కార్తీకమాసం ప్రారంభంకాగానే మనందరికి గుర్తుకు వచ్చేది అయ్యప్ప దీక్ష. భక్తి శ్రద్ధలతో ఎంతో నిష్ఠగా, కఠోర నియమాలతో చేపట్టేదే అయ్యప్ప దీక్ష. ఇతర రాష్ట్రాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో అయ్యప్ప ఆలయాల్లో దీక్ష స్వాములతో మారుమోగుతుంటాయి.

మన తెలుగు రాష్ట్రాల్లో ఊరూరా అయ్యప్ప దీక్షపరులతో, అయ్యప్ప నామస్మరణతో మారుమోగిపోతున్నాయి. అయ్యప్పస్వామిని తమ ఇష్టమైన దైవంగా కొలుస్తారు. ఎంతో మంది దేవుళ్లు ఉన్నా.. అయ్యప్పస్వామికి ఓ ప్రత్యేకత ఉంది. అయ్యప్పస్వామికి ప్రత్యేకమైన పవళింపు పాట. అయ్యప్పస్వామి హరివరాసనం పాట గాయకుడు యెసుదాసు పాడిన పాట. అయ్యప్పస్వామికి పవళింపుగా ఈ పాటను ఆలపిస్తారు. ఈ పాట ఎంత విన్నా తనివి తీరదు. శబరిమల మణికంఠుని సన్నిదానంలో అయితే తన్మయత్వంలో పులకించుకోక తప్పదు.
1# హరివరాసనం విశ్వమోహనం – హరిదధీశ్వరం ఆరాధ్యపాదుకం
అరివిమర్ధనం నిత్యనర్తనం – హరిహరాత్మజం దేవమాశ్రయే
శరణమయ్యప్పా – స్వామి శరణమయ్యప్పా
శరణమయ్యప్పా – స్వామి శరణమయ్యప్పా
2# శరణకీర్తనం శక్తమానసం – భరణలోలుపం నర్తనాలసం
అరుణభాసురం భూతనాయకం – హరిహరాత్మజం దేవమాశ్రయే
శరణమయ్యప్పా – స్వామి శరణమయ్యప్పా
శరణమయ్యప్పా – స్వామి శరణమయ్యప్పా
3# ప్రణయసత్యకం ప్రాణనాయకం – ప్రణతకల్పకం సుప్రభాంచితం
ప్రణవమందిరం కీర్తనప్రియం – హరిహరాత్మజం దేవమాశ్రయే
శరణమయ్యప్పా – స్వామి శరణమయ్యప్పా
శరణమయ్యప్పా – స్వామి శరణమయ్యప్పా
4# తురగవాహనం సుందరాననం – వరగధాయుధం వేదవర్ణితం
గురుకృపాకరం కీర్తనప్రియం – హరిహరాత్మజం దేవమాశ్రయే
శరణమయ్యప్పా – స్వామి శరణమయ్యప్పా
శరణమయ్యప్పా – స్వామి శరణమయ్యప్పా
5# త్రిభువనార్చితం దేవతాత్మకం – త్రినయనం ప్రభుం దివ్యదేశికం
త్రిదశపూజితం చింతితప్రదం – హరిహరాత్మజం దేవమాశ్రయే
శరణమయ్యప్పా – స్వామి శరణమయ్యప్పా
శరణమయ్యప్పా – స్వామి శరణమయ్యప్పా
6# భవభయాపహం భావుకావహం – భువనమోహనం భూతిభూషణం
ధవళవాహనం దివ్యవారణం – హరిహరాత్మజం దేవమాశ్రయే
శరణమయ్యప్పా – స్వామి శరణమయ్యప్పా
శరణమయ్యప్పా – స్వామి శరణమయ్యప్పా
7# కళమృదుస్మితం సుందరాననం – కలభకోమలం గాత్రమోహనం
కలభకేసరి వాజివాహనం – హరిహరాత్మజం దేవమాశ్రయే
శరణమయ్యప్పా – స్వామి శరణమయ్యప్పా
శరణమయ్యప్పా – స్వామి శరణమయ్యప్పా
8# శ్రితజనప్రియం చింతితప్రదం – శృతివిభూషణం సాధుజీవనం
శృతిమనోహరం గీతలాలసం – హరిహరాత్మజం దేవమాశ్రయే
శరణమయ్యప్పా – స్వామి శరణమయ్యప్పా
శరణమయ్యప్పా – స్వామి శరణమయ్యప్పా
వేదప్రియనే శరణమయ్యప్ప !
వీర మణికంఠనే శరణమయ్యప్ప !!
శరణు ఘోష ప్రియనే శరణమయ్యప్ప !!!