రక్తంలో ఉండే చాలా కీలకమైన అంశాలే ప్లేట్‌లెట్స్. రక్తం గడ్డకట్టడానికిఉపయోగపడే ఇవి మీ జీవితంలో ఇప్పటికే మీ ప్రాణాలను అనేక సార్లు మౌనంగా కాపాడే ఉంటాయి. లో ప్లేట్ లెట్ కౌంట్ బ్లీడింగ్ కు దారితీస్తుంది. లోబ్లడ్ ప్లేట్ లెట్స్ ను థ్రోమ్బోసైటోఫినియా అని పిలుస్తారు . ముక్కు నుండి రక్తస్రావం, ఎక్కువ తలనొప్పి, కండరాల్లో నొప్పి వంటి ఎన్నో రకాల సమస్యలకు దారితీస్తుంది.
సహజంగా ప్రతి మనిషి రక్తంలో లక్షన్నర నుంచి నాలుగున్నర లక్షల వరకు ప్లేట్‌లెట్స్ ఉంటాయి. ఇవి మనకు ఏదైనా గాయం వల్ల రక్తం బయటకు వచ్చినప్పుడు గడ్డకట్టేలా, గాయం వెంటనే తగ్గిపోయేలా పని చేస్తాయి. అందుకే ప్లేట్‌లెట్స్ తగ్గిపోతే మనిషి ప్రాణానికే ముప్పు. ప్లేట్‌లెట్స్ తగ్గితే తీవ్ర జ్వరం, బీపీ, హార్ట్ అటాక్, నీరసం వచ్చేప్రమాదం ఉంటుంది. మనిషి ఎముకల్లోని మజ్జ నుంచి ప్లేట్‌లెట్లు ఉత్పత్తి అవుతాయి. ఆరోగ్యంగా ఉన్నవారిలో 450 మిల్లీమీటర్ల రక్తంలో 5000 ప్లేట్‌లెట్లు ఉండాలి.
విషజ్వరాలు వచ్చినప్పుడు వ్యాధికారక వైరస్ ఈ ప్లేట్‌లెట్లను మింగేస్తుంది. దీని ఫలితంగా శరీరంలోని ఎర్ర రక్తకణాల్లో ప్లేట్‌లెట్లు క్రమంగా తగ్గుతాయి. ఒక్కోస్థాయిలో 10 వేలకు పడిపోయే అవకాశముంది. అప్పుడు బాధిత వ్యక్తి కళ్లు, ముక్కు, మూత్రనాళాల నుంచి రక్తం ఆగకుండా బయటకు వస్తుంది. సకాలంలో ప్లేట్‌లెట్లు ఎక్కించకపోతే ప్రాణం కూడా పోయే ప్రమాదముంది.
రక్తంలో ఉండే చాలా కీలకమైన అంశాలే ప్లేట్‌లెట్స్. రక్తం గడ్డకట్టడానికి ఉపయోగపడే ఇవి మీ జీవితంలోనూ ఇప్పటికే మీ ప్రాణాలను అనేక సార్లు కాపాడే ఉంటాయి. డేంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు, శరీరంలో ప్లేట్ లెట్స్ తీవ్రంగా తగ్గిపోతాయి. దాంతో ప్రాణానికి ప్రమాదం ఏర్పడుతుంది. లోబ్లడ్ ప్లేట్ లెట్స్ ను వైద్య పరిభాషలో థ్రోమ్బోసైటోఫినియా అని పిలుస్తారు. కొన్నిసాదారణ లక్షణాల ద్వారా గుర్తించవచ్చు. ప్లేట్‌లెట్లు పడిపోయినప్పుడు వివిధ అవయవాల్లోని లోపలి పొరల్లోంచి రక్తస్రావం కావడం కనిపిస్తుంది. అంగిలి, చిగుళ్లు, ముక్కు వీటిలోని లోపలి పొరల్లోంచి రక్తస్రావం కావచ్చు. సూక్ష్మ రక్తనాళాల్లోంచి చర్మం మీదికి చిన్న చిన్న చుక్కల్లా రక్తం మచ్చలు కనిపిస్తాయి.
