Cough causes : ఆగకుండా దగ్గు వస్తుందా.. జాగ్రత్తగా ఉండండి

By manavaradhi.com

Published on:

Follow Us
Cough

దుమ్ము, ధూళి శరీరంలోకి వెళ్ళకుండా కాపాడే వాటిలో దగ్గు కూడా ఒకటి. బయటి నుంచి శ్వాస వ్యవస్థకు ఎలాంటి సమస్య ఎదురైనా ఊపిరి తిత్తుల్లోని గాలి, దగ్గు రూపంలో బయటకు వచ్చి సమస్యను తొలగిస్తుంది. సాదారణంగా దగ్గు రానివారంటూ ఎవరూ ఉండరు. సీజన్ మారినప్పుడల్లా కొందరికి జలుబుతోపాటు దగ్గు కూడా వస్తుంటుంది. ఎప్పుడో అలా అరుదుగా దగ్గు వచ్చినా, ఎవరికీ ఆందోళనకరంగా ఏమీ అనిపించదు.

ఏదో జలుబు, జ్వరం వచ్చినప్పుడు కూడా దగ్గు రావచ్చు కాకపోతే, కొద్ది రోజుల్లో లేదా ఒకటి రెండు వారాల్లో తగ్గిపోతుంది. కొంతమందిలో ఈ సమస్య నెలలే కాదు ఏడాది గడచినా తగ్గకపోవచ్చు. నిజానికి ఈ రోజుల్లో ఎక్కువమంది డాక్టర్‌ను కలుస్తున్న ఒక పెద్ద కారణం ఈ దగ్గు సమస్యే. దగ్గు అనేది నిజానికి వ్యాధి లక్షణమే తప్ప వ్యాధి కాదు. అందువల్ల దగ్గు కారణాన్ని కనుక్కుంటే దగ్గుకు వైద్యం కనుకున్నట్లే అవుతుంది.

అసలు మీకు వచ్చిన దగ్గు ఎటువంటిది… దేని వల్ల వచ్చింది అన్న విషయాన్ని గుర్తించాలి. దగ్గు సమస్య కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో మరింత తీవ్రం అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో దగ్గు నుంచి బయట పడే మార్గాలను అన్వేషించాలి. సాధారణంగా ఆస్థమాలో చాలావరకూ పొడి దగ్గు, విడవకుండా వేధిస్తుంటుంది. రోజంతా ఉన్నా రాత్రిపూట మరీ ఎక్కువగా ఉండొచ్చు.దీన్ని గుర్తించి వైద్యులు ఆస్థమాకు సంబంధించిన పరీక్షలు చేయిస్తే విషయం బయటపడుతుంది. వీరికి ఆస్థమా చికిత్స ఆరంభిస్తే దగ్గు తగ్గిపోతుంది.

ఊపిరితిత్తుల్లోని శ్వాసనాళాలు వాచిపోయి వచ్చే బ్రాంకైటిస్‌లో కూడా దగ్గు ఇలాగే దీర్ఘకాలం వేధిస్తుంటుంది. హైబీపీ వంటి కొన్ని రకాల సమస్యలకు వాడే మందుల వల్ల కూడా దగ్గు వీడకుండా వేధిస్తుంటుంది. కాబట్టి ఏవైనా మందులు మొదలుపెట్టిన తర్వాత దగ్గు వేధిస్తుంటే ఆ విషయాన్ని తప్పనిసరిగా వైద్యుల దృష్టికి తీసుకువెళ్లాలి.

సాదారణ దగ్గు నుంచి త్వరగా ఉపశమనం పొందాలంటే.. శరీరాన్ని ఏ సీజన్ లో అయినా హైడ్రేషన్ లో ఉంచుకోవాలి. అందుకు నీరు ఒక ఉత్తమైన మార్గం. గోరువెచ్చని నీళ్ళను త్రాగడం వల్ల గొంతు నొప్పిని తగ్గిస్తుంది. దగ్గుకు గురైనప్పుడు కొద్దికొద్దిగా నీళ్ళను త్రాగడం మొదలుపెట్టండి. ఇది ఖచ్చితంగా దగ్గు తగ్గుముఖం పడేలా చేస్తుంది. వేడిగా కాఫీ లేదా టీ లేదా వేడి వేడిగా మీకు ఇష్టమైన సూప్స్ తీసుకోవడం వల్ల దగ్గకు తక్షణ ఉపశమనం కలిగిస్తుంది.

చలికాలంలో చాలా పొడిబారి ఉంటుంది మరియు దగ్గు చాలా క్రమంగా పెరుగుతుంటుంది. అందుకు ఆవిరి పట్టిస్తే తక్షణ ఉపశమనం కలుగుతుంది. అత్యధికుల్లో ఉండే పొగతాగే అలవాటు ఈ సమస్యకు ఒక పెద్ద కారణం. పొగతాగడం మానుకోవాలి. మద్యం అలవాటు ఉంటే వెంటనే మానేయడం తప్పనిసరి. ఫ్యాటీ ఫుడ్స్‌కి దూరంగా ఉండాలి. భోజనం ఎప్పుడూ తక్కువ మోతాదులోనే తీసుకోవాలి. ఈ జాగ్రత్తలతో సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. ఒకవేళ అప్పటికీ ఉపశమనమూ కలగకపోతే, మీకు ద గ్గు రావడానికి మరేదో కారణం ఉందని భావించాలి. ఎంత మాత్రం నిర్లక్ష్యం చేయకుండా వైద్యున్ని సంప్రదించాలి.

Leave a Comment