ఆయుష్షును పెంచుకోవాలని ఎవరు మాత్రం కోరుకోరు చెప్పండి. అయితే ప్రస్తుత బిజీ ప్రపంచంలో మారుతున్న జీవన విధానాల కారణంగా ఆరోగ్యంతో పాటు జీవిత కాలం కూడా తగ్గిపోతోంది. రోజురోజుకూ మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా అనేకరకాల రోగాలు చుట్టుముడుతున్నాయి. అయితే వీటన్నింటికి ఒక్కటే సరైన పరిష్కారం అంటున్నారు వైద్యనిపుణులు. కొన్ని నిబంధనలు పాటించడం ద్వారా ఎక్కువకాలం పాటు బతికేయవచ్చు.
మన వయసు ఏడాదికేడాదికి పెరుగుతుంటే, ఆయుష్షు తగ్గిపోతూ ఉంటుంది. వయసుతో పాటు భౌతికంగా వచ్చే మార్పులను నియంత్రించడం కష్టమేమో గానీ, కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లను అలవరుకోవడం వల్ల మన ఆయుష్షును పెంచుకోవచ్చు . ఇందుకు మన జీవన విధానంలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా మన జీవిత కాలాన్ని మరింత పెంచుకోవచ్చు. చిన్న పాటి జాగ్రత్తల ద్వారా మనసుకు వయసు పెరగకుండా చూసుకోవచ్చు. తద్వారా ఆయుష్షును పెంచుకోవచ్చు.
మనం తీసుకోనే ఆహారంలో ఖచ్చితంగా కొన్ని ఆహార నియమాలను పాటించాలి. రోజూ వ్యాయామం చేయడం కూడా చాలా అవసరం. శారీర వ్యాయామం కేవలం శరీరానికే కాదు, మనసుకు కూడా చాలా అవసరం. రోజుకు కనీసం 30 నిముషాల వ్యాయామం మంచి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని అందిస్తుంది. ఎప్పుడూ పనే కాదు… విశ్రాంతి కూడా మన ఆరోగ్యానికి చాలా అవసరం అని గుర్తించడం చాలా అవసరం. రోజుకు కనీసం 7 నుంచి 9 గంటల విశ్రాంతి అవసరం. ముఖ్యంగా కంప్యూటర్ లాంటి వాటి మీద పని చేసే వారికి ఇది అత్యంత ఆవశ్యకం.
ఆయుష్షు పెంచే మార్గాలు ఏవి…?
మంచి అలవాట్లు మనం హాయిగా జీవించటానికి, ఆయుష్షును పెంపొందించుకోవటానికి ఎంతగానో తోడ్పడతాయన్నది తెలిసిందే. ఆయుష్షును పెంచుకుని ఆరోగ్యంగా జీవించాలంటే చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే చాలు అంటున్నారు నిపుణులు. అందుకోసం మన జీవనశైలిలో కొన్ని మార్పులు చుసుకోవాలి.
- శరీరానికి అవసరమయ్యే డీ విటమిన్ పొందేందుకు ఉదయం కొంత సమయం శరీరానికి ఎండ తగిలేలా చూసుకోవాలి. రోజూ క్రమం తప్పకుండా నీళ్లు తాగడం ఆరోగ్యానికి చాలామంచిది. ఈ అలవాటు వల్ల బరువు తగ్గుతుంది. శరీరంలో ఉండే హానికర విషతుల్య పదార్థాలను బయటకు పంపేస్తుంది. డిహైడ్రేషన్ నుంచి రక్షిస్తుంది.
- కంటి నిండా నిద్రపోయేలా చూసుకోవాలి. మంచి నిద్ర ఆరోగ్యానికి ఎంతో అవసరం. కాబట్టి ప్రతిరోజు త్వరగా పడుకొని త్వరగా నిద్రలేవాలి.
- వ్యాయామం చేయడం వల్ల నిరంతరం శక్తి కలిగి ఉంటారు. ముఖ్యంగా ఉదయం చేసే వ్యాయామం వల్ల యాక్టివ్ గా మరియు హెల్తీగా ఉంటారు.
- రోజూ కాసే ఆరోగ్యంగా ఉండాలంటే మానసిక ప్రశాంతత ముఖ్యం. యోగా, ధ్యానం చేయడం వల్ల ప్రశాంతంగా ఉండి ఆరోగ్యాన్ని పొందవచ్చు.
- నిత్యం పని ఒత్తిడితో బిజీగా ఉన్నా ఏదో ఒక సమయంలో వినోదం అందేలా చూసుకోవాలి. దీంతో ఒత్తిడి కొంత మేర తగ్గేందుకు అవకాశం ఉంటుంది. అందరితో ఫన్నీగా మాట్లాడడం, జోక్స్ వినడం వంటివి చేస్తే ఒత్తిడి దూరమవుతుంది.
ఆయుష్షు పెంచుకోవడానిక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి…?
ఎక్కువ క్యాలరీలు ఉండే ఆహారం తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి సమస్యలు ఎదురౌతాయి. అందుకే ఆహారంలో స్వల్ప మార్పులు చేసుకోవాలి. ఎలాంటి ఆహారాన్ని, ఎంత మేర తీసుకుంటన్నామని గుర్తు పెట్టుకుని మంచి డైట్ తీసుకోవాలి. దీని కోసం పండ్లు, కూరగాయాలు, ఆకు కూరలు, చేపలు అధికంగా తీసుకోవాలి.
పొగ తాగడం లాంటి అలవాట్లకు చెక్ పెట్టాలి. పొగ తాగడం, అధికంగా మద్యం సేవించడం లాంటివి ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. అందుకే ఇలాంటి అలవాట్లను వదిలించుకోవాలి. వయసు పెరిగే కొలదీ గుండే విషయంలో మరిన్ని జాగ్రత్తలు అవసరం. ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. వ్యాయామం కూడా మేలు చేస్తుంది. ఎప్పటికప్పుడు వైద్యుల పర్యవేక్షణలో గుండె పరీక్షలు చేయించుకుని, మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. డిప్రెషన్ లో ఉండడం కూడా మానసిక ఆరోగ్యాన్ని పాడు చేసి, తద్వారా శారీరక ఆరోగ్యాన్ని ఇబ్బందుల్లోకి నెడుతుంది. అందుకే మంచి మానసిక ఆరోగ్యాన్ని కలిగి ఉండేందుకు ప్రయత్నించాలి.
చెడు అలవాట్లు మానుకుని, మంచి ఆహారాన్ని తీసుకుంటూ, రోజూ వ్యాయామం చేస్తూ, ఒత్తిడికి దూరంగా విశ్రాంతి తీసుకోవడం వలన ఆయుష్షు పెంచుకోవచ్చు. మంచి అలవాట్లు వల్ల కలిగే ప్రయోజనాలు, అది ఆయుర్ధాయాన్ని ఏ విధంగా పెంచుతుందో. దీని పట్ల అవగాహన కలిగి ఉండడం ద్వారా, మన సంప్రదాయ ఆహారాలతోనూ, మంచి జీవన శైలిని పాటిస్తూ…..చెడు అలవాట్లను విసర్జించడం ద్వార ఆరోగ్యాన్ని, ఆయుష్షును పెంచుకోవచ్చు.