ఏపి ఎన్నికల్లో తెలంగాణ సీఎం బాబుకు సహకారం అంధిస్తాడా..!

By manavaradhi.com

Updated on:

Follow Us

ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు తన కొలువులో రేవంత్‌ ఎమ్మెల్యేగా, ముఖ్య వ్యక్తిగా, యువనేతగా పనిచేశారు. అంతేకాదు చంద్రబాబు నాకు ఆదర్శం అని రేవంత్‌ చెప్పిన సందర్భాలు ఉన్నాయి. చంద్రబాబు స్ఫూర్తిగా రేవంత్‌ పాలన ఎలా ఉంటుందో చూడాలి. ఏపీలో ఎన్నికలకు అన్ని పార్టీలు సమాయత్తమవుతున్నాయి. జైలు నుంచి చంద్రబాబు బెయిల్‌పై బయటకు వచ్చిన నాటి నుంచి పార్టీలో సమీకరణలే మారిపోయాయి. కోర్టుల తీర్పులు అనుకూలంగా రావడంతో కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. యువగళం కూడా ముగిసింది. పవన్‌ ఇంటికి స్వయంగా చంద్రబాబు వెళ్లడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికి రేపింది. చిన్నవాడా.. పెద్దవాడా.. రాజకీయ అనుభవం ఉందా లేదా అని చంద్రబాబు ఆలోచించడు. దీనివలన పార్టీకి ప్రయోజనం ఉంటుంది అని తలిస్తే.. తాను ఒక మెట్టు కాదు ఎన్ని మెట్లు అయినా దిగడానికి వెనుకాడడు.

పవన్‌ ఇంటికి చంద్రబాబు వెళ్లడంలో ఉద్దేశం అదే. ఏదిఏమైనా వైసీపీని ఇంటికి పంపించాలి అన్నదే చంద్రబాబు ధ్యేయంగా కనిపిస్తుంది. ప్రస్తుతం జనసేన, టీడీపీ కలయికతో ఏపీలో విజయం ఖాయం అన్న సంకేతాలు వినిపిస్తున్నాయి.ఇదిలా ఉంటే… తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఏపీ ఎన్నికల ఫలితాలపై ప్రభావం ఖచ్చితంగా ఉంటుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దీనికితోడు తెలంగాణా సీఎం రేవంత్‌ సహకారం పరోక్షంగా ఉండవచ్చు అని కూడా చెబుతున్నారు. ఇందుకు కారణం తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయకపోవడం.. పరోక్షంగా రేవంత్‌కు సహకరించడం అన్నది బహిరంగ రహస్యం. ఏపీలో జనసేన, టీడీపీ అధికారంలోకి వస్తే.. పక్క రాష్ట్రం తెలంగాణాతో విభేదాలు ఉండకపోవచ్చు.

రాష్ట్ర విభజన నేపథ్యంలో అనేక సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా నీటి సమస్య, ఆర్థిక లావాదేవీలు ఇంకా ఒక కొలిక్కి రాలేదు. ఇవన్నీ సవ్యంగా జరిగేందుకు అవకాశం ఉంటుంది అంటున్నారు రాష్ట్ర ప్రజలు. అంతేకాదు పక్క రాష్ట్రాల మైత్రితోనే అభివృద్ధికి ఆటంకాలు ఉండవని చెబుతున్నారు. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. నిర్మాణ వ్యయం చూస్తే భారీగా పెరిగింది. ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం సహకారం అవసరం ఉంది. ఏదిఏమైనా తెలంగాణా పాలనలో రేవంత్‌ చంద్రబాబు స్ఫూర్తితో సరికొత్త పాలన అందిస్తారని, ఏపీకి కూడా సహకారం ఉంటుందనడంలో సందేహం లేదు. ఏది జరిగినా రాష్ట్ర ఎన్నికల ఫలితాలు, ఏర్పడే కొత్త ప్రభుత్వం తీసుకునే విధానాలపైనే ఉంటుందంటున్నారు రాజకీయ మేధావులు.

Leave a Comment