Morning Walk Tips: మార్నింగ్ వాక్ మంచిదే.. కానీ అంతకంటే ముందు ఈ టిప్స్‌ పాటించాలి..!

By manavaradhi.com

Updated on:

Follow Us
Morning Walk Tips

నడవండి.. ఆరోగ్యంగా ఉండండి. ఇది అందరికీ తెలిసిందే. అయితే, నడవడమంటే ఏదో నడిచాం.. అన్నట్లు కాకుండా దానికి కొన్ని విధానాలు ఉన్నాయి. అలా నడిస్తేనే అనుకున్న లాభాలను పొందుతారు. స్టార్టింగ్‌లో ఎలా నడవాలి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ఏ చోట్ల నడవాలి.. ఇలాంటవన్నీ తెలుసుకోవడం చాలా ముఖ్యం.. అదే విధంగా.. అప్పుడే వాకింగ్ స్టార్ట్ చేసినవారు తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

నడక వల్ల దేహదారుఢ్యం పెరుగుతుంది. దీని వల్ల జీవితకాలం పెరుగుతుంది. ఒత్తిడి తగ్గుతుంది ఈ కారణంగా నిద్రకు ఉపయోగపడుతుంది. క్యాన్సర్ వంటి జబ్బులు కూడా రాకుండా ఉంటాయి. ఇది శరీరంలోని అన్ని భాగాలకు చాలా మంచిది. రెగ్యులర్‌గా వర్కవుట్ చేయని వారు కూడా నడవడం వల్ల ఎన్నో లాభాలు ఉంటాయి. కాబట్టి రెగ్యులర్‌గా నడవడం ప్రాక్టీస్ చేయండి. అయితే, నడిచేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటే అందుకు తగ్గ ఫలితాలు వస్తాయి.

ఆరోగ్య సమస్యలు వచ్చాక బాధపడే బదులు రాకముందు నుంచే తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. అందుకోసం తప్పకుండా మనం మనపై శ్రద్ధ తీసుకోవాలి. మనకంటూ కొన్ని నియమాలు పాటించాలి. వాకింగ్ చేయడం అప్పుడే ప్రారంభించిన వారు.. మొదటి రోజే ఎక్కువ దూరం, ఎక్కువ సమయం నడవకూడదు. మామూలుగా 10 నిమిషాల నుంచి 15 నిమిషాల వరకూ నడవవచ్చు. ఆ తర్వాత నుంచి సమయం, వేగం పెంచాలి. ఎందుకంటే మొదటి రోజే ఎక్కువ దూరం నడవడం వల్ల త్వరగా అలసిపోతాం.. ఆ తర్వాత రోజుకి నడవడానికి అంతగా ఆసక్తి చూపం. కాబట్టి ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి.

నడిచేటప్పుడు సమయంపై కూడా దృష్టి సారించాలి. ఎప్పుడూ పడితే అప్పుడు నడిస్తే అనుకున్న ఫలితాలు రావు.. ఉదయం, సాయంత్రం వేళల్లోనే నడవడం వల్ల లాభాలు ఉంటాయి. ముఖ్యంగా ఉదయం నడిస్తే గనుక ఆ ఎనర్జీ మీకు రోజంతా ఉంటుంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో నడుస్తుండడం, సూర్యుడు ఉదయించినప్పుడు ఆ కిరణాలను ఆస్వాదించడం ద్వారా మనసుకి ఎంతో ఆహ్లాదమే కాకుండా డి విటమిన్ కూడా దొరుకుతుంది. కాబట్టి ఉదయం వేళలో నడవడం అలవాటు చేసుకోండి. ఇదే మీలో ఉత్సాహాన్ని పెంపొందిస్తుంది.

ఉదయం వేళలో నడవడం వల్ల మంచి పాజిటీవ్ ఎనర్జీ వస్తుంది. ఇది ఆ రోజుకి సరిపడా ఉత్సాహాన్ని ఇస్తుంది. అదే విధంగా, సాయంత్రం వేళలోనూ చల్లని గాలిని ఆస్వాదిస్తూ నడవడం బావుంటుంది. దీని వల్ల మార్నింగ్ నుంచి ఎదురైన చికాకులు పటాపంచలు అవుతాయి. ఈ కారణంగా రాత్రుళ్లు హాయిగా నిద్రపడుతుంది. నిద్రలేమి సమస్యలు దూరం అవుతాయి. కాబట్టి మీకు ఈ రెండు సమయాల్లో ఎప్పుడూ వీలవుతుందో చూసి అలా నడవడం మొదలుపెట్టండి.

