కాలేయం శరీరంలోని అతి పెద్ద గ్రంథి. మూడువంతుల వరకు పాడైపోయినా తిరిగి దానంతట అదే బాగుపడగలదు. పావువంతు అవయవం బావున్నా సరే తనని తాను తిరిగి నిర్మించుకోగలదు. అటువంటి అద్భుతమైన అవయవమే కాలేయం. అలాంటి కాలేయ ఆరోగ్యం మనం తీసుకోనే ఆహారాల మీద ఆధారపడి ఉంది. లివర్ ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఆహారాలు…. అలాగే ఎల్లప్పుడు శుభ్రంగా ఉండేలా చేసే కొన్ని ఆహారాలను గురించి తెలుసుకుందాం.
- కాలేయం మన శరీర జీవక్రియల్లో ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఇది మన ఉదరభాగంలో కుడివైపున ఉంటుంది. జబ్బు పడినా కూడా తనను తాను బాగు చేసుకోగలదు, శరీరానికి కావల్సిన శక్తిని తయారు చేయగలదు, జీర్ణక్షికియలో అత్యంత కీలకపాత్ర నిర్వర్తించే అవయవం, శరీరంలో పెద్ద గ్రంథి మాత్రమే కాదు, బరువైన అవయవం కూడా కాలేయమే. దీని సుగుణాలే ఒక్కోసారి దానికి ప్రమాదకరంగా మారుతాయి. ఎందుకంటే పూర్తిగా పాడై పొయ్యే దాకా ఎటువంటి లక్షణాలు కనిపించక పోవచ్చు. అప్పుడు పరిస్థితులు ప్రాణాంతకం కావచ్చు కూడా. కాలేయ ఆరోగ్యం మనం తీసుకోనే ఆహారాల మీద ఆధారపడి ఉంటుంది.
తృణధాన్యాలల్లో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. బి కాంప్లెక్స్ అధికం. కాలేయ పనితీరు సామార్థాన్ని ప్రోత్సహించేందుకు బాగా సహాయపడుతుంది. ఘాటయిన వాసన ఇచ్చే వెల్లుల్లి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. కాలేయాన్ని శుభ్రం చేసే గుణాలు ఇందులో ఎక్కువగా ఉంటాయి. యాపిల్స్‌లో ఫైబర్ ఎక్కువగానూ, కొవ్వు పదార్థాలు అత్యల్పంగానూ ఉంటాయి. విటమిన్ సి ఎక్కువగా ఉంది. యాపిల్‌లో ఉండే మ్యాలిక్ యాసిడ్ అనేది పేగులు, కాలేయం, మెదడు వంటి అంతర్గత కీలక అవయవాల పనితీరును మెరుగుపరుస్తుంది.
కాలేయ ఆరోగ్యం కోసం ఎలాంటి ఆహారాలను తీసుకోవాలి ?
బ్రకోలిలో పోషక తత్వాలు విటమిన్ ఎ, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఉడికించిన లేదా పచ్చి బ్రకోలిను వ్యాయామానికి ముందు లేదా తర్వాత తీసుకుంటే కండరాల నొప్పులు తొలగించడమే కాకుండా కాలేయాన్ని కాపాడుతుంది. బీట్ రూట్, క్యారెట్, బంగాళా దుంప వంటివి ఎక్కుగా తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే వీటిలో కాలేయంలోని కణాలు పునరుత్పత్తిగికి బాగా సహాయపడుతాయి. కాలేయం పనితీరు మెరుగుపడటానికీ బీట్‌రూట్ తోడ్పడుతుంది.ఈ ఆరోగ్యకరమైన దుంపలను ప్రతి రోజూ ఆహారంలో తీసుకోవడం వల్ల కాలేయం పనితీరు మెరుగుపడుతుంది.అవోకాడోలో గుండెకు ఆరోగ్యానిచ్చే మోనో శాచ్యురేటెడ్ కొవ్వుపదార్థాలున్నాయి. ఇది కాలేయాన్ని శుభ్ర పచడమే కాకుండా కణజాలాలు మరియు కణాల పునరుద్దించడానికి బాగా సహాయ పడుతుంది.
ప్రతి రోజూ వీటిని తీసుకోవడం వల్ల కాలేయానికి మంచి ప్రయోజం చేకూర్చుతాయి. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ను ప్రతి రోజూ తీసుకోవడం వల్ల శరీరంలోని మలినాలను బయటకు పంపివేయబడుతుంది. కాలేయానికి ముఖ్యంగా కాకరకాయ, ఆకుకూరలు, క్యాబేజి వంటి చాలా ప్రయోజనాలను కలిగిస్తాయి. సిట్రస్ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది లివర్ ను కాపాడుటలో బాగా పనిచేస్తుంది. కాలేయ పనితీరును మెరుగు పరచుతుంది. పసుపులో యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. అందువల్ల కాలేయానికి ఇది చాలా ఆరోగ్యకరం. దీన్ని ప్రతి రోజూ మనం ఉపయోగించే వంటకాల్లో తప్పనిసరిగా ఉపయోగించాలి. వాల్ నట్స్ లో ఉండే ఆర్జినైన్ ఆమ్లం అమ్మోనియా కణాలను విచ్చిన్న చేసి, కాలేయాన్ని శుభ్రం ఉంచుతుంది.
లివర్ ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఆహారాలు ఏవి ?
ప్రస్తుత పరిస్థితుల్లో మనం తింటున్న అనేక ఆహార పదార్థాలు లివర్ చెడిపోవడానికి కారణమవుతున్నాయి. ఇప్పటివరకు మద్యపానం, ధూమపానం వల్ల లివర్ చెడిపోతుందని అందరూ చెబుతూ వచ్చారు. కానీ వాటితోపాటు పలు ఆహార పదార్థాల కారణంగా కూడా లివర్ చెడిపోయేందుకు ఎక్కువగా అవకాశం ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. శీతల పానీయం సేవించే అలవాటు ప్రతి ఒక్కరికీ ఉంటుంది. వీటివల్ల కాలేయం త్వరగా చెడి పోతుంది. అలాగే, కూల్ డ్రింక్స్‌లో ఉండే పదార్థాలు కాలేయాన్ని పని చేయకుండా చేస్తాయి.
- చక్కెర లేదా తీపి పదార్థాలను అధికంగా ఉన్న ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల కాలేయం దెబ్బ తింటుంది. చక్కెరను అతిగా తింటే అది శరీరానికి ఉపయోగం కాదు, అది మొత్తం లివర్‌లోనే పేరుకుపోయి కొవ్వుగా మారుతుంది. దీనివల్ల లివర్ పనితీరు మందగిస్తుంది.
- ఉప్పు ఎక్కువగా తినడం వల్ల శరీరంలో ద్రవాల శాతం అధికంగా పెరుగుతుంది. దాంతో కాలేయ సంబంధిత వ్యాధులు వస్తాయి. చిప్స్ వంటి చిరుతిండ్లలో ఉండే విషపూరితమైన పదార్థాలు లివర్ ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపుతాయని వైద్యులు చెపుతున్నారు.
మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయాలన్నా, శరీరానికి శక్తి సరిగ్గా అందాలన్నా, విష పదార్థాలు బయటికి వెళ్లాలన్నా లివర్ ఎంతో ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఇంతటి ప్రాముఖ్యమున్న కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే మనం తీసుకోనే ఆహారంలో తప్పని సరిగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి మన లివర్ ఆరోగ్యాన్ని పెంచే ఆహారాలను తీసుకుంటూ… వాటికి హనిచేసే ఆహారాలకు దూరంగా ఉందాం….