Weight loss: బరువు తగ్గడానికి తిండి మానేస్తున్నారా..? అయితే అసలు బరువు తగ్గరు..!

By manavaradhi.com

Updated on:

Follow Us

బరువు తగ్గించుకోవడంలో భాగంగా చాలా మంది ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. తిండి మానేస్తుంటారు. అధికంగా వ్యాయామం చేస్తుంటారు. ఇష్టమైన వాటిని ఎన్నింటినో వదులుకుంటూ ఉంటారు. అయినప్పటికీ బరువు తగ్గే విషయంలో వారిని ఇబ్బందులు చుట్టు ముడతాయి. నిజానికి బరువు తగ్గేందుకు భోజనం మానేయడం మంచి మార్గమే. దీని వల్ల శరీరంలో జీవక్రియ తగ్గుతుంది. ఫలితంగా కేలరీలు కరుగుతాయి. ఇంత వరకూ బాగానే ఉంది. అయితే ఉపవాసం లాంటి సమయాల్లో ఈ పరిస్థితి ఉండదు. ఉపవాసం తర్వాత ఎక్కువ ఆహారం తీసుకోవడానిక అవకాశం ఉంటుంది. ఇలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి రోజు మూడు పూటల భోజనం తీసుకోవాలి.

బరువు తగ్గాలనుకుంటే చిన్న చిన్న భాగాలుగా 3 గంటలకు ఒక సారి తినడం ఉత్తమం. మరికొంత మంది బరువు తగ్గడానికి వ్యాయామం అవసరం లేదు అనుకుంటారు. ఇది కూడా సరైన ఆలోచన కాదు. ఆహార నియంత్రణతో పాటు వ్యాయామం అత్యంత అవసరం. ఆహారం విషయంలో నియంత్రణ పాటించడంతో పాటు రోజూ కనీసం 30 నిముషాల నడక లేదావ్యాయామం బరువు తగ్గడానికి సాయం చేస్తుంది. రెండింటినీ కలిపి చేయడం ద్వారా గుండె ఆరోగ్యం మెరుగు పడడంతో పాటు, రక్తపోటు అదుపులో ఉండడం లాంటి ప్రయోజనాలు చేకూరుతాయి.

ఆలస్యంగా తినడం లేదా పడుకునే ముందు ఆహారాన్ని తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారని చాలా మంది భావిస్తూ ఉంటారు. ఎక్కువ ఆహారం తీసుకున్నప్పుడు తగినంత వ్యాయామం లేకపోతే బరువు పెరుగుతారు. చాలా మంది ఆలస్యంగా తీసుకోవడం ద్వారా శరీరంలో అదనంగా కొవ్వు పేరుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి, దాన్ని పరిహరిస్తే సరిపోతుంది. సమయాన్ని బట్టి, సరైన విధంగా ఆహారం తీసుకోవాలి.

  • చాలా మంది పిండి పదార్థాలు తీసుకుంటూ, కొవ్వు పదార్థాలు తగ్గిస్తే బరువు సులభంగా తగ్గవచ్చు అని భావిస్తూ ఉంటారు. ఇది కూడా సరైన ఆలోచన కాదు.
  • పిండి పదార్థాలు శరీర పోషణకు ప్రాథమికమైనవి అయినప్పటికీ, వాటిలో కొవ్వు ఉంటుంది. వీటిని మాత్రమే తినడం ద్వారా బరువులో ఏ విధమైన మార్పు రాదు. అందుకే శరీర తత్త్వాన్ని బట్టి అవసరమైన పోషణ అందే విధంగా ఆహారాన్ని తీసుకోవలసి ఉంటుంది.
  • కార్బొహైడ్రేట్లు తగ్గించి, లేదా అవి మాత్రమే తీసుకుని బరువు తగ్గే విధానం కొంత మంది ఇబ్బందులకు దారి తీస్తుంది. కాబట్టి తప్పనిసరిగా బరువు తగ్గే విషయంలో ఆహారాన్ని మాత్రమే నమ్ముకోకూడదు.
  • కొవ్వు తక్కువగా ఉండే ఆహారంలో కేలరీలు తక్కువగా ఉంటాయనే ఆలోచన కేవలం అపోహ మాత్రమే. ఆపిల్ లాంటి పండ్లలో తక్కువ కొవ్వు ఉంటుంది. అదే సమయంలో కేలరీలు పుష్కలంగా ఉంటాయి. అందుకే బరువు తగ్గాలనుకునే వారు, వారు తీసుకునే ఆహారంలో కేలరీల స్థాయిని ఎప్పటికప్పుడు సరి చూసుకుంటూ ఉండాలి.
  • అలాగే తప్పని సరిగా 45 నిముషాల పాటు వ్యాయామం చేయాలనే నియమం కూడా లేదు. 30 నిముషాల నడకను చేస్తూ ఉండడండి. దాని వల్ల బరువు అదుపులోకి వస్తుంది.
  • బరువు పెరగడానికి కొవ్వు మాత్రమే కారణం అనే అపోహలో ఉంటాము. కానీ కొన్ని కండరాలు కొవ్వు పెరగేందుకు తోడ్పడతాయి. ఇలాంటి వాటి విషయంలో జీవక్రియ రేటుకు, బరువుకు సంబంధం ఉండదు.
  • ఫలానా ఆహారం వల్ల మాత్రమే బరువు తగ్గుతారనే నియమం లేదు. ఎందుకంటే వారి వారి శరీర తత్త్వాన్ని బట్టి కొన్ని రకాల ఆహారాలు కొందరి బరువును పెంచితే, మరికొందరి బరువును తగ్గిస్తాయి.
  • ఆరోగ్యకరమైన జీవనశైలి బరువును అదుపులో ఉంచుకోవడానికి సాయపడుతుంది. సరిపడిన స్థాయిలో ప్రొటీన్లు, విటమిన్లు తీసుకోవడం, ఆహారం ఫైబర్ ఉండేలా చూసుకోవడం అవసరం. అదే విధంగా నిత్యం వ్యాయామం చేస్తూ ఉండాలి.
  • ఒక్క సారిగా వ్యాయామం ఆపడం, అదే విధంగా అధికంగా వ్యాయామం చేయడం లాంటి పద్ధతులు కూడా బరువు తగ్గడంలో సాయం చేయవు.
  • అదే పనిగా ఉపవాసాలు ఉండడం లాంటివి కూడా బరువు సంగతి అలా ఉంచితే, పోషకాహార లోపాలకు, ఇతర ఎముకల సమస్యలకు కారణం అవుతాయి. అందుకే బరువు తగ్గాలనుకునే వారు సరైన నిపుణలు పర్యవేక్షణలో ఉంటూ, తీసుకోవలసిన ఆహారం గురించి తెలుసుకుంటూ, తగిన మోతాదులో, సరైన సమయంలో తీసుకోవడం ద్వారా మంచి ప్రయోజనాలు ఉంటాయి.
  • చాలా మంది ఉన్నట్టుండి నెల రోజుల్లో బరువు తగ్గాలని భావిస్తూ ఉంటారు. ఇది అస్సలు మంచి పద్ధతి కాదు. బరువు క్రమంగా తగ్గుతూ రావాలే తప్ప, ఉన్నట్టుండి తగ్గడం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలు ఉత్పన్నం అవుతాయి.

Leave a Comment