Reducing risk of cancer: క్యాన్సర్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి..?

By manavaradhi.com

Updated on:

Follow Us
Reducing risk of cancer

క్యాన్సర్… అందోక వింత రోగం ఎవరికి ఎందుకు వస్తుందో ఎవరికి తెలియదు. కానీ క్యాన్సర్‌ను ఎంత త్వరగా గుర్తిస్తే అంత త్వరగా మంచి చిక్సిత అందించవచ్చు. అది దాదాపుగా క్యాన్సర్‌ను పూర్తిగా నయం చేసుకోవడంతో సమానం. మంచి జీవనశైలిని అలవర్చుకోవడం ద్వారా క్యాన్సర్ వచ్చే అపాయాన్ని కొంతవరకూ తగ్గించుకోవచ్చు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా క్యాన్సర్ రాకుండా చూసుకోవచ్చు.

క్యాన్సర్ అనేది శరీరంలో ఎక్కడైనా వచ్చే అసాధారణమైన కణాల అనియంత్రిత పెరుగుదల. ఈ కణాలు సాధారణ శరీర కణజాలాలను చొరబాట్లు చేయగలవు. సాధారణంగా మన శరీరంలో కణ విభజనలు ఒక క్రమ పద్ధతిలో నియంత్రించబడతాయి. కొన్ని సందర్భాలలో కణాల పెరుగుదలలో నియంత్రణ లేనందువల్ల కణాలు చాలా వేగంగా అస్తవ్యస్తంగా విభజన చెంది కణ సమూహాలను ఏర్పరుస్తాయి. ఈ కణ సమూహాలనే క్యాన్స‌ర్లుగా పిలుస్తారు.

మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లలో మార్పుల కారణంగానే వస్తున్నాయంటున్నారు వైద్య నిపుణులు. క్యాన్సర్ మన శరీరంలో ఏ భాగానికైనా వచ్చే ప్రమాదం ఉంది. శ‌రీరం నుంచి ఏ ప్రాంతంలోనైనా రక్తం కారినా, గడ్డలుగా ఏర్పడిన కాన్సర్ లక్షణాలుగా గుర్తించాలి.

మనం తీసుకునే ఆహారపదార్థాల ద్వారా క్యాన్సర్ ను చాలా వరకూ నిరోధించుకోవచ్చు. తాజా కూరగాయలు, పళ్లు ఎక్కువగా తీసుకోవాలి. ప్రాసెస్డ్‌ ఫుడ్‌, చక్కెరలు,నిల్వ ఉంచిన ఆహారాలకు దూరంగా ఉండాలి. శీతల పానీయాలు మానేయాలి. తాజా పండ్ల రసాలను త్రాగటం అలవాటు చేసుకోవాలి. వంశపారంపర్యంగా క్యాన్సర్‌ సంక్రమించే అవకాశాలున్నవాళ్లు మరింత అప్రమత్తంగా ఉండాలి.ఏ అనారోగ్య లక్షణమైనా మూడు వారాలకు మించి తగ్గకపోతే క్యాన్సర్‌ అయి ఉండొచ్చు. కాబట్టి ఆలస్యం చేయకుండా వైద్యుల్ని సంప్రదించాలి.

ఎత్తుకు తగ్గ బరువును మెయింటైన్ చేయాలి. అధిక బరువు పెరగకుండా జాగ్రత్తపడాలి. సిగరెట్, మద్యం అలవాట్లు క్యాన్సర్‌కు దారితీస్తే ప్రమాదం ఉంది. కాబట్టి వీటికి దూరంగా ఉండాలి. ఎండ వేళల్లో గొడుగు ధరించాలి. కాలుష్యం నుంచి వీలైనంత వరకూ దూరంగా ఉండాలి. ఎలాంటి క‌ణుతులు, గ‌డ్డ‌లు క‌నిపించినా అశ్ర‌ద్ధ చేయ‌కుండా స్క్రీనింగ్ ప‌రీక్ష‌లు చేయించుకోవాలి. ముంద‌స్తుగా గుర్తించి చికిత్స తీసుకోవ‌డం ద్వారా క్యాన్స‌ర్ల‌ను జ‌యించొచ్చు.

ఆరోగ్యకరమైన జీవనశైలితో క్యాన్సర్‌కు చెక్‌ పెట్టొచ్చు. ఆరోగ్యకరమైన జీవనశైలి వల్ల శరీరమే తనలో మొలకెత్తే క్యాన్సర్‌ కణాలను ఎప్పటికప్పుడు చంపేస్తుంది. కాబట్టి మంచి జీవనశైలిని అలవర్చుకోండి ఆరోగ్యంగా జీవించండి.

Leave a Comment