Health tips: రాత్రివేళ సరిగా నిద్రపోవట్లేదా? లేట్ నైట్ ఫుడ్ తింటున్నారా..? జరిగేది ఇదే..!

By manavaradhi.com

Updated on:

Follow Us
night time bad habits

ఆరోగ్యమే మహాభాగ్యం. దీని కోసం రకరకాల పద్దతులు పాటిస్తుంటారు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయే వరకూ ఎన్నో రకాల వ్యాయామాలు, మరెన్నో జాగ్రత్తలు తీసుకుంటూంటారు. కానీ మనకు ఉన్న చిన్న చిన్న అలవాట్లు మన ఆరోగ్యానికి చేటుచేస్తున్నాయి. అందులోనూ రాత్రి వేళ‌ల్లో మ‌న చెడు అల‌వాట్లే మ‌న‌కు ప‌గ‌టి వేళ అనారోగ్యాన్ని తెచ్చిపెడుతుంటాయి.

సాధారణంగా మనలో ప్రతి ఒక్కరిలోనూ కొన్ని చెడు అవాట్లు, కొన్ని మంచి అలవాట్లు ఉంటాయి. కానీ, కొన్ని చెడు అలవాట్లకు మనం కావాలని అలవాటు పడం. కానీ మనకు తెలియకుండానే కొన్ని పనులు చేస్తూ అలవాట్లుగా మార్చుకుంటాం. ముఖ్యంగా రాత్రి వేళ జీవితాంతం మ‌నం చేసే కొన్ని చెడు అలవాట్లను మానుకోవాలి. మంచి ఆరోగ్యానికి ముఖ్యమైనది ఆరోగ్యకరమైన మరియు ఉత్తేజకరమైన మనస్సు. మన మనస్సు ఆరోగ్యకరంగా లేకపోతే దాని ప్రభావం శరీరంలోని రోగ నిరోధక శక్తిపై ఉంటుంది. ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి.

ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు మాత్రమే కాకుండా కొన్ని రకాల చెడు అలవాట్లు కూడా శరీర బరువును ప్రభావిత పరుస్తాయి. రాత్రి సమయంలో స్మార్ట్ ఫోన్ ను ఎక్కువగా వాడటం, కాఫీలు ఎక్కువగా తాగడం, రాత్రివేళ ఎక్కువగా తినడం, మద్యం సేవించడం లాంటి చెడు అలవాట్ల కారణంగా ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటోంది.

ఇటీవ‌లి కాలంలో రాత్రిపూట ప‌నిచేయ‌డం సాధార‌ణంగా మారిపోయింది. అందునా ఎక్కువ సేపు కుర్చీలో కూర్చుని చేసే కంప్యూట‌ర్ ఉద్యోగాలు కావ‌డంతో జీవ‌క్రియ‌ల ప‌నితీరు మంద‌గించ‌డం, శ‌రీరం బ‌రువెక్క‌డం వంటి స‌మ‌స్య‌లతోపాటు గుండె ప‌నితీరుపై ఎక్కువ ప్ర‌భావం చూపుతుంది. రాత్రిపూట ఎంత బాగా నిద్ర‌పోయాం అనేది మ‌న ఆరోగ్యంపై తీవ్ర‌ప్ర‌భావం చూపుతుంది. నిపుణులు సూచించిన మేర‌కు కాకుండా 8 గంట‌ల క‌న్నా త‌క్కువ నిద్రపోయే వారిలో హైబీపీ, గుండె సంబంధ స‌మ‌స్య‌లు, డ‌యాబెటిస్‌, మాన‌సిక ఆందోళ‌న వంటి స‌మ‌స్య‌లు మొద‌లై మ‌న ఆరోగ్యాన్ని దెబ్బ‌తీస్తాయి.

మ‌న‌లో చాలా మందికి ఎక్కువ సౌండ్ పెట్టుకొని పాట‌లు విన‌డం, పాడటం అల‌వాటు. రాత్రి స‌మ‌యంలో ఈ అల‌వాటు మ‌రీ ఎక్కువ‌గా ఉంటుంది. ఈ అల‌వాటు కార‌ణంగా 60 డెసిబుల్స్ క‌న్నా ఎక్కువ ధ్వ‌ని చెవుల్లోకి వెళ్లి చెవిటిత‌నం త్వ‌ర‌గా ప్రాప్తిస్తుంది. ముఖ్యంగా రాత్రిళ్లు ఎక్కువగా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు వాడే వారికి అనారోగ్య సమస్యలు ఎక్కువగా చుట్టుముట్టే ప్రమాదం ఉంది. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ల నుంచి వెలువడే బ్లూలైట్ ఒక్క నిద్రలేమికే కారణం కాకుండా అనవసరంగా బరువు పెరగడం, డిప్రెషన్, క్యాన్సర్ తోపాటు గుండె సమస్యలను కూడా తీసుకొచ్చే ప్రమాదం ఉంది.

రాత్రి సమయంలో సరైన స్థాయిలో నిద్ర, విశ్రాంతి లేకుంటే జీవక్రియలు సరిగా జరగవు. శరీరంలోని అలసట పూర్తిగా దూరం కాదు. ఫలితంగా జీర్ణ సమస్యలు, మానసిక సమస్యలు దరి చేరుతాయి. గుండె సంబంధిత వ్యాదులు, డయాబెటిస్, కీళ్ళనొప్పులు, ప్రీమెచ్యూర్ ,ఏజింగ్ వంటి సమస్యలన్నీ నిద్రలేమి వల్ల కలుగుతాయని అద్యయనాలు చెబుతున్నాయి. సరైన నిద్ర వల్ల వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. బరువు తగ్గడానికి డైట్ ప్లాన్ చేస్తుకుంటున్న వారు నిద్ర విషంలోనూ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి.

అతిగా మ‌ద్యం సేవించ‌డం అనే అల‌వాటుతో మూత్ర‌పిండాలు దెబ్బ‌తిన‌డం, కాలేయం, జీర్ణ‌క్రియ స‌మ‌స్య‌లు, ఎముక‌లు బ‌ల‌హీనం అవ‌డంతోపాటు కొన్నిర‌కాల క్యాన్స‌ర్ల‌కు దారితీస్తుంది. అలాగే రాత్రి వేళలో అతిగా తిన‌డం కూడా ఇబ్బందుల‌ను తెచ్చిపెడుతుంది. మ‌రీ ముఖ్యంగా ఫాస్ట్‌పుడ్స్‌, కేకులు, పిజ్జాలు, మ‌సాలా ఆహారాలు రాత్రి పూట తిన‌డం వ‌ల్ల ఆరోగ్యం దెబ్బ‌తింటుంది. దాంతోపాటు న‌మ‌ల‌కుండా వేగంగా తిన‌డం వ‌ల్ల కూడా స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. ప‌గ‌టిపూట ఆరోగ్యంగా ఉండాలంటే రాత్రివేళ‌ల్లో దంతాల మ‌ధ్య ఇరుక్కున్న ప‌దార్థాల‌ను తొల‌గించుకోవాలి. ఎక్కువ క్యాల‌రీలు ల‌భించే పేస్త్రీలు, స్వీట్లు తినొద్దు. సిగ‌రెట్ స్మోకింగ్ ను పూర్తిగా మ‌నుకోవాలి.

Leave a Comment