ఢిల్లీలో మంగళవారం 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకల్లో అల్లు అర్జున్ తనకుంటూ సరికొత్త చరిత్ర సృష్టించాడు. జాతీయ ఉత్తమ నటుడిగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా అవార్డ్ అందుకున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప’ సినిమాకు గానూ జాతీయ ఉత్తమ్ నటుడిగా స్టార్ హీరో అల్లు అర్జున్ అవార్డ్ అందుకున్నారు. తెలుగు సినీ ఇండస్ట్రీ నుండి జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డ్ అందుకున్న తొలి హీరోగా రికార్డ్ క్రియేట్ చేశాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఇదే వేదిక పైన పుష్ప సినిమాగానూ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా దేవి శ్రీ ప్రసాద్ అవార్డ్ అందుకున్నారు.
అగ్రదర్శకులు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన భారీ చిత్రం RRRకు కంగా ఆరు అవార్డులు సొంతం చేసుకుంది. ఉత్తమ ప్రజాదరణ పొందిన ఫీచర్ ఫిలింగా RRR పురస్కారం సొంతం చేసుకుంది. ఉత్తమ నేపథ్య సంగీతం అవార్డును ఆస్కార్ విన్నర్ ఎం.ఎం.కీరవాణి దక్కించుకున్నారు. #RRR సినిమాలో పాపులర్ సాంగ్ కొమరం భీముడో పాట పాడిన కాలభైరవ ఉత్తమ నేపథ్య గాయకుడు అవార్డు అందుకున్నారు. ఇదే సినిమాలో ‘నాటు నాటు’ పాటకు గాను ప్రేమ్ రక్షిత్‌ను ఉత్తమ కొరియోగ్రఫీ పురస్కారం స్వీకరించారు. బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ శ్రీనివాస మోహన్ అవార్డు దక్కింది. అలాగే, యాక్షన్ కొరియోగ్రఫీకి గాను యాక్షన్ డైరెక్టర్ కింగ్ సాలమన్‌కు అవార్డు లభించింది.
ఉత్తమ తెలుగు చిత్రం ‘ఉప్పెన’ఉత్తమ తెలుగు చిత్రంగా జ్యూరీ ఎంపికైయింది. ప్రముఖ సినీ గేయ రచయిత చంద్రబోస్ ‘కొండపొలం’మూవీకి బెస్ట్ లిరిక్స్ అవార్డ్ అందుకున్నారు. చంద్రబోస్‌కు జాతీయ పురస్కారం దక్కడం ఇదే తొలిసారి.ఇక తెలుగు సినీ విమర్శకుడు పురుషోత్తమ్ చార్యులు ఉత్తమ విమర్శకుడు అవార్డును దక్కించుకున్నారు. 69వ జాతీయ చలనచిత్ర వేడుకల్లో మొత్తంగా తెలుగు సినిమాకు పది అవార్డులు దక్కాయి. జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో తెలుగు సినిమాకు ఈ స్థాయిలో అవార్డుల పంట పండడం ఇదే తొలిసారి కావడం విశేషం.