Meditation : ధ్యానంతో కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏంటి…? ధ్యానం ఏ సమయంలో చేస్తే మంచిది..!

By manavaradhi.com

Updated on:

Follow Us

అందరూ తమతమ లక్ష్యాలను సాధించడానికి బిజీగా ఉన్నారు. మన ఔత్సాహిక ప్రకృతి, మన దైనందిన జీవితంలోని కష్టాలు అలసిపోయిన మనసు ప్రశాంతతను పొందడానికి చాలా తక్కువ సమయాన్ని కేటాయిస్తున్నాము. దానినుండి బైటికి రావడానికి చాలా సులభమైన మార్గం ఉంది.రోజూ కాసేపు ధ్యానం చేస్తే మనం చాలా ఆరోగ్యంగా ఉంటామని ఎప్పటినుండో నిపుణులు సూచిస్తున్నారు. అయినా మనం మాత్రం ధ్యానం పైన మనసును లగ్నం చేయలేకున్నాం. కానీ ధ్యానం వల్ల మనకు మానసిక ప్రశాంతత లభిస్తుందని, మనలోని ఆందోళన, కుంగుబాటు దూరమవుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రోజూ కనీసం అరగంటపాటు ధ్యానం చేయడం వల్ల మనం చాలా ఆరోగ్యంగా ఉంటామని శాస్త్రవేత్తలు ప్రత్యేక అధ్యయనం ద్వారా గుర్తించారు. ప్రారంభంలో కాస్త కష్టమైనప్పటికీ, రానురాను తీవ్రతరం చేస్తే ధ్యాస కుదురుతుంది. అప్పుడు ఇతర విషయాల గురించిన ఆలోచనే ఉండదు. మన మనసుకు, తద్వారా మన శరీరానికి గాఢమైన విశ్రాంతి లభిస్తుంది.

మానసిక ప్రశాంతత కావాలంటే ఒక చక్కని మార్గం ధ్యానం. ధ్యానం అనేది ఒక మానసిక సత్ప్రవర్తన. అంటే సాధకుడు ప్రతీకార, యోచన బుద్ధి నుంచి అమితమైన విశ్రాంతి లేదా స్పృహను పొందడం. దీనిని పురాతన కాలం నుంచి సాధన చేస్తున్నారు. ధ్యానంతో మానసిక ప్రశాంతత మాత్రమే కాదు. నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది, జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ధ్యానం చేస్తున్నప్పుడు మెదడులో అల్ఫా రిథమ్‌ అనే తరంగం నియంత్రణలో ఉండటం వల్ల ఈ ప్రయోజనాలు చేకూరుతున్నాయి. ధ్యానం శారీరకంగా, మానసికంగా ఎంతో మేలు చేస్తుంది. ఇది ఆందోళన, కుంగుబాటు, ఒత్తిడి, నొప్పి వంటివి తగ్గటానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాదు.. శరీరంలో వాపు ప్రక్రియను తగ్గించటంతో పాటు రోగనిరోధకశక్తిని పెంపొందించటానికీ దోహదం చేస్తుంది. ఈ విషయంలో ఇటీవల జరిగిన ఒక అధ్యయనంలో మరో ఆసక్తికరమైన విషయం వెల్లడైంది. ధ్యానం, యోగా పద్ధతులను పాటించినవారిలోనూ ఒత్తిడి, కుంగుబాటు గణనీయంగా తగ్గినట్టు బయటపడింది. అంతేకాదు ధ్యానంతో రోగనిరోధకశక్తి సైతం మరింత ఎక్కువగా మెరుగుపడింది. వృద్ధాప్యంలో ఆరోగ్యంగా జీవించటానికి తోడ్పడే సంక్లిష్ట జన్యు మార్పులనూ ఇది ప్రోత్సహిస్తుండటం గమనార్హం. దీంతో దీర్ఘకాలం మానసిక, శారీరక ఆరోగ్యాలను కాపాడుకోవచ్చని చెబుతున్నారు.

ధ్యానం అనేది ఒక పురుషులకు లేదా ఆధ్యాత్మిక గురువులకు మాత్రమే అనుకుంటారు. అయితే ధ్యానం కేవలం ఒక మతపరమైన అనుభవం కాదు. ఇది ప్రధానంగా మీ ఆరోగ్యాన్నిమెరుగుపరుచుకోవడానికి ఒక మార్గం. మెడిటేషన్ వల్ల మనకు తెలియని అనేక ఆరోగ్యప్రయోజనాలున్నాయి. ధ్యానం వల్ల మానసిక మరియు భావోద్వేగ ఆరోగ్యం మెరుగుపచడం మాత్రేమే కాదు, మెడిటేషన్ వల్ల భౌతిక ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే మీ భావోద్వేగ ఆరోగ్యం మీ భౌతిక ఆరోగ్యం ఫిట్ నెస్ మీద ప్రభావం చూపుతుంది. ధ్యానం వల్ల ఒత్తిడి నుండి ఉపశమనం పొందవచ్చు.

ప్రస్తుత రోజుల్లో ఒత్తిడి తగ్గించుకోవడానికి ధ్యానం ఒక అత్యవసర మార్గంగా ఏర్పడింది. ఒక్క మానసిక, భౌతిక ఆరోగ్యంకోసం మాత్రమే కాదు, బరువు తగ్గించుకోవడానికి, ఒత్తిడి మరియు ఆందోళన రుగ్మతలను నివారించుకోవడం కోసం ధ్యానం అద్భుతంగా సహాయపడుతుంది. అయితే ధ్యానంను సరిగా ఎలా చేయాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. సరైన పద్దతిలో, కరెక్టైన సమయంలో ధ్యానం చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అంటే ధ్యానం చేసే సమయంలో మీ ఏకాగ్రత వేరే ఎక్కడా ఉండకూడదు, మనస్సు నిలకడగా ఉంచుకోవాలి. ధ్యానం చేసే సమయంలో ఇతర ఆలోచనలు కట్టిపెట్టాలి. ఫోన్ కాల్స్ చూడటం, మెయిల్స్ చెక్ చేయడం వంటి పనులు చేయకూడదు . ధ్యానం చేయడానికి మీరు పూర్తిగా సమయాన్ని వెచ్చించాలి. ధ్యానం వల్ల నిద్రలేమి మరియు డిప్రెషన్ వంటి సమస్యలు నేచురల్ గా మరియు ఎఫెక్టివ్ గా నివారించబడుతాయి.

Leave a Comment