Onion Prices : ఉల్లి ధరలు ఎప్పుడు తగ్గుతాయంటే..!

By manavaradhi.com

Published on:

Follow Us

రోజురోజుకు పెరిగిన ఉల్లి ధరలు తగ్గించే ప్రయత్నం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. మరి కొద్ది రోజుల్లోనే పెరిగిన ఉల్లి ధరలు త్వరలోనే దిగొస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. జనవరిలో కిలో ఉల్లి ధర (Onion prices) రూ.40 దిగువకు చేరుతుందని ఆశిస్తున్నట్లు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్‌ కుమార్‌ సింగ్ తెలిపారు. ప్రస్తుతం కిలో ఉల్లి సగటు ధర రూ.57.02గా ఉంది. దీంతో సామాన్యూలు ఉల్లి కొనాలంటే తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు.

ఇటీవలి కాలంలో ఉల్లి ధరలు బాగా పెరిగడంతో కేంద్ర ప్రభుత్వం ఇప్పటినే కీలక నిర్ణయం తీసుకున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ఉల్లి ఎగుమతులను వచ్చే ఏడాది మార్చి వరకు నిషేధించింది. దేశంలోని అనేక ప్రాంతాల్లో కిలో ఉల్లి ధర రూ.80 దాటింది. మండీల్లో రూ.60పైనే పలుకుతోంది. దీంతో కేంద్రం రంగంలోకి దిగి చర్యలు చేపట్టింది.

వాతావరణ కారణంగా ఖరీఫ్ ఉల్లి ఆలస్యం కావడం..పంట ఆలస్యంగా రావడం దీనికి ప్రధాన కారణం అంటున్నారు కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖ అధికారులు. ఖరీఫ్ ఉల్లి ఇప్పటికే మార్కెట్ లోకి రావాల్సి ఉండగా.. ఇంకా అందుబాటులోకి రాలేదు. దీంతోపాటు నిల్వ చేసిన రబీ ఉల్లి అయిపోవడం ఉల్లి ధరలు పెరుగుటకు కారణమయ్యాయని తెలిపారు. జులై నుంచి ఉల్లి ధరల పెరుగుదల రేటు రెండంకెల్లో నమోదవుతోంది. అక్టోబర్‌లో ఇది 42.1 శాతం దగ్గర నాలుగేళ్ల గరిష్ఠానికి చేరింది. ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి ఆగస్టు 4 మధ్య దేశం నుంచి 9.75 లక్షల టన్నుల ఉల్లి ఎగుమతి అయ్యింది. బంగ్లాదేశ్‌, మలేషియా, యూఏఈ మన ఉల్లిని అత్యధికంగా దిగుమతి చేసుకుంటున్నాయి. ఖరీఫ్‌ సీజన్‌లో ఉల్లి సాగు విస్తీర్ణం తగ్గిందనే వార్తలు వెలువడినప్పటి నుంచి దేశంలో ధరలు పెరుగుతూ వస్తున్నాయి. దీన్ని కట్టడి చేయడం కోసమే కేంద్రం పలు చర్యలకు ఉపక్రమించింది.

Leave a Comment