AP Cabinet Decisions : ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు

By manavaradhi.com

Published on:

Follow Us

రాష్ట్రంలో మరి కొద్ది రోజుల్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన కొనసాగుతోన్న మంత్రి మండలి సమావేశంలో పలు కీలక అంశాలకు పచ్చజెండా ఊపారు. ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకోంది.

ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌లో డీఎస్సీ నిర్వహణ, నోటిఫికేషన్ జారీపై చర్చించారు.. సుమారు 6 వేల టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేసేందుకు ఆమోద ముద్ర వేసింది ఏపీ కేబినెట్‌.. మరోవైపు.. వైఎస్సార్ చేయూత నాలుగో విడతకు కేబినెట్ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.. ఫిబ్రవరి నెలలో వైఎస్సార్ చేయూత నిధులు విడుదలకు ఆమోదం తెలిపింది.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు 5 వేల కోట్ల మేర నిధుల విడుదలకు ఆమోద ముద్ర వేసింది. ఇక, ఎస్ఐపీబీ ఆమోదించిన తీర్మానాలను గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏపీ మంత్రిమండలి.

ఇంధన రంగంలో 22 వేల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు కూడా పచ్చజెండా ఊపింది ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌ సమావేశం. ఇంధన రంగంలో 22,302 కోట్ల పెట్టుబడుల ద్వారా ప్రత్యక్షంగా 5,300 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.. 3350 మెగావాట్ల సోలార్‌ ప్రాజెక్ట్‌ల ఏర్పాటుకు జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ లిమిటెడ్‌ కు ఆమోదం లభించింది.. దాదాపు 12,065 కోట్ల పెట్టుబడి పెట్టనున్న జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ లిమిటెడ్‌ ఏర్పాటు చేయనున్నారు.. ఆగ్వాగ్రీన్‌ ఇంజినీరింగ్‌ మేనేజ్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ 1000 మెగావాట్ల సోలార్‌ ప్రాజెక్ట్‌ను ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.. 4 వేల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ఆ సంస్థ ముందుకు వచ్చింది.. ఇక, ఎక్రోన్‌ ఎనర్జీ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ 1350 కోట్లు పెట్టుబడి ప్రతిపాదనకు కేబినెట్‌ పచ్చజెండా ఊపింది.

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

  • 6,100 పోస్టులతో మెగా డీఎస్సీ నిర్ణయానికి కేబినెట్ ఆమోదం
  • అటవీ శాఖలో 689 పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం
  • ఫిబ్రవరి 16 నుంచి వైఎస్ఆర్ చేయూత నిధుల విడుదలకు ఆమోదం
  • ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు రూ.5వేల కోట్ల నిధుల విడుదలకు ఆమోదం
  • ప్రతి గ్రామ పంచాయతీకి పంచాయతీ సెక్రటరీ ఉండాలన్న నిర్ణయానికి ఆమోదం
  • SERTలోకి IB భాగస్వామ్యానికి కేబినెట్ ఆమోదం
  • యూనివర్శిటీలు , ఉన్నత విద్యా సంస్థల్లో పని చేస్తున్న.. నాన్ టీచింగ్ సిబ్బంది పదవీ విరమణ వయసు.. 60 నుంచి 62కు పెంపు 📈
  • SIPB ఆమోదించిన ఎనర్జీ ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం✅
  • నంద్యాల, కర్నూలు జిల్లాల్లో.. రెండు విండ్ పవర్ ప్రాజెక్టులకు ఆమోదం
  • శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాల్లో..
  • 600 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్టుల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం
  • RJUKTకి రిజిస్ట్రార్ పోస్టు ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం
  • ఆ మేరకు చట్టంలో సవరణకు కేబినెట్ ఆమోదం

Leave a Comment