క్యాన్సర్ అత్యంత ప్రాణాంతక వ్యాధి. ప్రస్తుత కాలంలో క్యాన్సర్ తో చనిపోయే వారి సంఖ్య ఎక్కువగా పెరిగిపోతుంది. క్యాన్సర్ కు వయస్సు తో సంబంధం లేదు. ప్రతి ఏటా ఏంతో మంది దీని బారిన పడి మరణిస్తున్నారు. ఈ వ్యాధి సోకడానికి ముఖ్య కారణం జన్యువులు, జీవన శైలి, ఆహారపు అలవాట్లు వల్ల ప్రాణాంతక వ్యాధిన బారిన పడుతున్నారు.
ఈ మధ్య కాలంలో మనిషిని ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న వ్యాధుల్లో క్యాన్సర్ ముందు వరుసలో ఉంటుంది. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లలో మార్పుల కారణంగానే వస్తున్నాయంటున్నారు వైద్య నిపుణులు. క్యాన్సర్ అనేది శరీరంలో ఎక్కడైనా వచ్చే అసాధారణమైన కణాల అనియంత్రిత పెరుగుదల. ఈ కణాలు సాధారణ శరీర కణజాలాలను చొరబాట్లు చేయగలవు. సాధారణంగా మన శరీరంలో కణ విభజనలు ఒక క్రమ పద్ధతిలో నియంత్రించబడతాయి. కొన్ని సందర్భాలలో కణాల పెరుగుదలలో నియంత్రణ లేనందువల్ల కణాలు చాలా వేగంగా అస్తవ్యస్తంగా విభజన చెంది కణ సమూహాలను ఏర్పరుస్తాయి. ఈ కణ సమూహాలనే క్యాన్సర్లుగా పిలుస్తారు. క్యాన్సర్ మన శరీరంలో ఏ భాగానికైనా వచ్చే ప్రమాదం ఉంది. శరీరం నుంచి ఏ ప్రాంతంలోనైనా రక్తం కారినా, గడ్డలుగా ఏర్పడిన క్యాన్సర్ లక్షణాలుగా గుర్తించాలి.
క్యాన్సర్ రావడానికి కారణాలు ఏంటి …?
ఎందుకు వస్తుందో ఎవరికి వస్తుందో ఎలా వస్తుందో అర్థం కాని మహమ్మారి క్యాన్సర్. అయితే కొన్ని రకాల ఆహార పదార్థాల జోకిలి పోకుండా ఉంటే క్యాన్సర్ వచ్చే అవకాశాలను తగ్గించుకోవచ్చు. పౌష్టికాహార లేమి వల్ల పెద్ద పేగు క్యాన్సర్, నోటి క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్లు, రొమ్ము క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. అందువల్ల పరిశోధకులు పోషకాహారంతో కూడిన ఆహారం తీసుకోవాలని వెల్లడించారు. అందుకోసం పొట్టుతీయని ధాన్యాలు తీసుకోవాలి. పాల ఉత్పత్తులను తక్కువగా తినడం, ప్రాసెస్ చేసిన మాంసం, కూరగాయలు తక్కువగా తినడం, పండ్లు తినకపోవడం, చక్కెర ఎక్కువగా తీసుకోవడం లాంటి కారణాల వల్ల క్యాన్సర్ ముప్పు వచ్చే ప్రమాదం ఉంది. అంతేకాదు బెవరేజెస్ లు తీసుకోవడం వల్ల కూడా క్యాన్సర్ ముప్పు పొంచి ఉంటుంది.
మన జీవనశైలితో పాటు మనం తీసుకునే ఆహారం ఈ క్యాన్సర్ వ్యాధికి ప్రధాన కారణం. మనం తీసుకునే ఆహారపదార్థాల ద్వారా క్యాన్సర్ ను చాలా వరకూ నిరోధించుకోవచ్చు. పోషక విలువలున్న ఆహార పదార్థాలను నిత్యం తీసుకుంటూ ఉంటే… అందులోని పోషక గుణాలు క్యాన్సర్ కారకాలకు వ్యతిరేకంగా పోరాడతాయి.
క్యాన్సర్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి…?
క్యాన్సర్ రాకుండా నివారించుకోవచ్చా.. అంటే దీనికి కచ్చితంగా సమాధానం దొరకదు. క్యాన్సర్ ను ఖచ్చితంగా నివారించే పద్దతి ఏదీ లేదు. కానీ కొన్ని మంచి అలవాట్లు ద్వారా ముందు జాగ్రత్త ద్వారా క్యాన్సర్ వచ్చే అపాయాన్ని కొంతవరకూ తగ్గించుకోవచ్చు. ధూమపానం, నికోటిన్ సంబంధించిన పదార్థాలకు దూరంగా వుండటం మంచిది. అలాగే కొవ్వు తక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలి. కూరగాయలు, పండ్లు, ముడి ధాన్యం, అధికంగా తీసుకోవాలి.
ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఎత్తుకు తగ్గ బరువును మెయింటైన్ చేయాలి. అధిక బరువు పెరగకుండా జాగ్రత్తపడాలి. ఎండ వేళల్లో గొడుగు ధరించాలి. కాలుష్యం నుంచి వీలైనంత వరకూ దూరంగా ఉండాలి. జీవనశైలిలో మార్పులు చేసుకొని పోషకాహారం తీసుకోవాలి. ఎలాంటి కణుతులు, గడ్డలు కనిపించినా అశ్రద్ధ చేయకుండా స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి. ముందస్తుగా గుర్తించి చికిత్స తీసుకోవడం ద్వారా క్యాన్సర్లను జయించొచ్చు.
శరీర బరువు నియంత్రణ, మంచి పోషకాహార అలవాటు, శారీరక శ్రమ, తీవ్రమైన ఎండ పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పొగాకు ఉత్పత్తులకు అలవాటుకు దూరంగా ఉండడం, క్రమం తప్పకుండా చెకప్ చేయించుకోవాలి. శరీరంలో గడ్డలు కనిపిస్తే వైద్యున్ని సంప్రదించడం వంటి సత్వర జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా క్యాన్సర్ నుంచి రక్షణ పొందవచ్చు.