Multiple Endocrine Neoplasia – మల్టిపుల్ ఎండోక్రైన్ నియోప్లాసియా మొదటి రకం ఎదురయ్యే సమస్యలేమిటి..?

By manavaradhi.com

Published on:

Follow Us
Multiple Endocrine Neoplasia

శరీరంలో హార్మోన్లు, గ్రంథులు మనకు కనిపించవుగానీ… వివిధ శరీర భాగాల పై అది చూపించే ప్రభావం ఎంతో ఉంది. పిట్యూటరీ, థైరాయిడ్ గ్రంథుల్లో వచ్చే సమస్యల వల్ల ఎదురయ్యే సమస్యల్లో ఎండోక్రైన్ సమస్యలు ప్రధానమైనవి. మల్టిపుల్ ఎండోక్రైన్ నియోప్లాసియాగా పిలిచే ఈ సమస్యల్లో మొదటి రకం సమస్యల గురించి తెలుసుకుందాం..

మానవ శరీరంలో ఒక కణం నుంచి మరో కణానికి, ఒక కణజాలం నుంచి మరో కణజాలానికి వర్తమానాల్ని పంపేందుకు మరియు కొన్ని ప్రత్యేక పనులు నిర్వర్తించేందుకు కొన్ని రసాయనాలు తోడ్పడతాయి. ఈ రసాయనాన్ని కొన్ని గ్రంథులు ఉత్పత్తి చేస్తుంటాయి. ఈ రసాయనాలు శరీరంలో ఉత్పత్తి అవుతూ… శరీరంలోని కొన్ని భాగాల మీద తమ ప్రభావాన్ని చూపిస్తుంటాయి. ఉదాహరణకు ఎడ్రినల్ గ్రంధి నుంచి ఎడ్రినల్ అనే రసాయనం ఉత్పత్తి అవుతుంటుంది. దీని ప్రభావం దానికి దూరంగా ఉన్న అవయవాల మీదా ఉంటుంది. ఎడిపోజ్ కణజాలం, ఎండ్రినల్‌గ్లాండ్స్, హైపోథలాయస్, మూత్రపిండాలు, అండాలు, పాంక్రియాజ్, పారిథైరాయిడ్ గ్రంధులు, పినియల్ గ్రంధి, పిట్యూటరి గ్రంధి, థైరాయిడ్ గ్రంధి, ఎండోక్రైన్ విభాగంలోకి వస్తాయి.

ఎండోక్రైన్ గ్రంథుల్లో హర్మోన్ల కారణంగా కణితులు రావడాన్నే మల్టిపుల్ ఎండోక్రైన్ నియో ప్లాసియా టైప్ 1 గా చెబుతారు. దీన్ని వెర్మర్ సిండ్రోమ్ గా కూడా చెబుతారు. సాధారణంగా MEN 1 లో పారాథైరాయిడ్ గ్రంథి, ప్యాంక్రియాస్ ఐలెట్ సెల్స్ మరియు పిట్యూటరీ గ్రంథుల్లో అత్యంత సాధారణ కణితులు ఏర్పడతాయి. దీనిలో అడ్రినల్ కార్టికల్ కణితులు, కార్సినాయిడ్ కణితులు మరియు అరుదైన ఫెక్రోమసిటోమస్ సహా ఇతర ఎండోక్రైన్ కణితులు జీర్ణాశయం మరియు ఇతర ప్రాంతాల్లో ఏర్పడతాయి. నాన్ ఎండోక్రైన్ కణితులులు సైతం MEN 1 లో మనకు కనిపిస్తాయి. ఇందులో రక్తకణాలు ఫైబ్రస్ టిష్యూల మీద ఏర్పడే ఫేషియల్ యాంజియో ఫైబ్రోమస్, చర్మం మీద ఎర్రని రంగులో, కొవ్వు కణితులతో కలిసి ఏర్పడే కొలాజినోమస్ కణితులు ఉన్నాయి.