మహిళల్లో బహిష్టు సమయంలో మామూలుగా కన్నా చాలా ఎక్కువగా రక్తస్రావం అవుతుంటే అనుమానించాలి. రోగిలో ప్లేట్‌లేట్స్ కణాల సంఖ్య తగ్గిపోతే రక్తస్రావం అవుతుంది. అది కడుపులో నుంచి వాంతుల రూపంలోగానీ, మూత్రంలో, విరోచనాల ద్వారా కానీ బ్లీడింగ్ అవుతుంది. ఉండాల్సిన స్థాయిలో ప్లేట్‌లెట్లు ఉంటే రక్త స్రావం జరగదు. రోగికి తీవ్ర జ్వరం, శరీరంపై ర్యాష్ రావడం, రక్తం వాంతులు, రక్తం విరోచనాలు, మూత్రంలో రక్తంస్రావం ఉంటే వెంటనే వైద్యులను సంప్రందించాలి.
రోగి ఆరోగ్య పరిస్థితిని బట్టి కొన్నిసార్లు ప్లేట్‌లెట్స్ ఎక్కించాల్సి ఉంటుంది. ప్రతి రోగికి ప్లేట్‌లెట్స్ తగ్గాయని భర్తీ చేయాల్సిన అవసరం ఉండదు. ఒక్కోరికి ఒక్కో విధంగా చికిత్స అందించాలి. . వైరస్ తీవ్రతను బట్టి ప్లేట్‌లెట్స్ పరిస్థితి ఉంటుంది. కొందరిలో వైరస్ తీవ్రత తగ్గితే వారం, పది రోజుల్లో అవసరమున్న స్థాయిలో ప్లేట్‌లెట్స్ భర్తీ అవుతాయి. వాటిని అవసరమైన సమయంలో ఇవ్వాల్సి ఉంటుంది.
ప్లేట్‌లెట్స్ తగ్గడానికి కొన్ని రకాల ఇన్‌ఫెక్షన్లు కూడా దోహదం చేస్తున్నాయి. ముఖ్యంగా డెంగీ, మలేరియా, లెప్టోస్పైరోసిస్ వంటి వ్యాధుల్లో ఈ తరహా ఇన్‌ఫెక్షన్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు కారణం తెలియకుండానే ప్లేట్‌లెట్స్ తగ్గిపోతాయి. లెప్టోస్పైరోసిస్ వంటి వ్యాధుల్లో ఈ జబ్బు సమస్య మరింత త్రీవంగా ఉంటుంది. కాలేయం, బ్లడ్ కేన్సర్ రోగుల్లో కూడా ప్లేట్‌లెట్స్ తగ్గుతాయని వైద్యులు చెబుతున్నారు. ఎముకల్లోని మూలుగపై తీవ్ర ప్రభావం చూపే మందులు వాడినప్పుడు. రక్తంలో ప్లేట్‌లెట్స్ తగ్గుతాయి. అలాగే మనకు వైరల్ ఇన్‌ఫెక్షన్ సోకిన సమయంలో కూడా ప్లేట్‌లెట్స్ సంఖ్య తగ్గుతుంది.
హెచ్‌ఐవీ, పర్వోవైరస్, డెంగీ, హైపటైటిస్-సి, సైటోమోగలో వైరస్ సంక్రమించినప్పుడు కూడా కర్తంలో ప్లేట్‌లెట్స్ తగ్గిపోతాయి. ప్లేట్ లెట్ స్థాయిలు తగ్గకుండా ఉండాలన్నాఐరన్ అధికంగా ఉన్న ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. శరీరంలో ప్లేట్ లెట్స్ తగ్గినప్పుడు అతి తక్కువ సమయంలో ప్లేట్ లెట్స్ ను అభివృద్ది చేసే కొన్ని ప్రత్యేకమైన ఆహారాలను తీసుకోవడవ వల్ల సహజంగానే ప్లేట్ లెట్స్ పెరుగుతాయి. ప్లేట్ లెట్స్ సమస్యతో బాధపడేవారు తప్పనిసరిగా అధిక విటమిన్స్, మినరల్స్ ఆహారాలను తీసుకోవడం ద్వారా కూడా శరీరం ఎక్కువ ప్లేట్ లెట్స్ ను ఉత్పత్తి చేస్తుంది. అది అనారోగ్యకరమైన శరీరం నుండి తర్వగా కోలుకునేందుకు సహాయపడుతుంది .
ప్లేట్ లెట్స్ తక్కువగా ఉన్న సమస్యతో బాధపడేవారు, తప్పనిసరిగా అధిక విటమిన్స్ మరియు మినిరల్స్ ఉన్న ఆహారాలను తీసుకోవడం ద్వారా కూడా శరీరం ఎక్కువ ప్లేట్ లెట్స్ ను ఉత్పత్తి చేస్తుంది… తర్వగా కోలుకొనేందుకు సహాయపడుతుంది .