Ears Sounds : చెవుల్లో రింగుమనే శబ్ధాలు…ఎందుకో తెలుసా?

By manavaradhi.com

Published on:

Follow Us
Cause of Noises in the EAR

చెప్పులోని రాయి.. చెవిలోని జోరిగ పెట్టే ఇబ్బంది అంతా ఇంతా కాదని అంటుంటారు. కానీ కొన్ని సార్లు ఏ జోరీగా లేకపోయినా చెవిలో ఏదో తిరుగుతున్నట్టుగా మెదడులో రొద భరించతరం కాదు. మరే పనిమీద మనసు కుదరదు. ఇలాంటి సమస్యలు చిన్నవే కానీ.. కానీ ఇవి కలిగించే ఇబ్బంది అది ఎదుర్కొంటున్న వారికే తెలుస్తుంది. వైద్య‌ప‌రిభాష‌లో టినిట‌స్‌గా పిలిచే చెవుల్లో శ‌బ్ధాలు ఎందుకు వ‌స్తాయి.?

బయట ఎలాంటి చప్పుళ్లేవీ లేకున్న‌ప్ప‌టికీ.. చెవిలో ఒకటే హోరు పెడుతుంటాయి. పక్కవారికి చెప్పినా ఈ స‌మ‌స్య అర్థం కాదు. ఇలాంటి చిత్రమైన సమస్యే చెవిలో రింగుమనే మోత.. లేదా టినిటస్ అని పిలుస్తుంటారు. కొంత మందికి చెవిలో నిరంతరంగా ఏదో ఒక శబ్ధం వినిపిస్తున్నట్టుగా ఉంటుంది. ప్రశాంతంగా ఉన్న సమయాల్లో, నిద్రలో ఈ శబ్ధాలు ఎక్కువగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. వీటి వల్ల జీవితంలో ప్రాశాంతత లోపించిన భావన కలుగుతుంది.

చెవిలో శబ్ధాలు రావడానికి చాలా కారణాలుంటాయి. మెదడులో శ్రవణ నాడికి పైన చెవికి శ్రవణ నాడికి మధ్య భాగంలో ఉండే కాక్లియాలో ఉండే ఎయిర్ సెల్స్‌లో వచ్చే తేడాల వల్ల ఇలా చెవిలో రణగొణ ధ్వనులు రావచ్చు. కొందరికి ఈల శబ్దం.. మరికొందరికి కిచకిచలు.. ఇంకొంద‌రిలో రకరకాల చప్పుళ్లు కలగలసి వినబడుతుంటాయి.

మెదడు ఒకే శబ్ధాన్ని గ్రహించగలుగుతుంది కాబట్టి అతి తక్కువ ఫ్రీక్వెన్సీలో వైట్ నాయిస్‌ను మెదడుకు చేరవేస్తుంది. అందువల్ల మెదడు చెవిలో ఏర్పడుతున్న ద్వనిని గుర్తించదు. అందువల్ల శబ్ధాలు తగ్గిపోయిన భావన కలుగుతుంది. ఇలా శబ్ధాలతో పాటుగా కళ్లు తిరగడం, తలనొప్పి, వినికిడి తగ్గడం, వాంతుల వంటి లక్షణాలుంటే మాత్రం వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. స‌బ్జెక్టీవ్ టినిట‌స్‌, ఆబ్జెక్టీవ్ టినిట‌స్ అనే రెండు ర‌కాలుగా టినిట‌స్ ఉంటుంది. ఇలాంటి సందర్భాలు మరేదైనా ప్రమాదరకరమైన స్థితి లక్షణం కావచ్చు. కాబట్టి ఎందుకు ఇలాంటి శబ్ధాలు వస్తున్నాయనే విషయాన్ని తప్పనిసరిగా నిర్ధారించుకోవాల్సి ఉంటుంది.

ఒకసారి ఒకే శబ్ధాన్ని స్పష్టంగా గ్రహించగలిగే మెద‌డు.. మరేదైనా ఇతర శబ్ధాల మీదకు దృష్టిని మళ్లించడం ద్వారా టినిట‌స్ స‌మ‌స్య నుంచి నుంచి విముక్తి పొందవచ్చని ప‌రిశోధ‌కులు గుర్తించారు. భరించడం ఇబ్బందిగా ఉన్న వారికి టినిటస్ మాస్టర్ అనే పరికరాలు అందుబాటులో ఉన్నాయి.

టినిట‌స్ స‌మ‌స్య గలవారికి వినికిడి సాధనం లేదా కాక్లియర్‌ ఇంప్లాంట్‌తో మంచి ఫలితం కనబడుతున్నట్టు ప‌రిశోధ‌న‌లో తేలింది. కెఫీన్‌, మద్యం, కొవ్వు పదార్థాలు తగ్గించటం.. పొగ తాగటం మానేయటం ద్వారా కొంతవరకు ఉపశమనం కలుగుతున్నట్టు గుర్తించారు. ధ్యానం, యోగా, ప్రాణాయామం వంటి పద్ధతులు చెవిలో హోరు వంటి చికాకు పరచే అంశాల నుంచి దృష్టి మళ్లేలా చేస్తాయి. నిశ్శబ్దమైన గదిలో ఉన్నప్పుడు సంగీతం లేదా ఒకే శ్రుతిలో ఉన్న స్వరాలు వినటం మేలు. దీంతో టినిటస్‌ చప్పుడు నెమ్మదిగా దానిలో కలిసిపోయి ఉపశమనం కలుగుతుంది

చెవుల్లో రింగింగ్ చాలామంది ప్రజలకు ఒక సాధారణ ద్రుగ్విషయం. అయితే చెవుల్లో అదేప‌నిగా ధ్వనులు రావ‌డం, రొద‌లు క‌నిపించ‌గానే వెంటనే వైద్యుడ్ని సంప్ర‌దించి త‌గు వైద్యం తీసుకోవాలి. లేనిప‌క్షంలో.. వినికిడిలోపం వ‌చ్చే ప్ర‌మాద‌మున్న‌ద‌ని గుర్తుంచుకోవాలి.

Leave a Comment