నడిచేందుకు సరైన షూస్‌ని ఎంచుకోవాలి. కొంతమంది కొత్తవి కొనుక్కుంటారు. అలాంటప్పుడు వాటిని కొనేటప్పుడే షాపింగ్ మాల్ లోనే వేసుకుని నడవాలి. అవి మనకి సౌకర్యంగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. అలా ఉన్నప్పుడే మనం నడిచేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావు. హాయిగా నడుస్తాం. అలా కాకుండా సైజ్ చిన్నవి అయితే అసౌకర్యంగా ఉంటాయి. అదే పెద్దవి అయితే జారిపోతుంటాయి. ఇలా ఎప్పుడూ కూడా ఉండదు సరైన సైజ్ షూ తీసుకోవాలి. షూని మనం వేసుకున్నప్పుడు సౌకర్యంగా ఉన్నాయని అనిపించాలి. అప్పుడే వాటితో హాయిగా నడవగలం.

వాకింగ్ చేసేటప్పుడు .. ఆ ప్రదేశం ఎలాంటిది అన్నది కూడా ముఖ్యమే. కొంతమంది రహదారులు, ఫుట్‌పాత్‌లపై నడుస్తుంటారు. అలా కాకుండా పచ్చని చెట్లు, ప్రకృతి పరిసరాల్లోని మైదానాలలో నడవడం మంచిది. నిజానికీ మట్టిలో, పచ్చిక బైళ్ల నడుమ నడవడం మంచిది. ఇది మన పాదాల ద్వారా ఉత్తేజాన్ని మనలో నింపుతుంది. అయితే, సిటీల్లో అది కుదరకపోవచ్చు. కానీ, పార్కులు అయితే ఇప్పుడు అన్నీ చోట్ల ఉంటున్నాయి. కాబట్టి పార్కుల్లో నడవడం అలవాటు చేసుకోండి. ఇలా రెగ్యులర్‌గా అక్కడ నడవడం, జాగింగ్ చేయడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి.

నడిచేటప్పుడు శరీర విధానంపై కూడా జాగ్రత్త వహించాలి. వాకింగ్ మొదలు పెట్టేటప్పుడు, తగ్గించేటప్పుడు వేగంగా ఉండకూడదు. మెల్లిగా మొదలుపెట్టి.. వేగం పెంచి.. ఆపేటప్పుడు వేగాన్ని తగ్గించాలి. అదేవిధంగా.. వేసుకునే బట్టలు కూడా బిగుతుగా ఉండకుండా వదులుగా ఉండేవాటినే ధరించాలి. ఏవైనా ఆరోగ్య సమస్యలుంటే ముందుగా డాక్టర్ సలహా తీసుకోవాలి. అదేవిధంగా, ప్రతిరోజు 30 నుంచి 45 నిమిషాలు నడిస్తే మంచిది. మరికొంతమంది పక్కవారితో మాట్లాడుతూ, కబుర్లు చెప్పుకుంటూ నడుస్తుంటారు. ఎందుకంటే నడిచేటప్పుడు శ్వాస నియంత్రణ అవసరం.

ఆధునిక జీవన విధానం యాంత్రికంగా మారడంతో తగిన వ్యాయామం క‌రువై శరీర నియంత్రణ లేకుండా పోతోంది. ఫ‌లితంగా బీపీ, షుగర్‌, స్థూలకాయం వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. వీట‌న్నింటికి విరుగుడు ఒక్క‌టే.. అది న‌డ‌క‌. ఉద‌యం కానీ, సాయంత్రం కానీ వాకింగ్ చేయ‌డం వ‌ల్ల శ‌రీరం ఆరోగ్యంగా త‌యారై వ్యాధినిరోధ‌క శ‌క్తిని పొంది వ్యాధులు రాకుండా కాపాడుతుంద‌ని ప‌రిశోధ‌కులు చెప్తున్నారు.

Leave a Comment