నిజానికి మల్టిపుల్ ఎండోక్రైన్ నియోప్లాసియా టైప్ 1 అనేది ఒక జన్యుసంబంధమైన సమస్యగానే చెప్పుకోవాలి. దీనివల్ల వచ్చే క్యాన్సర్ రిస్క్ లు ఒక తరం నుంచి మరో తరానికి వ్యాపిస్తూ ఉంటాయి. ఒక్కో సారి తరాలు మారే కొలదీ దీని ప్రభావం తగ్గడం లేదా మరింత పెరగడం లాంటి సమస్యలు ఏర్పడుతుంటాయి. అందుకే కుటుంబంలో ఎవరికైనా ఈ సమస్య ఉందంటే… అందరూ దాని నుంచి రక్షణ పొందే మార్గాలను ఏర్పాటు చేసుకోవలసి ఉంటుంది. ప్రతి 30 వేల మందిలో ఒకరికి ఈ సమస్య ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో 90 శాతం మందికి వంశపారంపర్యంగా ఈ వ్యాధి సోకితే, 10 శాతం మందికి మాత్రం కుటుంబంతో సంబంధం లేకుండా ఈ సమస్య ఏర్పడింది. తీసుకునే ఆహారం, పెరిగిన వాతావరణం, కుటుంబాల్లో వస్తున్న మార్పులు తదితర అంశాలు సైతం MEN1 ను ప్రభావితం చేస్తాయి. అందుకే శరీరం మీద ఈ సమస్యకు సంబంధించి ఎలాంటి సూచనలు కనిపించినా వెంటనే వైద్యుణ్ని సంబంధించి కుటుంబం మొత్తం జాగ్రత్త పడ్డం ఎంతో అవసరం.

పారాథైరాయిడ్ ట్యూమర్, ప్యాంక్రియాటికి ఐలెట్ సెల్ ట్యూమర్, పిట్యూటరీ గ్లాండ్ ట్యూమర్… వీటిలో ఏ రెండు ట్యూమర్లు ఉన్నట్టు కనిపించిన మల్టిపుల్ ఎండోక్రైన్ నియోప్లాసియా టైప్ 1 ఉన్నట్లుగానే అనుమానించాలి. మూడిట్లో ఒక ఐలెట్ సెల్ కి ట్యూమర్ వచ్చిందంటే… అది క్యాన్సర్ గానే భావించాలి. ఒక్కసారి క్యాన్సర్ మొదలైందంటే అది లివర్ వరకూ పాకుతుంది. ఇవి ఊపిరితిత్తులతో పాటు… లివర్ కు దగ్గరగా ఉండే ఇతర భాగాలకు సోకే ప్రమాదం ఉంది. అయితే ఈ ప్రమాదం చాలా తక్కువ పరిస్థితుల్లోనే కనిపిస్తుంది. అలాగే కుటుంబంలో ఎవరికైనా ఈ సమస్య ఉన్నా కచ్చితంగా దీనికి సంబంధించిన పరీక్షలు చేయించుకోవలసి ఉంటుంది. ఇందులే ప్రధానమైనది జెనిటిక్ టెస్ట్. కుటుంబంలో పెద్దవారికి ఉన్నప్పుడు పిల్లలకు కచ్చితంగా ఈ టెస్ట్ చేయించాల్సి ఉంటుంది. దీని వల్ల ముందుగానే ఈ సమస్య ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుసుకుంటే… దాన్నుంచి తప్పించుకునే అవకాశం 90 శాతం వరకూ ఉంటుంది. అదే విధంగా ఏడాది నుంచి మూడేళ్ళకు ఓ సారి రక్తపరీక్షలు చేయించుకోవాలి. ఇందులో ప్రొలాక్ట్, ఇన్సులిన్ పెరుగుదల తదితర అంశాల గురించి డాక్టర్ ను సంప్రదిస్తూ ఉండాలి. ఈ ప్రక్రియ 5 ఏళ్ళ వయసు నుంచి చేస్తూ ఉంటే మేలు. 8 ఏళ్ళ వయసు నుంచి కాల్షియం లెవల్ టెస్ట్ చేయిస్తూ ఉండాలి. 20 ఏళ్ళ తర్వాత అల్పాహారం తీసుకోవడానికి ముందు తర్వాత రక్త పరీక్షలు చేయిస్తూ ఉండాలి. ఈ క్రమంలో ఎక్కడ దీనికి సంబంధించిన సమస్యలు కనిపించినా జాగ్రత్తపడాలి.

వైద్యపరిజ్ఞానం అభివృద్ధి చెందాక ఈతరహా ట్యూమర్లను మందుల ద్వారా లేదా ఆపరేషన్ ద్వారా అదుపులోకి తేగలుగుతున్నారు. అయితే కొన్ని సమయాల్లో వీటి గురించి తెలుసుకునే సమయానికి చేదాటి పోతుండడం వల్ల వైద్యులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. అందుకే వీటిని ప్రారంభంలోనే గుర్తిస్తే సులభంగా అదుపు చేయవచ్చు.

Leave a Comment