జుట్టుకు సంబంధించి మనకు వచ్చే సమస్యల్లో చుండ్రు కూడా ఒకటి. చుండ్రు వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. విటమిన్ల లోపం, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, నీళ్లు పడకపోవడం, ఒత్తిడి.. తదితర అనేక కారణాల వల్ల చుండ్రు బాగా వస్తుంటుంది. అయితే కొన్ని చిట్కాలను పాటిస్తే చుండ్రు సమస్య నుంచి త్వరగా విముక్తి పొందవచ్చు.
చుండ్రు… జుట్టు సంరక్షణ విషయంలో సమస్యగా పరిణమిస్తుంది. ఇది కలుగుజేసే సమస్యలు చిన్నవి కావు. ఈ చుండ్రు ఏవిధంగా మిమ్మల్ని బాధపడెతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. చాలా మంది చుండ్రే కదా అని కొట్టిపారేస్తుంటారు. దాని వెనుక చాలా ఇబ్బందులున్నాయన్న విషయం గుర్తించరు. చుండ్రు వల్ల జుట్టు రాలిపోతుంది. ఇంకా జుట్టు పల్చ బడటం, జుట్టు చిట్లడం జరుగుతుంది. దాంతో జుట్టు అందం తగ్గిపోవటమే కాకుండా చర్మ అందాన్ని కూడా తగ్గిచ్చేస్తుంది.
ఆహారంలో మార్పులు, తరచుగా వివిధ ప్రదేశాలు తిరగటం, నీటి మార్పు, వాతావరణ మార్పు మొదలైన వాటి కారణంగా చుండ్రు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి పరిస్థితిలో జుట్టుని ఆరోగ్యంగా, అందంగా ఉంచుకోవటానికి ఖచ్చితంగా కొంత సమయం కేటాయించాలి. తలస్నానం చేయ్యకుండా దుమ్ము, ధూళితో తలను అట్టిపెట్టినా చండ్రు సంక్రమిస్తుంది. ఎండాకాలంలో కన్నా చలికాలంలో చుండ్రు సమస్య ఎక్కువగా వేధిస్తుంది.
వయస్సుతో సంబంధం లేకుండా పెద్దవారికి చిన్నవారికి అందరికీ తలలో చుండ్రు రావడం సాధారణం. చుండ్రు రావడానికి కారణాలు అనేకం. అధిక ఒత్తిడికి గురయినా తలలో చుండ్రు వస్తుంది. ఒత్తిడికి గురైన వారికి చుండ్రు అధికంగా వస్తుంది. కాలాలు మారినప్పుడల్లా వాతావరణంలో వచ్చే మార్పులు కూడా తలలో చుండ్రును పెంచుతాయి.
చండ్రును ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోతే ఇన్ఫెక్షన్ చేరి చుండ్రు వలన పూర్తిగా జుట్టు రాలిపోయే ప్రమాదం ఉంటుంది. తలస్నానం చెయ్యకపోతే నూనె, మృతచర్మ కణాలు ఎక్కువ అయి ఈస్టు , ఫంగస్ లాంటి వాటికి ఆహారంగా మారతాయి. పూర్తిగా చుండ్రుని తగ్గించటం సాధ్యం కాదు, కాకపొతే మళ్ళీ రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవచ్చు. చుండ్రు రాకుండా జాగ్రత్తపడటం ఒక్కటే చుండ్రు రాకుండా నివారించుకోవచ్చు. క్రొవ్వు ఉండే ఆహార పదార్ధాలు ఎక్కువగా తినటం వలన సెబాషియస్ గ్రంధి నూనేని ఎక్కువగా ఉత్పత్తి అయి చుండ్రు మరింత ఎక్కువ అవుతుంది.
- సాధారణంగా ఇంట్లో అందరూ ఒకే దువ్వెనతో తల దువ్వుకుంటారు. కానీ అలా చేయరాదు. ఎవరి దువ్వెనతో వారే దువ్వుకోవాలి. కొన్ని సార్లు ఒకరి తలలో ఉండే ఇన్‌ఫెక్షన్లు, వైరస్‌లు దువ్వెనల ద్వారా ఇతరులకు వ్యాపిస్తాయి. కనుక ఎవరి దువ్వెనలను వారు వాడితేనే మంచిది.
- షాంపూలతో తలస్నానం చేసినప్పుడు చర్మానికి అంటిన షాంపూ పూర్తిగా వదిలేలా చూసుకోవాలి. షాంపూలో మినరల్స్, ఐరన్ ఎక్కువ లేకుండా జాగ్రత్త పడాలి. షాంపూనే నేరుగా తలపై రుద్దకుండా కొద్దినీళ్లలో వేసి కలిపి వెంట్రుకలకు పట్టించాలి.
- కలుషిత వాతావరణంలో వెళ్లకుండా చూసుకోవాలి. ఒకవేళ వెళ్లాల్సి వస్తే తలకు టోపీ ధరించాలి.
- బాగా ప్రాసెస్ చేయబడిన ఆహార పదార్థాలు, జంక్ ఫుడ్, చక్కెర ఎక్కువగా ఉండే తీపి పదార్థాలను తినడం, అధికంగా మద్యం సేవించడం వల్ల కూడా చుండ్రు వస్తుంటుంది. కనుక ఈ పదార్థాలకు దూరంగా ఉంటే చుండ్రును తగ్గించుకోవచ్చు.
- ఒత్తిడిని తగ్గించేలా నిత్యం ధ్యానం, యోగా వంటివి చేస్తే చుండ్రు రాకుండా ఉంటుంది.
- ఇతర హెయిర్ ఆయిల్స్‌కు బదులుగా స్వచ్ఛమైన కొబ్బరినూనెను జుట్టుకు రాయాలి. కనీసం 8 వారాల పాటు రోజూ తలకు కొబ్బరినూనె రాస్తే 68 శాతం వరకు చుండ్రు తగ్గుతుందని సైంటిస్టులు చేపట్టిన పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.