ప్రస్తుతం వాట్సాప్ వాడనివారు చాలా అరుదనే చెప్పాలి. వాట్సాప్ వాడేవారికి ఒక బ్యాడ్ న్యూస్.. ఇక నుంచి వాట్సాప్ చాట్ బ్యాకప్ చేయడానికి డబ్బులు చెల్లించాల్సి అవసరం రావచ్చు. ఎందుకంటే ఇంతవరకు 5జీబీ వాట్సాప్ బ్యాకప్ ఫ్రీగా చేసుకున్నా.. మరికొద్ది రోజుల్లో గూగుల్‌కు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.
ప్రపంచవ్యాప్తంగా సుమారు 2.7 బిలియన్ల మంది వాట్సాప్‌ను ఉపయోగిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ వాడే వారందరూ దాదాపు వాట్సాస్ ను వినియోగిస్తున్నే ఉంటారు. ఈ మెసేజింగ్ యాప్ ఎప్పటి కప్పుడు యూజర్లకు అనుగుణంగా కొత్త ఫీచర్లలను తీసుకువస్తుంది. అందుకే ఎన్ని యాప్ లు వచ్చిన వాట్సాప్ కు ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అయితే వాట్సాప్ ఇప్పటి వరకు తన సేవలకు ఒక్క రూపాయి కూడా ఛార్జ్ చేయడం లేదు. కానీ 2024 నుంచి ఛార్జ్ చేయాడానికి సిద్ధం అవుతున్నారు.
ప్రస్తుతం వాట్సాప్ వాడేవారు తమ చాట్ బ్యాకప్ డేటాను గూగుల్ డ్రేవ్ లో సేవ్ చేసుకుంటుంన్నారు. ఇందుకు కోసం ఎలాంటి ఛార్జ్ చెల్లించడంలేదు. అందరికి ఈ సేవలు ఉచితంగానే ఉన్నాయి. అయితే 2024 నుంచి గూగుల్ డ్రైవ్‌లో ఫ్రీ అన్లిమిటెడ్ బ్యాకప్‌లను అందించదని కంపెనీ తెలిపింది. గూగుల్ డ్రైవ్‌లో అందించే 15జీబీ స్టోరేజ్ లిమిట్ మాత్రమే ఉచితంగా అందిస్తారు. అంతకు మించి స్టోరేజీ కావాలంటే మాత్రం డబ్బులు చెల్లించాల్సిందే. చాట్ బ్యాకప్స్‌కు గూగుల్ డ్రైవ్‌లో స్పేస్ కేటాయించే రూల్ 2024 ప్రారంభం నుంచి అమల్లోకి రానుంది. వాట్సాప్ చాట్ బ్యాకప్ స్టోరేజ్ కోసం ఎంత ఛార్జీ వసూలు చేస్తారన్న దానిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలియచేయనున్నట్లు సమాచారం.
గూగుల్ డ్రైవ్‌లో వాట్సాప్ బ్యాకప్‌లు ఇకపై అన్లిమిటెడ్ స్టోరేజ్ ఉచితంగా లభించని కంపెని వర్గాలు తెలిపారు. వాట్సాప్ యూజర్లు ఇకపై తమ బ్యాకప్‌లను ఉంచుకోవాలనుకుంటే స్టోరేజ్ స్పేస్ మెయింటైన్ చేయాలి. లేదంటే ఎక్స్ట్రా స్టోరేజ్ కోసం డబ్బులు చెల్లించాలి. యూజర్లు ఎంత స్టోరేజీని ఉపయోగించుకున్నారో తెలియాలంటే.. వాట్సాప్ సెట్టింగ్స్‌లోని స్టోరేజ్ రివ్యూ ఆప్షన్‌లోకి వెళ్ళి మనం తెలుసుకోవచ్చు.