ప్రస్తుత తరంలో ఎక్కువ మందిని వేధిస్తోన్న సమస్య మలబద్ధకం.. మారుతోన్న జీవనశైలి, సరైన ఆహారం తీసుకోకపోవడం, శరీరానికి కావాల్సిన నీటిని ఇవ్వకపోవడం వంటి పలు కారణాల వల్ల ఇది వస్తుంది. కారణాలు ఏవైనా ఇది చాపకింద నీరులా విస్తరిస్తోందనడంలో సందేహం లేదు.
సాధారణంగా వీకెండ్స్ లేదా లాంగ్ లీవ్స్ వచ్చినప్పుడు ఎక్కడికైనా ట్రిప్ వెళ్తామని చాలా ఉత్సాహంగా ఉంటారు. ఎక్కడైకనా ప్రయాణం చేయాలనుకొన్నప్పుడు ముందస్తు ప్లానింగ్ మరియు జాగ్రత్తలు తీసుకుంటే మీ ప్రయాణం హాపీగా జరగుతుంది. ప్రయాణాల్లో పెద్ద ఎత్తున ఆహార మార్పులు చేసుకోవాల్సి వస్తుంది. దీంతో చాలామందికి మలబద్దకం సమస్య వచ్చే అవకాశం ఉంది. పీచు పదార్థాలు తీసుకోకపోవడం, ఎక్కువగా ప్యాకేజీ ఫుడ్స్ పై ఆధారపడడం, కొత్త కొత్త వంటకాలు తినడం, నీరు సరిగా తీసుకోకపోవడం, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం.. వాతావరణ మార్పులు లాంటి కారణాలు ఎన్నో ఉన్నాయి.
మాంసాహారల్లో చేపలు, మరియు చికెన్ మరియు రెడ్ మీట్ తో తయారుచేసే ఆహారాలు తీసుకోవడం వల్ల అజీర్ణంకు గురిచేస్తుంది. అంతే కాదు ప్రయాణానికి ముందు మరియు ప్రయణాలు ఇటువంటి నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ ను మీ రెగ్యులర్ డైట్ ను తప్పనిసరిగా తొలగించాలి. కారంతో తయారు చేసిన గ్రేవిలు తీసుకోవడం వల్ల కడుపులో మంట పుట్టిస్తుంది చాలా మంది ప్రయానికులు ప్రయాణంలో స్టొమక్ అప్ సెట్ట్ అవ్వడంతో చాలా బాధ పడుతుంటారు. కాబట్టి ప్రయాణానికి ముందు చాలా తేలికపాటి ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి.
ప్రయాణాలు చేసేటప్పుడు చాలా మంది ఎక్కువగా ప్యాకేజీ పుడ్స్ మీదే ఆధారపడుతూ ఉంటారు. ఈ ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఆరోగ్యకరంగా ఉంటుందని ఆశించడం అంతా మంచిది కాదు. వీటిలో పీచు పదార్థం పాళ్లు చాలా తక్కువ. కాబట్టి ప్రయాణాలు చేసేవారు వీలైనంత వరకు ఈ ప్యాకేజీ ఫుడ్ తీసుకోకుండా ఉంటే మంచిది. మరోవైపు శరీరానికి తగినంత పీచు పదార్థం అందించేందుకు పండ్లు తీసుకోవచ్చు. ఇంటి దగ్గర నుంచి తృణధాన్యాలు తీసుకుని వెళ్ళాలి. వీలైతే డ్రై ఫ్రూట్స్ తీసుకుని వెళితే మరింత మంచిది. ప్రయాణాలు చేసినా, ఇంట్లో ఉన్నా మంచి పీచు పదార్థం ఉన్న ఆహారం తీసుకోకపోవడమే మలబద్దకానికి ప్రధాన కారణం.
ప్రయాణాలు చేసే వారు తరచూ స్వీట్లు, చాక్లెట్లు తింటూ ఉంటారు. దీనివల్ల మలబద్దకం మరింత పెరుగుతుంది. ప్రయాణాల్లో ఉన్నా రోజూ రెండున్నర కప్పుల కూరగాయలు, 2 కప్పులు పండ్లు, బీన్స్ తీసుకునేలా చూసుకోవాలి. కాబట్టి తక్కువ ఫైబర్ ఉన్న పదార్థాలను వీలైనంత వరకు తగ్గించడం మంచిది. ముఖ్యంగా చిరు తిళ్లు, పిజ్జాలు, చిప్స్, ఐస్ క్రీములు, డెజర్ట్ లకు దూరంగా ఉండటమే మేలు.
ఆరోగ్యకర జీవనం కోసం మనిషి రోజుకు కనీసం 3 నుంచి 5 లీటర్ల మంచి నీటిని తాగాలి. దీని కంటే తక్కువ స్థాయిలో నీటిని తీసుకోవడం వల్ల శరీరంలో నీటి శాతం తక్కువ అయి డీహైడ్రేషన్ కు గురవుతుంది. అలాంటి సమయంలో శరీరం తనకు కావాల్సిన నీటిని మూత్రం, మలం నుంచి తీసుకుంటుంది. ఫలితంగా మూత్ర సంబంధిత సమస్యలు, మలబద్ధకం వంటివి వస్తుంటాయి. కాబట్టి ఎక్కువగా మంచి నీరు తీసుకోవాలి. అలాగే ప్రయాణాల్లో కాఫీ, టీతోపాటు ఆల్కహాల్ కూడా తగ్గించాలి.
ప్రయాణాల్లో ఎక్కువ గంటలు కూర్చునే ఉండాల్సి వస్తుంది. కాబట్టి ప్రయాణం ముగిసిన వెంటనే శరీరానికి తగిన వ్యాయామం ఉండేలా చూసుకోవాలి. ప్రయాణాల్లో టాయిలెట్ల సౌకర్యం సరిగ్గా ఉండదు. దీంతో ఒక్కోసారి మల, మూత్ర విసర్జనను ఆపుకోవాల్సి వస్తుంది. ఇది చాలా ప్రమాదకరం. దీని వల్ల కూడా మలబద్ధకం ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి టాయిలెట్ సమయాలను సరిగ్గా ప్లాన్ చేసుకోవడం మంచిది..
ప్రయాణ సమయాల్లో తీసుకునే ఆహారంలో మార్పులు చేయడం ద్వారా మల బద్ధకానికి చెక్ పెట్టవచ్చు. తీసుకునే ఆహారంలో పీచు పదార్థాల స్థాయి ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఫైబర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆహారం సులువుగా జీర్ణమవుతుంది. ఫలితంగా మల బద్ధకం సమస్య ఏర్పడకుండా ఉంటుంది.