మనం చుండ్రు అంటున్నాం.

టీనేజర్స్ , అడల్ట్స్ ని ఒకే విధంగా ఇబ్బంది పెట్టే స్కిన్ కండిషన్ dandruff. తెల్లటి జిడ్డుతో కూడిన పొట్టు తలలో మాడు ప్రాంతం లో, అలాగే అది రాలుతూ ఉండే భుజాలను చూస్తే వారికి dandruff సమస్య ఉందని తేలిగ్గా తెలిసిపోతుంది. అంతే కాదు దురద పెడుతూ, ఉపశమనం కోసం బాగా గోకడం ద్వారా మాడు చర్మం ఎర్రగా పొలుసులు వలె తయారు కావడం సమస్య తీవ్రత ని సూచిస్తుంది. వింటర్ లో ఎక్కువగా ఇబ్బంది పెడుతూ మరలా వేసవి సమయానికి చుండ్రు సమస్య కాస్త శాంతించడం కూడా dandruff లక్షణమే.

సాధరణంగా అత్యధిక శాతం dandruff కేసుల్లో ప్రత్యేకించి వైద్య చికిత్స అవసరం పడకపోవచ్చు. Dandruff ఎలా తగ్గించుకోవాలి అనగానే ముందుగా గుర్తు కొచ్చేది anti dandruff షాంపూలు. కానీ ఓవర్ the counter dandruff షాంపూ లు కనుక ఎలాంటి ఫలితం ఇవ్వడం లేదు అలాగే, మాడు మరీ ఎర్రబడి, వాపు, దురద ఎక్కువగా ఉన్న పరిస్థితిలో మాత్రం స్కిన్ స్పెషలిస్ట్ సహాయం తప్పనిసరి. కారణం ఏది అని తెలుసుకోవడం తప్పనిసరి. ఒక్కో సారి వాడుతున్న హెయిర్ ప్రాడక్ట్స్ పడక చుండ్రు వెనుక స్కిన్ సెన్సిటివిటీ కారణం కావచ్చు. లేదంటే పెద్దవారిలోవచ్చే ఫంగల్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ కారణం కావచ్చు. వీటితో పాటు అపరిశుభ్రంగా ఉండే హెయిర్ లో కూడ చుండ్రు రావచ్చు. అందుకే కారణం ఏది అని తెలుసుకొని అందుకు తగ్గ చికిత్స తీసుకోవడం మంచిది.

ఆశ్చ్యర్యమ్ ఏంటంటే అప్పుడే పుట్టిన శిశువులను కూడా వదిలిపెట్టదు dandruff. వీరిలో కనిపించే ఈ స్కిన్ కండిషన్ ని క్రేడిల్ క్యాప్ అని పిలుస్తారు. ఇక చిన్న పిల్లల్లో కూడా ఇది ఎపుడైనా రావచ్చు. సాధరణంగా పిల్లల్లో వచ్చే చుండ్రు సమస్యకి ప్రత్యేకించి యెలాంటి ట్రీట్మెంట్ అవసరం పడకపోవచ్చు, కొన్ని ప్రత్యేక జాగ్రత్తల మినహా. Dandruff ప్రతి ఒక్కరిలో కొద్దో గొప్పో ఉంటుంది. ఎందుకంటే కొత్త స్కిన్ cells వచ్చే క్రమంలో పాతవి రాలి పోవడం సహజం. కానీ ఆదిమరీ ఎక్కువగా ఉంటే తప్ప మనకి సమస్య అని బయటకు కనిపించకపోవచ్చు.

టీనేజర్స్, పురుషులు, జిడ్డు గా ఉండే మాడు, నరాల సంబంధ సమస్యలు ప్రత్యేకించి Parkinson సమస్య ఉన్నవారిలో సెబోరిక్ డర్మిటైటిస్ తో చుండ్రు వచ్చే అవకాశం ఎక్కువ.ఇక హెచ్ ఐ వి ఇన్ఫెక్షన్స్ ఉన్నవారికి కూడా రిస్క్ ఎక్కువే. Dandruff కి ట్రీట్మెంట్ మొదలు పెట్టినవారు అది పూర్తి అయ్యే వరకు వాడుతూ, పెర్శనల్ శుభ్రత maintain చేయడం మంచిది. ఇక scalp హెల్తి గా ఉండేలా మరీ జిడ్డు లేని ఆయిల్స్ వాడుకోవచ్చు. చర్మం మీదా తేమ పోకుండా ఉండే నాణ్యతా కలిగిన hair products వాడడం మేలు.

Leave a Comment