Knee Pain: ఈ ఆహారాలు తీసుకోవడం వల్ల మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం

By manavaradhi.com

Published on:

Follow Us
knee pain foods

మారుతున్న జీవనవిధానం, ఆహారపు అలవాట్లు చిన్న వయసులోనే మోకాళ్ల నొప్పులను తెచ్చిపెడుతున్నాయి. ఆరవై ఏళ్ల వయసులో వచ్చే మోకాళ్ల నొప్పులు ఇప్పుడు నలభైఐదేళ్లకే కనిపిస్తున్నాయి. ఇటీవల పెరుగుతున్న స్థూలకాయం, బహుళ అంతస్తులలో నివాసం, ఎగుడుదిగుడు ప్రాంతాల్లో నడక వంటి కారణాలతో మోకాలిలో నొప్పి సమస్య పెరుగుతోంది. మంచి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ద్వారా మోకాలి నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు.

మోకాలు.. శరీరం బరువును మోస్తూ .. మనిషిని నిలబడటానికి సహకరించే ముఖ్యమైన అవయవం. దాదాపు 40 సంవత్సరాలు దాటిన ప్రతి 10 మందిలో ముగ్గురు నుంచి నలుగురికి మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనశైలి దృష్ట్యా ఈ మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. మెనోపాజ్‌కు చేరుకున్న మహిళల్లో క్యాల్షియం లోపం వల్ల ఈ సమస్య మరింత ఎక్కువవుతుంది.

నొప్పులను తగ్గించే ఆహారాల్లో ప్రధానంగా చెప్పుకోవలసింది అల్లం. అల్లంను ప్రతి రోజూ డైట్ లో చేర్చుకోవడం వల్ల కీళ్ళ వాపులను తగ్గిస్తుంది. పచ్చి అల్లంలో ఉండే జింజరోల్స్ వల్ల ఇలా నొప్పినివారిస్తుంది. అల్లం తీసుకోవడం వల్ల అధికంగా కీళ్ళకు సంబంధించిన సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. అల్లం తర్వాత చెప్పుకోవలసింది బ్లూ బెర్రీస్ గురించే. ఇవి అనామ్లజనకాలే కాకుండా అధిక పోషకాలను కలిగి ఉంటాయి. ఇవి నొప్పిని తగ్గించడానికి సహాయం చేస్తాయి. వీటితో పాటు స్ట్రాబెర్రీలు, నారింజలు లాంటి ఇతర పండ్లు కూడా ఇదే తరహా లక్షణాన్ని కలిగి ఉంటాయి.

  • మెగ్నీషియం అధికంగా ఉండే గుమ్మడి కాయ గింజలు నొప్పి నివారణలో అద్భుతమైన పాత్ర పోషిస్తుంది. అనేక విధాలా ప్రయోజనాలు అందిస్తుంది. మరింత ఉపశమనం కోసం గుమ్మడి గింజలతో పాటు, బాదం, జీడిపప్పు, ముదురు ఆకుపచ్చ రంగులో ఉండే కూరలు, బీన్స్ మరియు పప్పులను ఆహారంతో పాటు తీసుకోవాలి.
  • సీ ఫుడ్స్ ముఖ్యంగా చేపలు, వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ నొప్పినివారిణి మరియు యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఒమేగా 3, శరీరంలో నొప్పి నివారించడానికి ఉపయోగపడే రక్తప్రవాహాన్ని పెంచుతుంది. మరియు చేపనూనె కార్డియో వ్యాస్కులర్ వ్యాధులకు మంచిదిగా భావిస్తారు. దీర్ఘకాలిక నొప్పులను నివారించడానికి ఆహారంలో చేపలు లేదా చేప నూనె మాత్రలు తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక నొప్పులు ఏ రకంవైనా తగ్గించడానికి ఉపయోగపడతాయి .
  • పసుపు నొప్పి మరియు వాపు తగ్గించే ఒక ఉత్తమ నివారిణి. కీళ్ళ నొప్పులు ఆర్థరైటిస్ కు కారణం అవుతుంది. కాబట్టి మీ రెగ్యులర్ డైట్ లో పసుపును ఉపయోగించడం వల్ల ఆరోగ్యానికి మాత్రమే కాదు మోకాళ్ళ నొప్పులకు కూడా ఉపశమనం కలిగిస్తుంది.

గ్రీన్ టీ సాధారణంగా బరువు తగ్గించడం కోసం ఉపయోగిస్తారు, కానీ అది కూడా వాపులను తగ్గించడంలో సహాయపడే శోథ నిరోధక గుణాలను కలిగి ఉంది . గ్రీన్ టీ రోజువారీ ఒక కప్పు తీసుకోవడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చు.ఆలివ్ ఆయిల్ చాలా ఉపయోగకరం. ఇది నొప్పులను మరియు వాపులను నివారించడంలో అద్భుతంగా సహాయపడుతుంది. వంటకు ఆలివ్ ఆయిల్ ను ఉపయోగించడం చాలా ఉపయోగకరం మరియు ఆరోగ్యకరం కూడా.ఎర్రగా మరీ చిన్నగా ఉండే చెర్రీ పండ్లలో యాంటీఆక్సిడెంట్స్ మరియు యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఆర్థరైటిస్ నొప్పులను నివారించడంలో అద్భుతంగా సహాయపడుతాయి. వీటిని ఆహారంలో భాగం చేసుకుంటే నొప్పులను నివారించుకోవచ్చు.


మిరపకాయలు, మిరియాలు సైతం నొప్పి నివారణలో బాగా సాయం చేస్తాయి. వీటిని తీసుకోవడం ద్వారా జాయింట్లలో నొప్పిని తగ్గించుకోవచ్చు. ఇలా మోకాలు నొప్పులను తగ్గించే ఆహారాలు ఎన్నో ఉన్నప్పటికీ, అవన్నీ పూర్తిగా ఉపశమనాన్ని అందించలేవు. సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు వైద్యుని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి.

మోకాలి నొప్పుల్ని తగ్గించుకోవటానికి చాలా రకాల మెడిసిన్స్‌ ఉపయోగిస్తారు. ఇలా ఉపయోగించటం వల్ల తాత్కాలిక ఉపశమనం పొందుతారు. కానీ ఆ మెడిసిన్‌ ప్రభావం మాత్రం దీర్ఘకాలిక సమస్యలకు దారి తీస్తుంది. అందుకే వీలైనంత వరకు సహజ సిద్ధంగా తగ్గించుకోవటానికి ప్రయత్నిస్తే మంచిది.ఇందుకు ఆహారంలో మార్పులు చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే మోకాళ్ల నొప్పుల నుంచి కాస్త ఉపశమనం కలుగుతుంది.

Leave a Comment