Good Habbits: మంచి అలవాట్లు… వీటిని పాటిస్తే ఎన్నో ప్రయోజనాలు.. జీవితకాలం కూడా పెరుగుతుంది.

By manavaradhi.com

Published on:

Follow Us
Manage Stress

మంచి అలవాట్లు మనం హాయిగా జీవించటానికి, మన ఆరోగ్యాన్ని పెంపొందించుకోవటానికి ఎంతగానో తోడ్పడతాయి. అయితే ప్రస్తుత బిజీ ప్రపంచంలో రోజురోజుకూ మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా అనేకరకాల రోగాలు చుట్టుముడుతున్నాయి. అయితే వీటన్నింటికి ఒక్కటే సరైన పరిష్కారం అంటున్నారు వైద్యనిపుణులు. కొన్ని టిప్స్ పాటించ‌డం ద్వారా గుడ్ హెల్త్ ను సొతం చేసుకోవచ్చు.

మంచి ఆరోగ్యానికి మంచి అలవాట్లే కీలకం. మ‌నం చేసే పనులు, అనుసరించే నియమాల పైన మాత్రమే మ‌న‌ ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని మ‌రిచిపోవ‌ద్దు. అందుకోసం మన జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలి. కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. ఆరోగ్యం గా ఉండడమంటే ఆనందంగా ఉండటమే.. ఎవరైతే ఆరోగ్యంగా ఉంటారో వాళ్ళు కచ్చితంగా ఆనందంగా ఉంటారంటారు. నిజమే కదా! ఆరోగ్యంగా ఉండటం కోసం మనం చేసే ప్రయత్నాలు ఎన్నో.

కొంతమంది పని రాక్షసుల్లా పనిచేస్తారు. పని తప్ప మరో లోకం వాళ్లకు తెలియదు. అలా ఉండకూడదు. పని టైంలో పని చెయ్యాలి. రోజులో మూడు నాలుగు గంటలు రిలాక్స్ అయ్యేందుకు కూడా వీలు కల్పించుకోవాలి. మరీ ఎక్కువ టెన్షన్లు పెట్టుకోకూడదు. మాటిమాటికీ టెన్షన్ వద్దు.కొవ్వు పదార్ధాలు తగ్గించాలి. కొవ్వు పదార్ధాలు ఏ మోతాదులో తింటున్నారో జాగ్రత్తగా చెక్ చేసుకుని అలవాటును మార్చుకోవాలి. తగినంత కొవ్వును మాత్రమే తీసుకోవాలి. చెడు కొవ్వు ఉండే వాటిని అతి తక్కువగా తినాలి.

కూల్డ్రింక్స్ని అధికంగా తాగితే బరువు త్వరగా పెరుగుతారు. వాటిలో ఉండే చక్కెర శరీరంలో కొవ్వుని పెంచుతుంది. ఫలితంగా డయాబెటిస్, గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. బరువు తగ్గాలి అనుకునే వాళ్లు కూల్డ్రింక్స్కి దూరంగా ఉండాలి. వాళ్లు, వీళ్లు అని కాదు ఎవరైనా సరే కూల్ డ్రింక్స్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. నిద్రపోవడం అంటే అందరికీ ఇష్టమే. సాధారణంగా చాలా మంది సమయం దొరికితే చాలు, ఒక్క సెలవు దొరికితే చాలు హ్యాపీ నిద్రపోవాలి. రెస్ట్ తీసుకోవాలి అనుకుంటారు. ప్రతి ఒక్కరికీ నిద్ర చాలా అవసరం. ఎంత అవసరం అంటే ఆరోగ్యానికి మంచి చేసేంత.

ప్రతిరోజు 6 నుండి 8 గంటల పాటూ నిద్రపోవటం ఆరోగ్యానికి మంచిది అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 9 గంటల కంటే ఎక్కువ సమయం పాటూ నిద్రపోవటం వలన శరీర విధులలో ఆటంకాలు ఏర్పడతాయి. అతినిద్ర వలన పూర్తి ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రతి రోజూ ఒకే సమయానికి పడుకోవడం, ఒక సమయానికి నిద్రలేవడం చాలా మంచిది. ఎక్కువగా మద్యం సేవించడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఎక్కువగా మద్యాన్ని సేవించడం వల్ల దీర్ఘ కాలిక ఆరోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి మద్యానికి దూరంగా ఉంటే మంచిది.

కార్బోహైడ్రేట్లు ఒక సూక్ష్మపోషకం అవి మన శరీరానికి కావాల్సిన శక్తిని ఇస్తాయి.అంతే కాదు కండరాలకు మరియు మెదడుకు ఇంధనంగా పనిచేస్తాయి. కాబట్టి కీటో డైట్ మాదిరిగా వాటిని పూర్తిగా వదిలించుకోవడం మంచి ఆలోచన కాకపోవచ్చు. వాటిని ఎప్పటికీ వదులుకోవడం అంత సులభం కాదు. కాబట్టి ఎల్లప్పుడు మన శరీరానికి కావాల్సిన మోతాదులో కార్బోహైడ్రేట్లు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. ప్రస్తుత ఆధునిక కాలంలో మనకు కావాల్సిన ఆహారాలు ఫ్యాకింగ్ రూపంలో లభిస్తున్నాయి. మీరు వాటిని కొనే ముందు ఒకసారి లేబుల్ మరియు పదార్థాల జాబితాను చదవండి. మీరు ఏమి పొందుతున్నారో తెలుసుకోవడానికి ఇది ఏకైక మార్గం.

శరీరానికి విటమిన్లు మరియు ఖనిజాలు చాలా అవసరం. అవన్నీ సప్లీమెంట్స్ రూపంలో పొందడం సులభం అనిపించవచ్చు. కాని అది ఆరోగ్యాని అంత మంచిది కాదు. మన శరీరానికి కావాల్సిన విటమిన్లు ,పోషకాలను ఆహారాలద్వారా తీసుకుంటేనే ఆరోగ్యానికి మంచిది. చాలా మంది హ్యాండ్ శానిటైజర్ తరచుగా చాలా అదిగా ఉపయోగిస్తారు అది మంచి పద్దతికాదు. మీకు అవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగించడం మంచిది. దీనిని విస్తృతంగా ఉపయోగించడం వల్ల కొన్ని సూక్ష్మక్రిములు బలంగా పెరుగుతాయని మరియు కొన్ని సందర్భాల్లో, శానిటైజర్లను తక్కువ ప్రభావవంతం చేస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

Leave a Comment