ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ‘దేవర’ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన వసూళ్లు సాధించింది. లాంగ్ రన్‌లో ఈ సినిమా రూ.400 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది అంటూ వార్తలు వస్తున్నాయి. ఇటీవలే ఈ సినిమా ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓటీటీలోనూ ఈ సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది అంటూ స్వయంగా నెట్ ఫ్లిక్స్ ఇండియా వారు చెబుతూ ఉన్నారు.
ఓటీటీలో దేవర సినిమా వచ్చి మూడు వారాలు పూర్తి అయింది. ఇప్పటి వరకు 5.8 మిలియన్‌ల వ్యూస్‌ను రాబట్టింది. కాస్త ఆలస్యంగా హిందీ దేవర స్ట్రీమింగ్ అయింది. హిందీలోనూ ఈ సినిమా ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. దాంతో ఇప్పుడు మరింతగా సినిమా వ్యూస్‌ను సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో అత్యధిక వ్యూస్‌ను రాబట్టిన ఇండియన్ మూవీగా దేవర సినిమా టాప్‌లో నిలిచింది. నాన్ ఇంగ్లీష్ చిత్రాల చార్ట్‌లో దేవర సినిమా ఓవరాల్‌గా నాల్గవ స్థానంలో దేవర సినిమా నిలిచిందని నెట్ ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటన చేసింది.ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్‌కి కచ్చితంగా ఇది చాలా పెద్ద సక్సెస్‌గా ఓటీటీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఈ మూవీలో #NTR డ్యూయోల్ రోల్ లో తండ్రి కొడుకుగా ప్రేక్షకులను మెప్పించారు. దేవర సినిమాతో జాన్నీ కపూర్ తెలుగు సినిమాల్లోకి అడుగుపెట్టింది. సంగీత దర్శకుడు అనిరుద్ ఈ చిత్రానికి పాటలు అందించాడు.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించడంలో పాటలు కీలక పాత్రలు పోషించాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఈ సినిమాతో ఎన్టీఆర్ సరికొత్త రికార్డును సృష్టించాడు. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ఎన్టీఆర్ కి మంచి గుర్తింపు దక్కింది. ఇప్పుడు దేవరతో సినిమా ఆ క్రేజ్ మరింతగా పెరిగింది. అంతా దేవర 2 కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.