నేటి ఆధునిక జీవనశైలిలో మధుమేహం ఉన్న వారి సంఖ్య రోజు రోజుకీ గణనీయంగా పెరుగుతుంది. మధుమేహం గతి తప్పిన ఆహారపు అలవాట్లు, కనుమరుగైన శారీరక శ్రమ, శృతి మించిన ఒత్తిళ్లు, ఆందోళనల వల్ల ఈ తీపి జబ్బు మనపై పంజా విసురుతోంది. దీంతో తరచూ చాలా మంది చిన్న చిన్న వ్యాధులు, ఇన్‌ఫెక్షన్ల బారినపడుతూ ఉంటారు. దీనికి కారణం వారి శరీరంలో ఇమ్యూనిటీ పవర్ తక్కవగా ఉండడమే… మారుతున్న కాలానికి తగ్గట్టు శరీర రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాలను తీసుకోవాలి.
మనం జీవించడానికి, జీవక్రియలు సక్రమంగా జరగడానికి కావలసిన శక్తి ఆహారం ద్వారా లభిస్తుంది. అందుకే మనం తీసుకునే ఆహారం విషయంలో సరైన నియమాలు పాటించకపోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. వాటిలో ముఖ్యమైనది మధుమేహం. ఏటా లక్షలాది మంది ఈ వ్యాధిబారిన పడుతున్నారు. అందువల్ల చాపకింద నీరులా మనల్ని వెంటాడుతున్న ఈ డయాబెటిస్ ముప్పు నుంచి బయటపడాలంటే ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మంచి రోగనిరోదక శక్తి ఉంటే వ్యాధులు వచ్చే ప్రమాదం తక్కువ.
మన శరీరంలో విషాపద్ధాలను బయటకు పంపటానికి మరియు వ్యాధుల మీద పోరాటం తెల్ల రక్త కణాలు చేస్తాయి. అందువల్ల శరీరంలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండాలి. శరీరంలో జరిగే విధులకు రోగనిరోదక శక్తితో సంబంధం ఉంది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటే తరచుగా జలుబు, జ్వరం, అలర్జీల బారిన పడుతూ ఉంటారు. అందువల్ల రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలు నిత్యం తీసుకుంటూ ఉండాలి.
రోగనిరోదక శక్తిని పెంచే ఆహాలు ఏవి ?
మారుతున్న కాలానికి తగ్గట్టు సరైన పోషకాహారం తీసుకోవాలి. విటమిన్లు, మినరల్స్, పోషకాలు సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాలను డైట్ లో చేర్చుకుంటే.. శరీరానికి కావాల్సిన రోగనిరోధక శక్తి అందుతుంది. విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం మంచిది. ఇవి వైరస్‌పై పోరాడి ఇన్‌ఫెక్షన్లు దరి చేరకుండా కాపాడుతాయి. టమాట, నారింజ, నిమ్మ, కమలా, కివి వంటి వాటిలో విటమిన్ సి ఎక్కువ మోతాదులో ఉంటుంది. క్యారెట్ కంటికే కాదు రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడుతుంది.
నిత్యం అరకప్పు తాజా క్యారెట్‌ను తీసుకోవడం వల్ల ఇందులో ఉండే బీటా కెరోటిన్, విటమిన్ బి6లు యాంటీ ఆక్సిడెంట్లను ఉత్తేజపరుస్తాయి. ఎంతో రుచికరంగా ఉండే పెరుగును చాలా మంది నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ పెరుగును ప్రతిరోజూ ఒక కప్పు తీసుకోవాలి. ఇది జీర్ణాశయంలో ఉండే బాక్టీరియాను నిర్మూలిస్తుంది. గ్రీన్ టీలో రోగనిరోదక శక్తిని పెంచటానికి యాంటీఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉంటాయి. గ్రీన్ టీ శరీరంలో ప్రతి అవయవం పనితీరు బాగుండేలా రోగనిరోదక శక్తిని పెంచుతుంది.
మధుమేహాం ఉన్నవారు ఆహారం విషంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..?
శరీరం కోల్పోయిన యాంటీ ఆక్సిడెంట్స్ తిరిగి ఏర్పడటానికి జింక్ బాగా తోడ్పడుతుంది. కోడిగుడ్లు, మాసం, పెరుగు, పాలు, బీన్స్ తోపాటు సీఫుడ్‌లలో జింక్ లభిస్తుంది. ప్రతి వంటకానికి రుచితో పాటు.. సువాసనను అందించే వెల్లుల్లిని నిత్యం తీసుకోవడం మంచిది. దీనిలో ఉండే మినరల్స్ బ్యాక్టీరియా, ఫంగస్ ఇన్‌ఫెక్షన్‌లపై పోరాడేలా చేస్తాయి. డైట్ లో వెల్లుల్లిని చేర్చుకుంటే ఎలాంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు. పసుపును ఎక్కువుగా వివిద రకాల వంటకాల్లో ఉపయోగిస్తారు. ఇందులో అనేక రకాల ఔషద గుణాలు కూడా ఉన్నాయి. శరీరంలో రకాల దోషాలను ఇది నియంత్రిస్తుంది. రోగ నిరోధక వ్యవస్థను మెరుగ్గా పని చేసేలా చేస్తుంది.
బాదంపప్పుల్లో విటమిన్ ఎ, సి, ఇలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణను అందిస్తాయి. విటమిన్ ఇ రోగనిరోధక వ్యవస్థ పనితీరును నిర్వహించడానికి సహాయపడే చక్కటి పోషకం. గింజలు మరియు విత్తనాలు, బాదం, హాజెల్ నట్స్, పొద్దుతిరుగుడు విత్తనాలు విటమిన్ ఇ యొక్క అద్భుతమైన వనరులు. గింజలు మరియు విత్తనాలలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్ మరియు ఫైబర్ కూడా ఉంటాయి, ఇవి రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడతాయి. బెల్ పెప్పర్స్ విటమిన్ సి యొక్క మరొక అద్భుతమైన మూలం మరియు శరీరం నుండి ఫ్రీ రాడికల్స్ ను తొలగించడంలో సహాయపడుతుంది.
తరచూ చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయంటే మీరు తీసుకునే ఆహారం సరైనది కాదు అని అర్థం. కాబట్టి శరీరానికి కావాల్సిన రోగ నిరోధక శక్తి అందితేనే.. ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి నిత్యం తినే ఆహారంలో రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారం ఉండేలా జాగ్రత్త పడాలి. అప్పుడే మనం ఆరోగ్యం ఉండగలుగుతాం…