ఇష్టమైన ఆహారం చేతికందితే, వెనుక…ముందూ చూడకుండా అధికంగా తినేస్తాం. మరి ఇంత ఆనందంగా తినే సమయంలో మనం మన శరీరంపై ఆ ఆహారం ఏరకమైన ప్రభావాన్ని చూపుతుంది? అనేది ఏమాత్రం పట్టించుకోము. కొన్నిఉప్పు అధికంగా ఉండే ఆహారాలు మీ బ్లడ్ షుగర్ స్ధాయిలు పెంచుతాయి. ఉప్పు అధికంగా తినేయడం శరీరానికి హానికరం మరి ఉప్పు అధికంగా ఉండే ఆహారాలేమిటి… వాటి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రతి ఒక్కరు తప్పని సరిగా తెలుసుకోవాలి..!
మనం రోజూ తినే ఆహారంలో ఉప్పు ఉంటుంది. ఉప్పు లేకుండా తినాలంటే చాలా కష్టం ఉంటుంది. అయితే చాలామంది కేవలం రుచి కోసమే వంటకాలను ఉప్పు వెసుకుని వాటిని ఆస్వాదిస్తారు. వంటకాలు ఏవైనా .. ఉప్పు లేకుండా వాటికి రుచిఉందు. ఏ వంటకంలోనైనా సరే.. ఉప్పు తప్పని సరిగా ఉపయోగించాలి. ఉప్పు వాడటం మంచిదే అందుకని మోతాదుకు మించి తీసుకుంటే.. అనారోగ్య సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
నోటికి రుచిగా ఉన్నాయి కదా అని ఊరగాయలు, పచ్చళ్లు, వేయించిన స్నాక్స్ వంటి ఆహార పదార్ధాలను తీసుకోవడం మంచిది కాదంటున్నారు. వీటిలో ఉప్పు అధికంగా ఉంటుంది. ఉప్పును తగ్గించడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకున్నవాళ్ళమవుతాం. ముఖ్యంగా వండిన పదార్ధాలపై ఉప్పును చల్లుకుని తినే అలవాటు కొన్ని ప్రాంతాల వారికి ఉంది. దీంతో మరీ ప్రమాదం ఏర్పడే అవకాశాలున్నాయి. తినే ఆహార పదార్ధాల్లో ఉప్పును తగ్గించడంతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలిని కలిగి ఉండటం ద్వారా కిడ్నీ సమస్యలతో పాటు ప్రాణాపాయకర పరిస్థితులనుంచి కూడా కాపాడుకోవచ్చు.
ప్రస్తుతం వండుకుని తినేందుకు సమయం ఉండటం లేదు. దాంతో చాలామంది ఫాస్ట్‌ఫుడ్ మీద ఆధారపడుతున్నారు. టైం వృథా కాకుండా ఉంటుందని ఫాస్ట్ ఫుడ్‌కి అలవాటు పడుతున్నారు. ఫాస్ట్‌ఫుడ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఫాస్ట్‌ఫుడ్ నిల్వ ఉండడం కోసం ఎక్కువ ఉప్పుని వినియోగిస్తుంటారు. దాంతో శరీరంలోకి ఎక్కువ ఉప్పు చేరిపోయి క్యాల్షియం బయటకు పంపిస్తుంది. నిలవ పచ్చళ్ళు – ఆవకాయ, మాగాయ, ఉసిరికాయ, చింతకాయ వంటి పచ్చళ్ళు సంవత్సరం అంతా ఉండాలంటూ వాటిలో అధిక ఉప్పు చేర్చి తయారు చేస్తారు. కనుక వీటిలో ఉప్పు అధికమే… అంటే, సోడియం కావలసినదానికంటే అధికంగా వాటిలో వుండి మీకు హాని కలిగిస్తాయి. కనుక ఈ నిలవ పచ్చళ్ళను ఎపుడైనా తినాలి. అపుడు కూడా అతి తక్కువ మొత్తంలో తినాలి. వీటిలో ఉండే అధిక ఉప్పు మీరు కొంచెం తిన్నా సరే ఎంతో హానికలిగిస్తుంది.
కాటేజ్ ఛీజ్ చాలా ఉప్పగా ఉంటుంది.శరీరంలో సోడియం స్ధాయిలను ఇది అధికం చేస్తుంది. ఉప్పు, కారం చేర్చిన వివిధ చిరుతిండ్లు తినటానికి ఎంతో రుచి. కాని అవి హాని. పాప్ కార్న్, ఛీజ్ బాల్స్, వంటి వాటిలో సోడియం అధికం. కనుక, ఈ ఆహారాలు వదిలేయండి. తినాలనుకున్నపుడు వాటిలో అతి తక్కువ ఉప్పు ఉండేలా చూసుకోండి. ఆహారంలో సోడియం అధికమైతే అది శరీరానికి హాని. తక్కువైతే అది మిమ్మల్ని బలహీనపరుస్తుంది. కనుక సోడియం ఆహారంలో తగినంత మాత్రమే తీసుకుంటూ, ఆరోగ్యంగా ఉండాలి.
ప్యాకేజి ఆహారాన్ని కొనేప్పుడు ప్యాకెట్ పైన రాసి ఉన్న పోషకవిలువల సమాచారాన్ని చదవాలి. తక్కువ ఉప్పు ఉన్న పదార్ధాలనే కొనాలి. వంటల్లో ఉప్పు తగ్గించాలి. తినేటప్పుడు ఉప్పును ఆహారపదార్ధాలపైన చల్లుకునే అలవాటును మానుకోవాలి. బంగాళాదుంపల చిప్స్ వంటి స్నాక్స్ మానేయాలి. అలాగే చీజ్, ప్రాసెస్డ్ ఫుడ్స్, రెడీ ఈట్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి.
వంట సాస్ వాడకం తగ్గించాలి. సీజనింగ్ కోసం వాడే సాయ్, చిల్లీ, సలాడ్ డ్రస్సింగ్, మస్టర్డ్ సాస్ వంటి వాటిలో ఉప్పు చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకని వాటిని వంట గదికి దూరంగా ఉంచాలి. జాతీయ పోషకాహారం సంస్థ ప్రకారం.. ఒక వ్యక్తి రోజుకు ఆరు గ్రాముల ఉప్పు మాత్రమే తీసుకోవాలి. కానీ, ఇలాంటి అలావాట్ల వల్ల సగటున ఒక్కో వ్యక్తి రోజుకు 8 నుంచి 12 గ్రాముల ఉప్పు తీసుకుంటున్నాడు. పోషకాహార సంస్థ సూచించిన దాని కంటే ఇది ఎక్కువ. ఉప్పు ఎక్కువగా తీసుకుంటే అధిక రక్తపోటు, జీర్ణాశయం కాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఆహారంలో సోడియం అధికమైతే అది శరీరానికి హాని. తక్కువైతే అది మిమ్మల్ని బలహీనపరుస్తుంది. కనుక సోడియం ఆహారంలో తగినంత మాత్రమే తీసుకుంటూ, ఆరోగ్యంగా ఉండాలి